Transformers Rise Of The Beasts Release - Sakshi
Sakshi News home page

థియేటర్లోకి వచ్చేసిన ‘ట్రాన్స్‌ఫార్మర్స్’

Published Thu, Jun 8 2023 3:55 PM | Last Updated on Mon, Jul 31 2023 8:34 PM

Transformers Rise of the Beasts Release - Sakshi

హాలీవుడ్‌ నుంచి ‘ట్రాన్స్‌ఫార్మర్స్’ సిరీస్ సినిమాలు తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యాయి. అద్భుతమైన యాక్షన్ సీన్లతో ఇప్పటి వరకు వచ్చిన 6 సిరీస్‌లు సూపర్‌ హిట్‌ అందుకున్నాయి. తాజాగా 7వ సిరీస్‌ ట్రాన్స్ఫార్మర్స్: రైజ్ ఆఫ్ ది బీస్ట్స్ నేడు (జూన్‌8) విడుదలైంది. హాలీవుడ్‌ నుంచి సెన్సేషనల్ ఫ్రాంచైజ్‌లలో ‘ట్రాన్స్‌ఫార్మర్స్’కు అత్యంత అధరణ ఉంది.  ఈ సినిమా సిరీస్ లవర్స్ ఈ పర్టిక్యులర్ పార్ట్‌కు బాగా ఎగ్జైట్ అవుతారని తెలుస్తోంది. ప్రధానంగా గత సిరీస్‌ల కంటే కొత్తగా కథాంశం ఉన్నట్లు మేకర్స్‌ తెలిపారు. 

(ఇదీ చదవండి: పట్టాలెక్కనున్న మరో రామాయణం.. అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా!)

ఆటోబాట్స్ పై వచ్చే సీక్వెన్స్‌ మంచి ట్రీట్ ఇస్తాయి. అలాగే ఈ సిరీస్‌లో భారీ యాక్షన్ సీన్స్‌, యూనిక్ వే ప్రెజెంటేషన్ కోసం వెళ్లే వాళ్లు కూడా చాలా మంది ఉంటారు. వారిని  ఏ మాత్రం నిరుత్సాహం చెందేలా మూవీ ఉండదని ట్రైలర్‌తోనే తెలుస్తోంది. ఇందులో ఆంథోనీ రామోస్, డొమినిక్ ఫిష్‌బ్యాక్ నటీనటులుగా ఉ‍న్నారు. దర్శకుడు స్టీవెన్ కాపెల్ జూనియర్ ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది.  వయాకామ్ 18 స్టూడియోస్ ద్వారా ఇంగ్లీష్‌, హిందీ, తమిళ్‌, తెలుగు 2D, 3D, 4D, IMAXలో వచ్చేసింది.

(ఇదీ చదవండి: నిర్మాతపై కోపంతో ఆ పెళ్లి చేసుకున్న: ప్రముఖ నటి)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement