బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ బలవన్మరణంతో అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. అతని చావుకు గల కారణాలు తెలియాలని, ఆయనకు న్యాయం జరగాలని ముక్తకంఠంతో నినదిస్తున్నారు. ఇప్పటికే సుశాంత్ కేసులో పలు దర్యాప్తు సంస్థలు నిజం నిగ్గు తేల్చే పనిలో నిమగ్నమయ్యాయి. ఈ క్రమంలో సుశాంత్‌కు సంబంధించిన ఓ ఆడియో టేపు బయటకు వచ్చింది. ఇందులో ఆయన తన ఆర్థిక పరిస్థితి గురించి కలవరపాటుకు లోనైనట్లు తెలుస్తోంది. తనకెంతో ఇష్టమైన ఫ్యాన్సీ కార్లను కూడా అమ్మేసేందుకు సిద్ధమైనట్లు కనిపిస్తోంది. అటు మానసిక స్థితితోపాటు, భవిష్యత్తుపై ఆందోళన కూడా సుశాంత్ మాటల్లో స్పష్టంగా గోచరించాయి. ఈ ఏడాది జనవరిలో జరిగిన ఈ సంభాషణలో సుశాంత్, రియా చక్రవర్తి, అతని మేనేజర్లు పాల్గొన్నారు. కాగా ఇందులో ఉన్న గొంతు సుశాంత్‌దేనని ఫోరెన్సిక్ నిపుణులు ధ్రువీకరించారు. ఈ ఆడియో టేపులో ఎలాంటి ట్యాంపరింగ్ జరగలేదని వెల్లడించారు.
ఆడియో టేపులో ఏం మాట్లాడుకున్నారంటే..
సుశాంత్: ఇప్పుడు నువ్వు నాకో సాయం చేసి పెట్టగలవా?
రియా: తప్పకుండా
సుశాంత్: మనం డబ్బును ఎలా పొదుపు చేయాలి?
పేరు తెలియని వ్యక్తి:(కలుగజేసుకుంటూ) నిన్ననే మనం ఇంకో ఘోరమైన పరిస్థితి గురించి మాట్లాడాం(సుశాంత్ మానసిక స్థితి గురించి మాట్లాడినట్లు తెలుస్తోంది).
సుశాంత్: అవును, ఇప్పుడు అసలు నేను నా మైండ్‌తో ఫైట్ చేయాలి. ఎందుకంటే ఇది నేనింతవరకు ఎన్నడూ ఎదుర్కోని సమస్య.
వ్యక్తి: ఈ విషయంలో ఆ ట్రస్టు సభ్యులు నిర్ణయం తీసుకుంటారు.(ఈ సమయంలో సుశాంత్‌ను జాగ్రత్తగా చూసుకునేందుకు ప్రైవేటు ట్రస్ట్ సాయం చేస్తుందని సలహా ఇస్తాడు)
సుశాంత్: కానీ, దీని కోసమని ఎలా వెళ్తాం?
రియా: ఇదేం చిన్న సమస్య కాదు.
వ్యక్తి: ఇది అత్యంత క్లిష్ట్య సమస్య, అర్థమవుతోందా?
సుశాంత్: అవును, అదీ నిజమే
ఇక మరో ఆడియో టేపులో సుశాంత్, అతని మాజీ మేనేజర్ శ్రుతి మోదీ, రియా, ఆమె తండ్రి ఇంద్రనీల్ సంభాషించారు. ఇందులో సుశాంత్ ముంబై నుంచి మకాం మార్చాలనుకున్నట్లు వెల్లడించారు. (చదవండి: సుశాంత్ కేసుపై నెలల తరబడి చర్చిస్తారా!)
సుశాంత్: నేను నగరాన్ని విడిచి వెళ్లాలనుకుంటున్నా. అయితే ఎక్కడికి వెళ్లాలి?
రియా: బహుశా గోవానేమో. కొంతకాలం పావ్నాలో అయితే ఉంటే మంచిదని నాన్న సూచించారు. ఒక నెల సమయమిస్తే ఆ తర్వాత ఎక్కడ ఉండాలనేది నిర్ణయిస్తాం. ముందు సుశాంత్ జాగ్రత్తగా ఉండాలనుకుంటున్నాడు. అతను తన భవిష్యత్తు కోసం ఆలోచిస్తున్నాడు. రేపటి కోసం బెంగ పెట్టుకుంటున్నాడు. అందుకే ప్రస్తుతం కొంత సమయం విశ్రాంతి తీసుకుంటే మంచిది
సుశాంత్: ఇదో రిటైర్‌మెంట్‌లాగా భావించండి.
ఇంద్రనీల్: నేను అర్థం చేసుకోగలను
సుశాంత్: కానీ నేను ఏం చేయగలను,? ఎలా చేయగలను? నాకు సాయం కావాలి
రియా: ముందు ఇక్కడ డబ్బు అవసరం. నువ్వు పెట్టుబడిన పెట్టిన దగ్గర నుంచి కొంత మొత్తం నీకు వస్తుంది.
సుశాంత్: అది ఎంత మొత్తమో నాకు తెలుసు.
రియా: ఇప్పుడు ప్రతి నెలా ఎంత వస్తుందో నీకు తెలుసు కాబట్టి ఆ ఇంటిని వదిలేయాలని ఆలోచిస్తున్నావు.
సుశాంత్: ముందు నాకు పానాకు వెళ్లడం ఇష్టం లేదు.
స్త్రీ: నువ్వు మళ్లీ నీ అపార్ట్‌మెంట్‌కు వెళ్తే సంతోషంగా ఉండవు. ఏం జరుగుతోందో అర్థమవుతోందా..
సుశాంత్: ఏది మీకు మనశ్శాంతి ఇస్తుందని అనిపిస్తోంది
రియా: ముందైతే మనం ప్రయత్నం చేద్దాం. పానా వెళ్లి అక్కడ ఒకటీరెండు రోజులు ఉందాం. అక్కడ నీకు ఎలా అనిపిస్తుందో చూద్దాం!
స్త్రీ: ఎప్పుడు వెళ్తున్నారు?
సుశాంత్: ఇంకా ఏమీ అనుకోలేదు
ఇంద్రనీల్: ఈ బుధవారం లేదా గురువారం అంటే 14వ తేదీనా? ఎప్పుడు?
సుశాంత్: నా బర్త్‌డే కన్నా ముందే వెళ్తాం
ఇంద్రనీల్: అయితే బుధవారం
రియా: అవును, బుధవారం ఏడింటికి
ఇంద్రనీల్: ఇదే మీ ప్లాన్
మరో వీడియోలో సుశాంత్ అతని మానసిక స్థితి గురించి మరింత కంగారు పడినట్లు కనిపిస్తోంది.
సుశాంత్: ఇలాంటివన్నీ జీవితంలో ఒక భాగం. ఇది బైపోలార్ డిజార్డర్(భావోద్వేగాలు అతిగా ప్రభావితం అయ్యే మానసిక వ్యాధి). ఇందులో మొదట నేను నటించగలనని అనుకోలేదు. రెండోది డబ్బు సంపాదించేందుకు ఏ రంగంలోకి ప్రవేశించాలో అర్థం కాలేదు. నాకంతా అయోమయంగా ఉంది.
స్త్రీ: నీకు నువ్వే అన్నీ అనుకుంటున్నావు.
సుశాంత్: దీని గురించి గత రెండు నెలలుగా మా డాక్టర్లతో మాట్లాడుతున్నా
స్త్రీ: సరే, అసలు నీ చివరి లక్ష్యం ఏంటో చెప్పు? మేం నీ వెనకుండి సహాయపడతాం. నువ్వు దేని గురించి అతిగా భయపడుతున్నావో చెప్పు
రియా: నేను చెప్తాను. అతను ఉన్న డబ్బునంతా ఫిక్స్‌డ్ డిపాజిట్లలో పెడుతున్నాడు. దానివల్ల అతని డెబిట్ కార్డులో రూ.10-15 లక్షలు కన్నా ఎక్కువ లేవు. మరో విషయమేంటంటే అతని ఫిక్స్‌డ్ డిపాజిట్లకు వడ్డీ వస్తుంది. దానివల్ల అతను సేవింగ్స్ ఖర్చు చేయడు. ముందు అతని డబ్బును కాపాడుతూ పొదుపు చేయాలి. అతని సంతకం లేకుండా ఆ డబ్బు ముట్టుకోడానికే వీల్లేకుండా చేయాలి... అంటూ సుశాంత్ డబ్బు గురించి ఆందోళన పడ్డట్లు తెలిపారు. అతని సంపాదన ఖర్చవకుండా ఏం చేయాలో మాట్లాడుకున్నారు. ఇన్సూరెన్స్ తీసుకుంటే ఎలా ఉంటుందని కూడా ఆలోచన చేశారు. దేంట్లో ఇన్వెస్ట్ చేయాలి? ఎంత మేరకు చేయాలన్న దానిపై చర్చించారు. ఈ క్రమంలో తన ఫ్యాన్సీ కార్లను కూడా అమ్మేయడానికి సిద్ధమేనని సుశాంత్ తెలిపారు. ఈ నిర్ణయాన్ని రియా సమర్థించగా, ఇతరులు మాత్రం వద్దని వారించారు. (చదవండి: రియా చక్రవర్తికి భద్రత కల్పించనున్న పోలీసులు)
Comments
Please login to add a commentAdd a comment