టాలీవుడ్ యాక్టర్ అల్లు శిరీష్ ప్రధాన పాత్రలో నటించిన యాక్షన్ కామెడీ చిత్రం ' బడ్డీ'. ఆగష్టు 2న విడుదలైన ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. అయితే, తాజాగా ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. తమిళంలో ఆర్య నటించిన టెడ్డీకి రీమేక్‌గా వచ్చిన ఈ చిత్రానికి సామ్ ఆంటోన్ దర్శకత్వం వహించాడు. గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌గా నటించింది.
ఈ రోజు నుంచే నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగుతోపాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో అందుబాటులోకి వచ్చేసింది. ఓటీటీలోనైనా ఆడియన్స్‌ను మెప్పిస్తుందేమో చూడాలి.
బడ్డీ కథేంటంటే..
ఆదిత్య (అల్లు శిరీష్) ఓ పైలట్. విధి నిర్వహణలో భాగంగా తరచూ ఎయిర్ కంట్రోల్ రూమ్ లో పనిచేస్తున్న పల్లవి ( గాయత్రి భరద్వాజ్)తో మాట్లాడతాడు. ఇద్దరు ఒకరిని ఒకరు నేరుగా కలుసుకోలేకపోయినా పరిచయంతోనే ప్రేమలో పడతారు. అయితే ఓసారి పల్లవి చేసిన తప్పిదంతో ఆదిత్య సస్పెండ్‌కు గురవుతాడు. తన కారణంగానే ఆదిత్య ఉద్యోగాన్ని కోల్పోయాడని భావించిన పల్లవి.. అతన్ని నేరుగా కలిసి క్షమాపణ చెప్పాలనుకుంటుంది. అతని కలిసేందుకు వెళుతున్న క్రమంలో పల్లవి కిడ్నాప్ అవుతుంది. గుర్తుతెలియని కొంతమంది వ్యక్తులు ఆమెను కిడ్నాప్ చేసి కోమాల్లోకి వెళ్లేలా చేస్తారు. అసలు పల్లవిని కిడ్నాప్ చేసింది ఎవరు? ఎందుకు చేశారు? కోమాలోకి వెళ్ళిన పల్లవి ఆత్మ టెడ్డిబేరులోకి ఎలా చేరుతుంది? అనేదే మిగతా కథ.
Comments
Please login to add a commentAdd a comment