Report: Samantha To Debut In Bollywood With Ayushmann Khurrana Movie, Deets Inside - Sakshi
Sakshi News home page

Samantha Bollywood Entry: బాలీవుడ్‌లో సమంత భారీ సినిమా.. హీరోగా ఎవరంటే?

Published Thu, Jul 7 2022 5:53 AM | Last Updated on Thu, Jul 7 2022 8:59 AM

Samantha to make Bollywood debut opposite Ayushmann Khurrana - Sakshi

‘ది ఫ్యామిలీ మేన్‌’ వెబ్‌ సిరీస్‌ సెకండ్‌ సీజన్‌తో బాలీవుడ్‌లో మంచి క్రేజ్‌ సంపాదించుకున్నారు హీరోయిన్‌ సమంత. ఆ సిరీస్‌ తర్వాత బాలీవుడ్‌లో సమంత చేయబోయే సినిమా గురించి ఇప్పటికే చాలా వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. తాజాగా మరో వార్త తెరపైకి వచ్చింది. ఆయుష్మాన్‌ ఖురానా హీరోగా నటించనున్న ఓ సినిమాలో సమంత హీరోయిన్‌గా నటించనున్నారన్నది ఈ వార్త సారాంశం. దినేష్‌ విజయ్‌ ఈ సినిమాను నిర్మిస్తారట.

ఈ సినిమాకు సంబంధించిన పేపర్‌ వర్క్‌ పూర్తయిందని, షూటింగ్‌ షెడ్యూల్స్‌ చర్చలు జరుగుతున్నాయన్నది టాక్‌. సో... హిందీలో సమంత నటించనున్న తొలి సినిమాకు అంతా సిద్ధమైందన్నమాట. అయితే అధికారిక సమాచారం అందాల్సి ఉంది. ఇదిలా ఉంటే.. హిందీలో ఓ భారీ బడ్జెట్‌ మైథలాజికల్‌ ఫిల్మ్‌కు కూడా సమంత గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారని భోగట్టా. మరోవైపు హీరోయిన్‌ తాప్సీ నిర్మాణ సంస్థ అవుట్‌సైడర్స్‌ ఫిలింస్‌లో సమంత ఓ ఉమెన్‌ సెంట్రిక్‌ ఫిల్మ్‌ చేయనున్నారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement