SR Kalyana Mandapam OTT Release Date Confirmed: Streaming Platform Details - Sakshi
Sakshi News home page

OTT: ఓటీటీకి ఎస్‌ఆర్‌ కల్యాణమండపం, స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే..

Published Tue, Aug 17 2021 9:23 AM | Last Updated on Tue, Aug 17 2021 4:03 PM

SR Kalyana Mandapam Movie Streaming On OTT Soon  - Sakshi

యంగ్‌ హీరో కిరణ్‌ అబ్బవరం, హీరోయిన్‌ ప్రియాంక జవాల్కర్‌ జంటగా నటించిన తాజా చిత్రం ‘ఎస్‌ఆర్‌ కల్యాణ మండపం’. శ్రీధర్‌ దర్శకత్వంలో ప్రమోద్‌-రాజ్‌లు నిర్మించిన ఈ చిత్రం ఇటీవల విడదులై భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ చిత్రం కరోనా సెకండ్‌ వేవ్‌ అనంతరం తెరుచుకున్న థియేటర్లకు తొలి బ్లాక్‌బస్టర్‌ హిట్‌ను అందించింది. మహమ్మారి కారణంగా ప్రస్తుతం ఓటీటీల హవా నడుస్తున్న తరుణంలో ‘ఎస్‌ఆర్‌ కల్యాణ మండపం’ థియేటర్లకు పూర్వ వైభవాన్ని తీసుకువచ్చిందని చెప్పుకొవచ్చు. విడుదలైన వారం రోజుల్లోనే ఈ మూవీ 7 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు రాబట్టింది.

ఇదిలా ఉండగా తాజా సమాచారం ప్రకారం ఈ మూవీ ఓటీటీ వేదికగా ప్రేక్షకులను మరోసారి ఎంటర్‏టైన్ చేసేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది. ఈ మూవీని ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా భారీ ఢీల్‌కు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఆగస్ట్ 27 నుంచి ఈ మూవీని స్ట్రీమింగ్‌ చేసేందుకు ఆహా ప్లాన్‌ చేస్తున్నట్లు కూడా సమాచారం. ఇక ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన ఈ వారంలో వచ్చే అవకాశం ఉందట. (చదవండి: ‘ఎస్‌.ఆర్‌. కళ్యాణ మండపం’ మూవీ రివ్యూ)

ఈ సినిమా.. విడుదలైన దాదాపు మూడు వారాలకే ఓటీటీలో విడుదల కావడం విశేషం. సిల్వర్‌ స్క్రీన్‌పై కాసుల వర్షం కురింపించిన ఎస్‌ఆర్‌ కల్యాణ మండపం మరి స్మాల్‌ స్క్రీన్‌ ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుంటుంది, ఓటీటీలో ఏ మేరకు సక్సెస్‌ అవుతుందో చూడాలి. కిరణ్ అబ్బవరమే ఈ మూవీకి కథ, స్క్రీన్ ప్లే, మాటలను అందించాడు. ఇందులో సీనియర్‌ నటుడు సాయికుమార్‌-తులసిలు కీలక పాత్రలు పోషించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement