
ఐదు వేరు వేరు కథలతో తెరకెక్కుతున్న చిత్రం `పంచతంత్ర కథలు`. గంగనమోని శేఖర్ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. త్వరలో విడుదలకి సిద్దంగా ఉన్న ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా మొదటి పాట `మోతెవరి` లిరికల్ వీడియో సాంగ్ ని ప్రముఖ దర్శకుడు తరుణ్ భాస్కర్ విడుదల చేశారు. 'నేనేమో మోతెవరి.. నువ్వేమో తోతాపరి... నా గుండెల సరాసరి.. కుర్సియేసి కూసొబెడతనే... నీ అయ్యా పట్వారి.. నీ చిచ్చా దార్కారి... ఏదైతే ఏందే మరి... నిన్నుఎత్తుకొనిబోతనే...' అంటూ ఆహ్లాదరకరంగా సాగుతోంది.
ఈ పాటకు కాసర్ల శ్యామ్ మంచి సాహిత్యం అందించగా సంగీత దర్శకుడు కమ్రాన్ క్యాచీ ట్యూన్‌తో స్వరపరిచాడు. లేటెస్ట్ సెన్సేషన్ రామ్ మిరియాల ఈ పాటను తనదైన శైలిలో ఆలపించి ఇన్‌స్టంట్ చార్ట్ బస్టర్ లిస్ట్‌లో చేర్చారు. ఈ సాంగ్ రిలీజ్ సందర్భంగా దర్శకుడు తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ.. 'పంచతంత్ర కథలు సినిమాలోని `నేనేమో మోతెవరి` సాంగ్ నా ఫేవరేట్. ఈ సినిమా రఫ్ కట్ చూసినప్పుడే ఈ సాంగ్ విన్నాను. చాలా ఇన్స్‌పైరింగ్ సాంగ్. తప్పకుండా వైరల్ అవుతుందని నా నమ్మకం. ఈ సినిమాలో చాలా పెద్ద క్యాస్టింగ్ ఉంది. సర్‌ప్రైజింగ్‌గా మా అమ్మగారితో కూడా ఒక క్యారెక్టర్ చేయించారు. ఈ సినిమా కోసం ఎగ్జయిటింగ్‌గా ఉన్నాను. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్`` అన్నారు. ఈ సినిమాను మధు క్రియేషన్స్ పతాకంపై ప్రొడక్షన్ నెం.1గా ప్రముఖ వ్యాపారవేత్త డి. మధు నిర్మిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment