ట్రైలర్‌ బాగుంది  | Trailer of Bhoothaddham Bhaskar Narayana is very promising: Mass Ka Das Vishwak Sen | Sakshi
Sakshi News home page

ట్రైలర్‌ బాగుంది 

Published Sun, Feb 11 2024 1:36 AM | Last Updated on Sun, Feb 11 2024 1:36 AM

Trailer of Bhoothaddham Bhaskar Narayana is very promising: Mass Ka Das Vishwak Sen - Sakshi

∙శివ కందుకూరి, విశ్వక్‌ సేన్‌

‘‘భూతద్ధం భాస్కర్‌ నారాయణ’ ట్రైలర్‌ బాగుంది. శివ బాగా చేశాడు. ఈ సినిమా హిట్టవ్వాలి’’ అన్నారు హీరో విశ్వక్‌ సేన్‌. శివ కందుకూరి, రాశీ సింగ్‌ జంటగా పురుషోత్తం రాజ్‌ దర్శకత్వం వహించిన చిత్రం ‘భూత ద్ధం భాస్కర్‌ నారాయణ’. స్నేహల్‌ జంగాల, శశిధర్‌ కాశి, కార్తీక్‌ ముడుంబై నిర్మించిన ఈ సినిమా మార్చి 1న రిలీజ్‌ కానుంది.

ఈ చిత్రం ట్రైలర్‌ లాంచ్‌ వేడుకలో విశ్వక్‌ సేన్‌ అతిథిగా పాల్గొన్నారు. ‘‘భూతద్ధం భాస్కర్‌ నారాయణ’ యునిక్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌’’ అన్నారు శివ కందుకూరి. ‘‘అందరి ఇంటి ముందు ఉండే దిష్టి బొమ్మ గురించి ఈ చిత్రం ఉంటుంది’’ అన్నారు పురుషోత్తం రాజ్‌. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement