
సూర్య కథానాయకుడిగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'కంగువ'. బాలీవుడ్ బ్యూటీ దిశాపటానీ ఈ చిత్రం ద్వారా కథానాయకిగా కోలీవుడ్‌కు పరిచయమవుతోంది. శివ దర్శకత్వంలో యువీ క్రియేషన్స్ సంస్థతో కలిసి స్టూడియో గ్రీన్ సంస్థ నిర్మిస్తోంది.
పీరియాడికల్, ప్రస్తుత అంశాలతో కూడిన ఈ చిత్రంలో సూర్య గెటప్, టీజర్ ఇప్పటికే చిత్రంపై భారీ అంచనాలను పెంచేశాయి. చిత్రాన్ని 3డీ ఫార్మాట్‌లో, 10 భాషల్లో విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ఇప్పటికే వెల్లడించారు. దేవీశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన తాజా పోస్టర్‌ను తమిళ నూతన సంవత్సరం సందర్భంగా ఆదివారం విడుదల చేశారు.
(ఇదీ చదవండి: డైరెక్టర్ శంకర్ కూతురికి రెండో పెళ్లి.. కుర్రాడు ఎవరంటే?)
అందులో పీరియడ్ కాలానికి చెందిన సూర్య ఫొటోను, మరో పక్క ప్రస్తుత ఫొటోను పొందుపరచారు. మధ్యలో 2024లో విడుదల అని పేర్కొన్నారు. దీంతో కంగువా చిత్రంలో సూర్య రెండు డిఫరెంట్ పాత్రల్లో నటిస్తున్నట్లు తెలుస్తోంది. పీరియడ్ పాత్రధారి చేతిలో కత్తి పట్టుకోగా, ప్రస్తుతం పాత్రధారి చేతిలో తుపాకీ పట్టుకున్న దృశ్యం ఈ పోస్టర్‌కు ఎట్రాక్షన్‌గా మారింది.
అదేవిధంగా ఇది గత జన్మకు, పునర్‌జన్మకు సంబంధించిన కథా చిత్రం అని కూడా అనిపిస్తోంది. దాదాపు ఇలాంటి కాన్సెప్టుతోనే ఈ మధ్య 'బింబిసార' అనే మూవీతో తెలుగులో వచ్చింది. ఈ పోస్టర్ చూస్తుంటే తెలుగు ప్రేక్షకులకు అదే చిత్రం గుర్తొస్తోంది.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 18 సినిమాలు.. అవేంటంటే?)
இனிய தமிழ் புத்தாண்டு நல்வாழ்த்துகள்!
ഹൃദയം നിറഞ്ഞ വിഷു ആശംസകൾ!
ਨਵਾ ਸਾਲ ਮੁਬਾਰਕ! &
Happy Ambedkar Jayanthi! #Kanguva pic.twitter.com/MtTGPnzxw3— Suriya Sivakumar (@Suriya_offl) April 14, 2024