అభిమానులకు తమన్నా ఆరోగ్య చిట్కాలివే.. | Tamannah Bhatia Tips To Stay Healthy | Sakshi
Sakshi News home page

అభిమానులకు తమన్నా ఆరోగ్య చిట్కాలివే..

Sep 27 2020 5:24 PM | Updated on Sep 27 2020 7:19 PM

Tamannah Bhatia Tips To Stay Healthy  - Sakshi

ముంబై: కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ విధించింది. అయితే మిల్కీ బ్యూటీ, టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ తమన్నా భాటియా మాత్రం లాక్‌డౌన్‌ సమయాన్ని ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకునేందుకు ఉపయోగించుకున్నారు. కాగా 21 రోజులు ‘స్టే ఫిట్’‌ చాలెంజ్‌ పేరుతో ఆరోగ్య నియమాలను పాటించినట్లు పేర్కొంది. తాను పాటించిన నియమాలు మెరుగైన ఆరోగ్యం కోసం అభిమానులు పాటించాలని సూచించారు. కాగా లాక్‌డౌన్‌కు పూర్వం ఆరోగ్య నియమాలు అంతగా పాటించలేదని, సరియైన సమయంలో నిద్రపోలేదని తెలిపారు. అయితే తన 21 రోజుల ఆరోగ్య నియమాలలో మొదటగా ఒక బాటిల్‌ నీళ్లతో ప్రారంభించానని, నీళ్లలో కొన్ని సబ్జా గింజలు వేసి త్రాగినట్లు తెలిపింది.

ఆరోగ్యకర జీవన విధానంలో భాగంగా టిఫిన్‌లో ఫ్రెంచ్‌ టోస్ట్‌, పాన్‌కేక్‌, అరటిపళ్లు, నట్స్‌తో టిఫిన్‌ చేసినట్లు తెలిపింది. కాగా మానసిక, శారీరక ఆరోగ్యం కోసం క్రమం తప్పని వ్యాయామం చేసినట్లు తెలిపింది. తాను ఫోన్‌లో ట్రైనర్‌ను సంప్రదించి వ్యాయామం చేసినట్లు పేర్కొంది. మరోవైపు లాక్‌డౌన్‌లో తాను 21రోజులు పాజిటివ్‌గా ఉండేందుకు ప్రయత్నించానని, యోగా చేయడం వల్ల మనసు ప్రశాంతంగా, కూల్‌ ఉండేదని పేర్కొంది. అయితే లాక్‌డౌన్‌లో తన చిన్ననాటి ఫోటోలను చూస్తు కాలక్షేపం చేసేనట్లు తెలిపింది. (చదవండి: యాక్షన్‌కు బ్యానర్లు వద్దు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement