Samantha Ruth Prabhu Reveals Her Motivation For Workout In Gym, Deets Inside In Telugu - Sakshi
Sakshi News home page

Samantha: తన ఫిట్‌నెస్‌ సీక్రెట్‌ రివీల్‌ చేసిన సామ్‌, షాకవుతున్న నెటిజన్లు

Dec 30 2021 9:35 PM | Updated on Dec 31 2021 9:06 AM

Samantha Reveals Her Fitness Secrets Netizens Got Shock - Sakshi

Samantha Reveals Her Fitness Secret: టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ సమంత క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన గ్లామర్‌కు ఎంతమంది ఫ్యాన్స్‌ ఉన్నారో తన ఫిటనెస్‌ కూడా అంతే రేంజ్‌లో ఫాలోవర్స్‌ ఉన్నారు. ఇక ఆమె ఫిట్‌నెస్‌ ఫ్రీక్‌ అనే విషయం అందరికి తెలిసిందే. జీమ్‌లో వర్కౌట్స్‌ చేస్తూ తెగ కష్టపడుతూ జీరో సైజ్‌ను అలా మెయింటెన్‌ చేస్తోంది. నిజం చెప్పాలంటే తన బాడీ ఫిట్‌నెస్‌ వల్లే ఆమెకు ఇంకా అవకాశాలు వస్తున్నాయి. అంతేకాదు హాలీవుడ్‌ రేంజ్‌కు ఎదగడానికి ఇది కూడా ఒక కారణమని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

చదవండి: మారక తప్పదంటూ దీప్తి పోస్ట్‌, షణ్నూతో బ్రేకప్‌ తప్పదా?

అంతలా బాడీ ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యత ఇచ్చే సమంత తన శరీరాకృతి కోసం జిమ్‌లో కష్టపడేందుకు తనని ప్రోత్సహిస్తూ మోటీవేట్‌ చేసే సీక్రెట్‌ను రివీల్‌ చేసింది. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో వర్కౌట్‌ చేస్తున్న వీడియోను షేర్‌ చేస్తూ ఈ విషయం చెప్పింది.  ఇక సమంత ఫిట్‌నెస్‌ సీక్రెట్‌ చూసి అంతా ఒక్కసారిగా షాక్‌ అవుతున్నారు. అంతలా ఆశ్చర్యపరుస్తున్న సామ్‌ ఫిట్‌నెస్‌ సీక్రెట్‌ ఏంటంటే సమోసా అంట. అవును తనకు సమోసాలు అంటే మహా ఇష్టమట, కానీ ఫిట్‌నెస్‌ దృష్ట్యా వాటిని తినలేకపోతోందట. అందుకే సమోసాను ఎదురుగా పెట్టుకుని జిమ్‌లో వర్కౌట్స్‌ చేస్తుందట సామ్‌.

చదవండి: ఓటీటీ రిలీజ్‌కు రెడీ అవుతోన్న శ్యామ్‌ సింగరాయ్‌!, స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే..

వాటిని తినాలంటే శరీరంలోని క్యాలరీస్‌ కరిగించి ఆ తర్వాత లాగిస్తుందట. అలా తన జిమ్‌లో గంటలు గంటలు కష్టపడేందుకు ఈ సమోసాలు హెల్స్‌ చేస్తున్నాయని సామ్‌ తన ఇన్‌స్టా స్టోరీ ద్వారా చెప్పేసింది. ఇక ఈస్టోరీతో పాటు ఓ సామెతను కూడా పంచుకుంది ఆమె. మనం తినే ఆహారాన్ని బట్టే మన శరీరం, మన ఆలోచనలు, మన మనసు అనే అర్థం వచ్చేలా ఈ సామెత ఉంది. కాగా సమంత ప్రస్తుతం యశోద, కాతువాకుల రెండు కాదల్‌ చిత్రాలతో బిజీగా ఉంది. వీటితో పాటు పలు భారీ ప్రాజెక్ట్స్‌కు కూడా ఆమె సంతకం చేసి ఫుల్‌ బిజీ ఉంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement