
శర్వానంద్, సిద్ధార్థ్ హీరోలుగా ‘ఆర్‌ఎక్స్ 100’ ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘మహాసముద్రం. అదితి రావు హైదరి - అను ఇమ్మాన్యుయేల్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. యాక్షన్ డ్రామాగా రూపొందు తోన్న ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సుంకర రామబ్రహ్మం నిర్మిస్తున్నారు. అజయ్ సుంకర కో- ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు.
చాలాకాలం తరువాత సిద్ధార్థ్ నటిస్తున్న స్ట్రెయిట్ తెలుగు సినిమా ఇదే కావడం విశేషం. కరోనా సెకండ్ వేవ్ కారణంగా నిలిపోయిన చిత్ర షూటింగ్ పరిస్థితులు చక్కబడ్డాక మళ్లీ మొదలైంది. తాజాగా ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయిందని మేకర్స్ తెలియజేశారు. ఈ సందర్భంగా శర్వానంద్, సిద్ధార్థ్ కలిసి ఉన్న పోస్టర్ విడుదల చేశారు. ఇందులో ఇద్దరు మంచి జోష్‌లో కనిపిస్తున్నారు. ఈ చిత్రానికి చైతన్య భరద్వాజ్ సంగీతం సమకూరుస్తున్నారు.
One of the perfectly planned executions in recent times. Thanks to my dear @DirAjayBhupathi for his superb persistance. Our @ImSharwanand @Actor_Siddharth @aditiraohydari @ItsAnuEmmanuel made sure we got the best output inspite of natural hurdles. kudos to the best team. https://t.co/io6YhNgyzl
— Anil Sunkara (@AnilSunkara1) July 9, 2021