విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన చిత్రం ఖుషి. ఇప్పటివరకు రిలీజైన పాటలకు వచ్చిన రెస్పాన్స్ ఒక ఎత్తయితే మ్యూజికల్ కన్సర్ట్‌కు వచ్చిన స్పందన మరో ఎత్తు! స్టేజీపై వీరు చేసిన లైవ్ పర్ఫామెన్స్ చూసి అభిమానులు పండగ చేసుకోగా కొందరు ట్రోలర్స్ మాత్రం అతిగా ఉందని పెదవి విరిచారు. ఏదైతేనేం సెప్టెంబర్ 1న విడుదల కానున్న ఈ సినిమాకు కావాల్సినంత హైప్ వచ్చింది. ఇకపోతే సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా వీరిద్దరూ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ క్రమంలో ఒకరి గురించి మరొకరు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు.
ముందుగా సమంత గురించి విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. సమంతకు ఫుడ్ అంటే ఇష్టం. అన్నీ తింటుంది. తనకు సంతోషం వస్తే అన్నీ పంచుకుంటుంది, కానీ బాధ వస్తే మాత్రం ఎవరికీ చెప్పుకోదు. తను కోపంలో అసభ్యంగా ఏమీ మాట్లాడదు. చాలా బ్యాలెన్స్‌డ్‌గా ఉంటుంది అని తెలిపాడు. విజయ్ దేవరకొండ గురించి సమంత మాట్లాడుతూ.. 'అతడు ఎక్కువగా ఫోన్స్ మాట్లాడడు, కానీ మెసేజ్‌లు చేస్తుంటాడు. గేమింగ్ యాప్స్ బాగా ఉపయోగిస్తాడు.
విజయ్‌ను పెళ్లి చేసుకునే అమ్మాయి సింపుల్‌గా ఉండి, అతడి కుటుంబంతో కలిసిపోయేలా ఉంటే చాలు. అతడికి అలా ఉంటేనే నచ్చుతుంది' అని చెప్పుకొచ్చింది. అందుకు రౌడీ హీరో కూడా తలూపాడు. ఇకపోతే లైగర్‌తో విజయ్ దేవరకొండ, శాకుంతలంతో సమంత, టక్ జగదీశ్‌తో డైరెక్టర్ శివ నిర్వాణ ఫ్లాప్ అందుకున్నారు. ఈ ముగ్గురు తమ ఆశలన్నీ ఖుషిపైనే పెట్టుకున్నారు. మరి ఈ సినిమా వీరికి విజయాన్ని తీసుకొస్తుందా? లేదా? అనేది చూడాలి!
Comments
Please login to add a commentAdd a comment