
సెలబ్రిటీలని చూసి మనలో చాలామంది కుళ్లుకుంటాం. వాళ్లకేంటి సూపర్ లైఫ్ అని జెలసీ ఫీలవుతుంటాం. అయితే ఈ విషయంలో ప్లస్సులతో పాటే మైనస్సులు కూడా ఉంటాయి. కాకపోతే వాటిని సదరు సెలబ్రిటీలు బయటపెట్టినప్పుడే అందరికీ తెలుస్తుంటాయి. తాజాగా ఓ స్టార్ సింగర్ తనకు ఎదురైన చేదు అనుభవాన్ని చెప్పి, అవాక్కయ్యేలా చేశాడు.
పంజాబీలో పలు ఆల్బమ్ సాంగ్స్‌తో పాపులర్ అయిన సింగర్ సుధీర్ యదువంశీ. ఇతడు రీసెంట్‌గా ఓ పెళ్లి సంగీత్‌కి వెళ్లాడు. స్టేజీపై ఉన్న ఇతడి దగ్గరికి వచ్చిన ఓ వ్యక్తి అనుచితంగా ప్రవర్తించాడు. ఈ విషయాన్ని స్వయంగా ఈ గాయకుడే బయటపెట్టాడు. తలకు గన్ గురిపెట్టి మరీ బెదిరించినట్లు చెప్పుకొచ్చాడు.
(ఇదీ చదవండి: ప్రభాస్ 'కల్కి'.. ఆ సీక్రెట్ బయటపెట్టిన కమల్)
'సంగీత్ లో ఉన్న నా దగ్గరికి వచ్చిన ఓ వ్యక్తి.. తను రాసిన పాటని పాడమన‍్నాడు. నేను కుదరదు అని చెప్పాను. దాన్ని పట్టించుకోకుండా నన్ను వేధించడం మొదలుపెట్టాడు. ఎందుకులే అని ఊరుకున్నాను. కొంతసేపటికి స్టేజీపై నుంచి దిగిపోతున్న నన్ను ఫాలో అయ్యాడు. ఒక్కసారిగా నా దగ్గరకొచ్చి సడన్‌గా తుపాకీ బయటకు తీశాడు. నాకు గురిపెట్టి.. పాడతావా లేదా? అని బెదిరించాడు. ఒక్కసారిగా షాకయ్యాను'
'గన్ నావైపు గురిపెట్టడమే కాకుండా.. పాట పాడితేనే స్టేజీ దిగుతావ్ లేదంటే.. అని భయపెట్టాడు. ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. ఒక్కసారిగా భయపడ్డాను. చేసేదం లేక.. అతడు చెప్పినట్లే ఆ పాట పాడాను. అది కూడా ఏకంగా మూడుసార్లు' అని సుధీర్ యదువంశీ తనకు జరిగిన షాకింగ్ ఇన్సిడెంట్‌ని తాజాగా బయటపెట్టాడు.
(ఇదీ చదవండి: 'కల్కి' గ్లింప్స్‌లో కమల్‌హాసన్.. ఎక్కడో గుర్తుపట్టారా?)
Comments
Please login to add a commentAdd a comment