
తమిళ స్టార్ హీరో అజిత్‌కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కేవలం నటనే కాకుండా ఏరో-మోడలింగ్, పిస్టల్ షూటింగ్, ఫోటోగ్రఫీ, మోటార్ రేసింగ్‌తో పాటు, ఖరీదైన బైక్‌లు మొదలైన వాటిపై కూడా అజిత్ ఆసక్తి చూపిస్తుంటాడు. తీరిక దొరికినప్పుడల్లా తన బైకు పై అలా చూట్టేసి రావడం అజిత్‌కు అలవాటు. ఈ సంవత్సరం ప్రారంభంలో, సిక్కింలోని రోడ్‌సైడ్ హోటల్‌లో ఈ నటుడు భోజనం చేస్తున్న నెట్టింట హల్‌చల్ చేసిన సంగతి తెలిసిందే.
తాజాగా రష్యాలో బైకుపై ట్రిప్ వెళ్లిన అజిత్ ఫోటోలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. ప్రస్తుతం అజిత్ ‘వాలిమై’ చిత్ర షూటింగ్ కోసం రష్యా వెళ్లాడు. హెచ్ వినోద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. ఇటీవల ఈ చిత్రం ఫైనల్ షెడ్యూల్ రష్యాలో పూర్తి చేసుకుంది. స్వతహాగా రోడ్ ట్రిప్‌లని బాగా ఇష్టపడే అజిత్ రష్యాను ఓ రౌండ్ వేయాలని ఫిక్స్ అయ్యారట.
అనుకున్నదే తడవుగా రష్యా అందాలని బైక్‌పై వీక్షించేందుకు సిద్ధమయ్యాడు. అందుకోసం ఇతర అనుభవజ్ఞులైన రైడర్‌లను కలుసుకుని సలహాలు తీసుకున్నారట. కాగా ఇప్పటి వరకు అజిత్ తన బైక్‌పై 10,800 కిమీల దూరం ప్రయాణించాడని సమాచారం. విభిన్న వాతావరణ పరిస్థితులను అలవాటు చేసుకోవడానికి ఆయన ఈశాన్య భారతదేశంలోనూ చుట్టేసివచ్చాడు.
Comments
Please login to add a commentAdd a comment