Tamannaah Bhatia Says Marriage is a Big Responsibility, Not a Party - Sakshi
Sakshi News home page

Tamannaah Bhatia: పెళ్లంటే పార్టీ చేసుకోవడం కాదు, ఈడొచ్చిందనో.. ఎవరో అన్నారనో..

Published Fri, Jun 16 2023 7:10 PM | Last Updated on Fri, Jun 16 2023 7:36 PM

Tamannaah Bhatia: Marriage is a Big Responsibility, Not a Party - Sakshi

మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా- బాలీవుడ్‌ నటుడు విజయ్‌ వర్మ డేటింగ్‌లో ఉంటున్నారని సోషల్‌ మీడియాలో ఎప్పటినుంచో వార్తలు వస్తున్నాయి. గోవాలో జరిగిన న్యూ ఇయర్‌ వేడుకల్లో జంటగా కనిపించడం, విజయ్‌ వర్మకు ముద్దు పెడుతున్న వీడియో వైరల్‌ అవడం, ఆ తర్వాత కూడా పలుమార్లు వీరు జంటగానే కెమెరాలకు చిక్కడంతో ఈ లవ్‌ మ్యాటర్‌ నిజమే అనుకున్నారంతా! కానీ తమన్నా మాత్రం అంత సులువుగా తన ప్రేమ విషయాన్ని బయటపెట్టలేదు.

పైపెచ్చు.. మేమిద్దరం కలిసి ఓ సినిమాలో నటించాం.. అంతమాత్రానికే డేటింగ్‌ అనేస్తున్నారేంటి? అని ఫైర్‌ అయింది. అయినా అభిమానులకు మాత్రం తమన్నా నిజంగానే ప్రేమలో ఉన్నట్లు అనిపిస్తోందే అని అనుమానించారు. చివరికి వారి డౌటే నిజమైంది. ఈ మధ్యే గుట్టుచప్పుడు కాకుండా సాగిస్తోన్న తన ప్రేమాయణాన్ని అందరికీ చెప్పేసింది తమన్నా. విజయ్‌ వర్మతో డేటింగ్‌లో ఉన్నానని ఒప్పేసుకుంది. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు వెల్లడించింది.

'నేను కెరీర్‌ ప్రారంభించిన కొత్తలో మహా అయితే హీరోయిన్‌ 8-10 ఏళ్లు మాత్రమే ఇండస్ట్రీలో రాణించగలదు అనుకునేదాన్ని. ఈ లెక్కన 30 ఏళ్లు వచ్చేసరికి నటిగా నా కెరీర్‌ ముగిసిపోయి పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లల్ని కనేస్తా అనుకున్నాను. ఆ తర్వాత ఏం చేయాలనేది ఆలోచించలేదు. కానీ ఇప్పుడు ముప్పై ఏళ్లు మీద పడ్డప్పటికీ అప్పుడే పుట్టినట్లుగా అనిపిస్తోంది. నాకు పునర్జన్మ లభించినట్లుగా ఉంది.

పెళ్లనేది మనకు ఎప్పుడు చేసుకోవాలనిపిస్తే అప్పుడే ఆ దిశగా ఆలోచించాలి. పెళ్లంటే పార్టీ చేసుకోవడం కాదు, బాధ్యత. ఆ బాధ్యతను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నప్పుడే వైవాహిక బంధంలో అడుగుపెట్టాలి. అంతే తప్ప పెళ్లీడు వచ్చిందనో, ఎవరో అన్నారనో వివాహానికి ఒప్పేసుకోవద్దు' అని చెప్పుకొచ్చింది తమన్నా.

చదవండి: సమంత లెవలే వేరు.. వెబ్‌ సిరీస్‌ కోసం ఎంత పారితోషికం తీసుకుంటుందంటే?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement