హ్యాపీగా టాయ్‌లెట్స్‌ కడిగేవాడిని, బాగా డబ్బులొచ్చేవి: నటుడు | Gippy Grewal: I Get Extra Pay For Cleaning Toilets | Sakshi
Sakshi News home page

Gippy Grewal: బాత్రూమ్స్‌ క్లీన్‌ చేసినందుకు ఎక్కువ డబ్బులిచ్చేవారు

Oct 24 2022 4:48 PM | Updated on Oct 24 2022 10:43 PM

Gippy Grewal: I Get Extra Pay For Cleaning Toilets - Sakshi

నేల తుడవడమే కాకుండా బాత్రూమ్స్‌ కూడా శుభ్రం చేసేవాడిని. అదేమీ నాకు తప్పుగా అనిపించలేదు. పైగా అలా టాయ్‌లెట్స్‌ క్లీన్‌ చేయడం వల్ల నాకు ఎక్కువ డబ్బులొచ్చేవి.

పంజాబీ ఇండస్ట్రీలో ఇటీవలే ఇరవయ్యేళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్నాడు గిప్పీ గ్రీవల్‌. సింగర్‌గా, నటుడిగా రాణిస్తున్న ఆయన కెరీర్‌ ఏమీ పూలపాన్పు కాదు. డబ్బుల కోసం టాయ్‌లెట్స్‌ కడిగే స్థాయి నుంచి సినిమాల ద్వారా ఆదాయాన్ని ఆర్జించే లెవల్‌కు వెళ్లాడీ హీరో. తాజాగా అతడు ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర అంశాలను పంచుకున్నాడు.

'ఇండియాలో టాయ్‌లెట్స్‌ క్లీన్‌ చేసేవాళ్లను చిన్నచూపు చూస్తారు. నిజంగా అది మన దురదృష్టం. కెనడాలో ఉన్నప్పుడు నేను కూడా ఆ పని చేశాను. నేల తుడవడమే కాకుండా బాత్రూమ్స్‌ కూడా శుభ్రం చేసేవాడిని. అదేమీ నాకు తప్పుగా అనిపించలేదు. పైగా అలా టాయ్‌లెట్స్‌ క్లీన్‌ చేయడం వల్ల నాకు ఎక్కువ డబ్బులొచ్చేవి. కాబట్టి సంతోషంగా ఆ పని చేసేవాడిని.

అంతేకాక నేను, నా భార్య రవ్‌నీత్‌ వేకువజామున నాలుగన్నర గంటలకే నిద్ర లేచి వార్తాపత్రికలు పంచేవాళ్లం. దెయ్యాలకోటలా ఉన్న ఇండ్లలోకి న్యూస్‌పేపర్స్‌ ఇవ్వాలంటే తను ఎంతో భయపడేది. కానీ తప్పదు కాబట్టి సమయానికి వెళ్లి పేపర్‌ వేసేవాళ్లం' అని చెప్పుకొచ్చాడు. కాగా గిప్పీ 2002లో సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. ప్రస్తుతం అతడు గాయకుడిగానే కాకుండా నటుడిగా, నిర్మాతగా రాణిస్తున్నాడు. గిప్పీ నటించిన హనీమూన్‌ మూవీ ఈ నెల 25న విడుదల కానుంది. అమర్‌ ప్రీత్‌ ఛాబ్రా డైరెక్ట్‌ చేసిన ఈ మూవీలో జాస్మిన్‌ భాసిన్‌ హీరోయిన్‌.

చదవండి: నేను ఎలా ఉన్నా అందగత్తెనే, సినిమాలు వాటంతటవే వస్తాయి
బిగ్‌బాస్‌ నామినేషన్స్‌: ఆ జంట మధ్య బిగ్‌ ఫైట్‌

1
1/1

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement