
తమన్నా భాటియా అంటే చాలామందికి గుర్తొచ్చేది డ్యాన్సే! ఆ ఎనర్జీ, ఆ గ్రేస్.. చూడటానికి రెండు కళ్లు చాలవని అంటుంటారు అభిమానులు. కానీ ఇప్పుడదే కళ్లతో ఘోరం చూడాల్సి వస్తోందని వాపోతున్నారు ఫ్యాన్స్. లస్ట్ స్టోరీస్ 2 వెబ్ సిరీస్ ట్రైలర్‌లో తమన్నా హద్దులు చెరిపేసి మరీ రెచ్చిపోయింది. బోల్డ్ పాత్రలో అశ్లీల సన్నివేశాల్లో నటించింది.
తాజాగా ఈ సిరీస్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది తమన్నా. 'లస్ట్ స్టోరీస్ మొదటి సీజన్ చూశాక నా అభిప్రాయం మారిపోయింది. ప్రేక్షకులు ఇలాంటి వాటినే చూస్తున్నారు. ఇలాంటివి చూడటం నిషిద్ధమనో లేదంటే ఇలాంటివి చూసేందుకు సిగ్గుపడే ధోరణి నెమ్మదిగా మాయమవుతోంది. కాలంతో పాటు మనం కూడా మారుతున్నాం. నాకు తెలిసిన వారంతా కూడా లస్ట్ స్టోరీస్ మొదటి సీజన్ చూశారు. అంతేనా.. చూసి ఎంజాయ్ చేశారు కూడా!
నన్ను జనాలు ఇంతవరకు ఎలాగైతే చూడలేదో దాన్ని ప్రజెంట్ చేయడం కూడా నటిగా నాకు అవసరమే! నటిగా నేను ఏదైనా చేయగలను అని నిరూపించాలన్న ఆకలితో ఉన్నాను. ఇప్పటివరకు నేను శృంగార సన్నివేశాలకు ఓకే చెప్పలేదు. కానీ ఇది కూడా ఇతర సన్నివేశాలలాంటిదేనని ఆలస్యంగా తెలుసుకున్నాను. అది కూడా కొరియోగ్రఫీ చేసిందే కదా! అయినా శృంగార సన్నివేశాల్లో నటించేటప్పుడు నాకు భయం వేయలేదు. నా ప్రియుడు విజయ్ వర్మ నన్ను ఎంతో జాగ్రత్తగా చూసుకున్నాడు' అని చెప్పుకొచ్చింది తమన్నా.
చదవండి: పదేపదే అందంగా లేనని చెప్తుంటే నిజమే అనుకున్నా: శోభిత
Comments
Please login to add a commentAdd a comment