
సియోన్ రాజా దర్శకత్వం వహించిన కొత్త సినిమా 'సమూగ విరోధి'. జియోనా ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై నిర్మించారు. ప్రజన్ హీరోగా చేసిన ఈ చిత్రానికి జిజు సన్నీ సినిమాటోగ్రఫీ, మాలకి సంగీతమందించారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్, ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని సోమవారం చైన్నెలోని ప్రసాద్ ల్యాబ్‌లో నిర్వహించారు.
(ఇదీ చదవండి: రెండు భాగాలుగా ఆర్జీవీ 'వ్యూహం', రిలీజ్ డేట్లు ఇవే!)
ఈ కార్యక్రమంలో పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు పాల్గొన్నారు. చిత్ర దర్శక నిర్మాత సియోన్ రాజా మాట్లాడుతూ.. సమాజంలో ద్రోహులు ఎవరు? అలాంటి వారిని ఎవరు, ఎందుకు తయారు చేస్తున్నారు? అని తెలియజేసే ప్రయత్నమే ఈ చిత్రమని అన్నారు. ఇందులో నటించిన వారందరూ ఎంతగానో సహకరించారని పేర్కొన్నారు.
(ఇదీ చదవండి: చై-సామ్ కలుస్తున్నారంటూ వార్తలు.. షాకిచ్చిన సమంత!)