
ముంబై : బాలీవుడ్ నటుడు సంజయ్ కపూర్, మహీప్ కపూర్‌ల ముద్దుల కూతురు షనయా కపూర్ ఈ ఏడాది హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ధర్మ ప్రొడక‌్షన్స్ బ్యానర్‌పై కరణ్‌జోహార్ ఆమెను హీరోయిన్‌గా ఇంట్రడ్యూస్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో కూతురు షనయా నటించిన కిస్సింగ్, రొమాంటిక్ సీన్లను చూస్తే సంజయ్ కపూర్ ఎలా రియాక్ట్ అవుతాడని ఓ ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నకు సంజయ్ భార్య మహీప్ సమాధానం ఇచ్చారు. 'సినిమాలో పాత్రకు తగ్గట్లు నటించడం కామన్ విషయమే అయినా కూతురిని అలాంటి సీన్లలో చూసినప్పుడు ఒక సాధారణ తండ్రిలానే రియాక్ట్ అవుతారు. అసలు అక్కడుంది తన కూతురేనా అని సంజయ్ మొదట ఆశ్చర్యపోతాడు.
అయితే కూతురి వృత్తి విషయంలో మాత్రం ఏమాత్రం జోక్యం చేసుకోడు. కానీ మనసులో మాత్రం 'ఓ మై గాడ్.. నేనెం చూస్తున్నాను' అని షాకవుతాడు' అని తెలిపారు. కూతురి విషయంలో సంజయ్ చాలా ప్రొటెక్టివ్ అని, ఒక్కోసారి షనయాకు వచ్చిన ఐ లవ్‌యూ మెసేజ్‌లకు కూడా ఆయనే రిప్లై ఇస్తాడని తెలిపింది. చాలామంది షనయాకు లవ్‌యూ అంటూ మెయిల్స్, మెసేజ్‌లు చేస్తుంటారని ఇంత ప్రేమను ఊహించలేదని చెప్పుకొచ్చింది. ఇక షనయా ఇప్పటికే బాలీవుడ్‌లో తన సోదరి జాన్వీకపూర్ నటించిన గుంజన్ సక్సేనా: ది కార్గిల్ గర్ల్ చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసింది.
చదవండి :
ముద్దు వీడియోపై నటి ప్రీతి జింటా రియాక్షన్
18 ఏళ్లకే ఫస్ట్ కిస్, నాన్న ప్రోత్సాహంతోనే: పూజా భట్
Comments
Please login to add a commentAdd a comment