ఈనెల 4వ తేదీన టాలీవుడ్ హీరో నాగచైతన్య- హీరోయిన్ శోభిత పెళ్లి వేడుక గ్రాండ్‌గా జరిగింది. అన్నపూర్ణ స్టూడియోస్‌లో వీరిద్దరు మూడుముళ్ల బంధంలోకి అడుగుపెట్టారు. ఈ వివాహావేడుకలో మెగాస్టార్ చిరంజీవి పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. వీరితో పాటు విక్టరీ వెంకటేశ్, పలువురు టాలీవుడ్ ప్రముఖులు కూడా హాజరయ్యారు.
ఈ పెళ్లి వేడుకలో శోభిత సిస్టర్ డాక్టర్ సమంత కూడా సందడి చేశారు. అక్క పెళ్లి దిగిన ఫోటోలను తాజాగా ఆమె సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇది నా జీవితంలో చాలా ఎమోషనల్ మూమెంట్.. అక్కా.. నిన్ను చాలా ప్రేమిస్తున్నా.. మమ్మల్ని నువ్వు ఎంత ఇష్టపడతావో.. అలాగే నీ జీవితంలోకి వచ్చిన వ్యక్తిని ఎంతగా ప్రేమిస్తావో నాకు మాత్రమే తెలుసు.. అత్యంత గౌరవప్రదమైన జంట అక్క- చైతూ అని నాకు తెలుసు' అంటూ ఎమోషనల్ పోస్ట్ చేసింది. అది కాస్తా వైరల్ కావడంతో ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.
(ఇది చదవండి: పెళ్లి తర్వాత లైఫ్ గురించి చెప్పిన కొత్త కోడలు శోభిత)
కాగా.. శోభిత సిస్టర్ డాక్టర్ సమంత వృత్తిరీత్యా వైద్యురాలు. ఆమె 2022లోనే పెళ్లి చేసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment