
Samantha Spotted In Annapurna Studios Goes Viral : స్టార్ హీరోయిన్ సమంత పేరు ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిపోయింది. నాగ చైతన్యతో విడిపోతున్నట్లు ప్రకటించినప్పటి నుంచి సామ్‌కు సంబంధించిన ప్రతీ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా నిలుస్తుంది. ప్రస్తుతం కెరీర్‌పై ఫుల్ ఫోకస్ పెట్టిన సమంత బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తూ బిజీ అయ్యింది. తాజాగా సామ్ అన్నపూర్ణ స్టూడియోస్‌కు వచ్చినట్లు ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది.
విడాకుల అనంతరం తొలిసారి అక్కినేని కౌంపాండ్‌లో కనిపించడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అసలు సమంత అక్కడికి ఎందుకు వెళ్లినట్లు అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఇటీవలె గుణశేఖర్ దర్శకత్వంలో శాకుంతలం సినిమా షూటింగ్ కంప్లీట్ చేసిన సామ్.. డబ్బింగ్ కోసం అన్నపూర్ణ స్టూడియోస్‌కి వచ్చిందట.
చడీచప్పుడు లేకుండా సైలెంట్‌గా వచ్చి పని పూర్తి ముగించుకొని వెళ్లిందట. కాగా విడాకులు ప్రకటించడానికి కొన్నిరోజుల ముందు నుంచే నాగ చైతన్య జూబ్లీహిల్స్‌లోని ఓ ఫ్లాట్‌లో విడిగా ఉంటున్నట్లు తెలుస్తుంది. ఇక సినిమాల విషయానికి వస్తే..సామ్, చై ఇద్దరూ వరుస సినిమాలతో బిజీ అయిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment