ప్రముఖ నటి ఇంట్లో భారీ చోరీ.. దీపావళికి ఊరికెళ్లి వచ్చేలోపే..! | Theft At Actress Vinaya Prasad Home In Bangalore | Sakshi
Sakshi News home page

Vinaya Prasad: ప్రముఖ నటి ఇంట్లో భారీ చోరీ.. పోలీసులకు ఫిర్యాదు

Published Mon, Oct 31 2022 9:32 PM | Last Updated on Tue, Nov 1 2022 7:30 AM

Theft At Actress Vinaya Prasad Home In Bangalore - Sakshi

తెలుగు, తమిళ, మలయాళ భాషల్లోని పలు చిత్రాల్లో నటించిన వినయ ప్రసాద్ అందరికీ సుపరిచితమే. పలు సినిమాల్లో ఆమె క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మెప్పించారు. కన్నడ పరిశ్రమకు చెందిన వినయ ప్రసాద్ అప్పట్లో కొన్ని సినిమాల్లో హీరోయిన్‌గా నటించింది. ఆమె ప్రస్తుతం బెంగళూరులో నివాసముంటోంది. టాలీవుడ్‌లో ఇంద్ర, ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే, ఆంజనేయులు వంటి పలు సినిమాల్లో నటించింది. ప్రస్తుతం ఆమె పలు సీరియల్స్‌లో నటిస్తున్నారు. 

(చదవండి: ఇలాంటి చర్య భయానకం.. కోహ్లీ వీడియోపై బాలీవుడ్ తారల ఆగ్రహం)

అయితే తాజాగా వినయ ప్రసాద్ ఇంట్లో భారీ చోరీ జరిగింది. దీపావళి సందర్భంగా ఆమె భర్తతో కలిసి ఉడిపి వెళ్లగా.. తిరిగొచ్చేసరికి ఇంటి తాళాలు పగలగొట్టి ఉండడంతో వెంటనే పోలీసులను ఆశ్రయించారు. ఆమె ఇంట్లోని లాకర్‌లో ఉన్న నగదు ఎత్తుకెళ్లినట్లు పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. అయితే నగదు మొత్తం ఎంత అన్న వివరాలు మాత్రం వెల్లడించలేదు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement