ఆమె సంగతి సరే, మరి నీ పెళ్లెప్పుడు? | Tamannaah Bhatia Attends Her Best Friends Wedding | Sakshi
Sakshi News home page

బెస్ట్‌ ఫ్రెండ్‌ పెళ్లిలో మెరిసిపోయిన మిల్కీ బ్యూటీ

Published Thu, Mar 4 2021 7:49 PM | Last Updated on Thu, Mar 4 2021 8:52 PM

Tamannaah Bhatia Attends Her Best Friends Wedding - Sakshi

తన క్లోజ్‌ ఫ్రెండ్‌ హన్నా ఖాన్‌ పెళ్లి కోసం అక్కడ పాగా వేసింది. మెహందీ, సంగీత్‌ వేడుకల్లో వధువుతో దిగిన ఫొటోలను..

జైపూర్‌: టాలీవుడ్‌ హీరోయిన్‌ తమన్నా భాటియా ప్రస్తుతం జైపూర్‌లో ఉంది. అయితే ఏ సినిమా షూటింగ్‌ కోసమో ఆమె అక్కడకు వెళ్లలేదు. తన క్లోజ్‌ ఫ్రెండ్‌ హన్నా ఖాన్‌ పెళ్లి కోసం అక్కడ పాగా వేసింది. ఈమేరకు మెహందీ, సంగీత్‌ వేడుకల్లో వధువుతో దిగిన ఫొటోలను ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో తన అభిమానులతో పంచుకుంది. మెహందీ ఫంక్షన్‌లో నీలిరంగు దుస్తుల్లో, సంగీత్‌ కార్యక్రమాల్లో ఎరుపు రంగు డ్రెస్సులో మెరిసిపోయిందీ మిల్కీ బ్యూటీ. పెళ్లి వేడుకల్లో అందంగా ముస్తాబైన తమన్నాను చూసి ఫ్యాన్స్‌ ఫిదా అవుతున్నారు. క్యూట్‌నెస్‌ ఓవర్‌లోడెడ్‌.. అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. 'నీ ఫ్రెండ్‌ పెళ్లి సరే కానీ, నీ పెళ్లెప్పుడు?' అంటూ కొందరు మరోసారి ఆమె వివాహం గురించి ఆరా తీస్తున్నారు.

ఇక తమన్నా సినిమాల విషయానికొస్తే.. ఆమె గోపీచంద్‌ కథనాయకుడిగా నటిస్తున్న 'సీటీమార్‌' సినిమాలో కబడ్డీ కోచ్‌గా కనిపించనుంది. ఈ చిత్రం ఏప్రిల్‌ 2న విడుదల కానుంది. అలాగే వెంకటేశ్‌ సరసన 'ఎఫ్‌ 3', నితిన్‌ 'అంధాధున్'‌ తెలుగు రీమేక్‌, సత్యదేవ్‌తో 'గుర్తుందా శీతాకాలం' సినిమాలు చేస్తోంది. మరోవైపు ఆమె హీరోయిన్‌గా నటించిన 'అఅఅ' సినిమా ఇటీవలే రిలీజైంది. ఇందులో శింబు, శ్రియ ప్రధాన పాత్రల్లో నటించారు. ఇక చేయని తప్పుకు శిక్ష అనుభవించే తండ్రిని కాపాడుకునే కూతురిగా 'నవంబర్‌ స్టోరీస్‌' అనే వెబ్‌ సిరీస్‌లోనూ నటించింది. నూతన దర్శకుడు రామ్‌ సుబ్రహ్మణ్యం దీనికి డైరెక్షన్‌ చేశాడు.

చదవండి: 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement