సూపర్ హిట్ కంటెంట్‌తో లాక్‌డౌన్ సమయంలో తెలుగు ప్రేక్షకులకు ఎంటర్‌టైన్‌మెంట్‌ని అందిస్తుంది ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా. అల్లు అరవింద్ ఈ ఓటీటీ కోసం మంచి టీమ్ ను రెడీ చేశాడు. ఇప్పటికే ‘క్రాక్’,‘గాలి సంపత్’, ‘నాంది’, ‘జాంబి రెడ్డి’, ‘సుల్తాన్’, ‘చావు కబురు చల్లగా’, ‘థ్యాంక్ యు బ్రదర్’,‘అనుకోని అతిథి’ వంటి బ్లాక్‌బస్టర్ సినిమాలతో పాటు పలు వెబ్ సిరీస్‌లను అందించిన ఆహా.. ఇక జూన్ నెలలో కూడా సరికొత్త సినిమాలలో అలరించేందుకు రెడీ అవుతుంది. వారానికి ఒక సినిమా చొప్పు నాలుగు డిఫరెంట్ మూవీస్‌ని జూన్‌లో నెలలో విడుదల చేయబోతుంది.
యాక్షన్ థ్రిల్లర్ చిత్రాలకు ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహా అడ్డాగా మారిపోయింది. ఓవైపు స్ట్రయిట్ తెలుగు సినిమాలు అందిస్తూనే మరోవైపు అనువాద చిత్రాలకు సైతం పచ్చ తివాచీ పరుస్తోంది. అందులో భాగంగా తాజాగా మలయాళ హిట్ మూవీ కాలా తెలుగులో అనువాదమవుతోంది.టొవినో థామస్, సుమేశ్ మూర్ ప్రధాన పాత్రలు పోషించిన అవెయిటెడ్ యాక్షన్ డ్రామా ‘కాలా’ జూన్ 4న ఆహాలో విడుదల కానుంది.
ఈ యేడాది మార్చి 25న ‘కాలా’ చిత్రం థియేటర్లలో విడుదలైంది. సాధారణ ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలూ అందుకుంది. ఓ హింసాత్మక ఘటనలో చనిపోయిన కుక్క కారణంగా ఇద్దరు వ్యక్తుల నడుమ సాగే భావోద్వేగ సంఘటనల సమాహారమే ‘కాలా’. ఓ కుక్క కారణంగా మొదలైన వివాదం చినికి చినికి గాలీవానగా మారుతుంది. ప్రారంభం నుండి ముగింపు వరకూ నాన్ స్టాప్ యాక్షన్ తో మూవీ సాగుతుంది. ఫారెస్ట్ హౌస్ లో ఒక రోజులో జరిగే కథ ఇది.
రిషిత శ్రీ క్రియేషన్స్ పతాకంపై కార్తిక్ రత్నం, కృష్ణప్రియ ప్రధాన పాత్రల్లో, సాయి కుమార్, అజయ్, ఆమని, పవిత్ర లోకేష్, శరణ్య నటిస్తోన్న చిత్రం అర్ధ శతాబ్దం. ఈ మూవీని రవీంద్ర పుల్లే దర్శకత్వం వహిస్తుండగా చిట్టి కిరణ్ రామోజు నిర్మిస్తున్నారు ఇటీవల రానా రిలీజ్ చేసిన మూవీ ఫస్ట్ గ్లింప్స్, సాయి కుమార్ లుక్, కార్తిక్ రత్నం లుక్ లకు ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభించింది. జూన్ 11 నుండి ‘ఆహా’లో ‘అర్ధ శతాబ్దం’ అందుబాటులోకి రానుంది..
ప్రముఖ కమెడియన్ ప్రియదర్శి డిజిటల్ ప్లాట్‌ఫామ్ లో ప్రత్యేకమైన స్క్రిప్ట్ లను ఎంపికల చేసుకుని ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. తాజాగా ఈ కమెడియన్ ‘ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్’ అనే క్రైమ్ థ్రిల్లర్ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యాడు. విద్యా సాగర్ దర్శకత్వం వహించిన ‘ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్’ ను ‘బాషా’ దర్శకుడు సురేష్ కృష్ణ నిర్మించారు. నందిని రాయ్ కీలకపాత్రలో నటించింది. ఈ వెబ్ సిరీస్ జూన్ 18న ఆహాలో ప్రసారం అవుతుంది.
మలయాళి మెగాస్టార్ మమ్ముట్టి నటించిన తాజా చిత్రం ‘వన్’. ఈ చిత్రాని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి రెడీ అయింది ఆహా. సంతోష్ విశ్వనాథ్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ జూన్ 25న స్ట్రీమింగ్ కానుంది. ఇలా ప్రతి వారం ఒక సినిమాతో తెలుగు ప్రేక్షకులను వినోదాన్ని అదించబోతుంది ఆహ.
చదవండి:
Kala: జంతువు కోసం మనిషి జంతువుగా మారితే!
In The Name of God : తొలిసారి ప్రియదర్శి అలా..
Comments
Please login to add a commentAdd a comment