transfarmers
-
థియేటర్లోకి వచ్చేసిన ‘ట్రాన్స్ఫార్మర్స్’
హాలీవుడ్ నుంచి ‘ట్రాన్స్ఫార్మర్స్’ సిరీస్ సినిమాలు తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యాయి. అద్భుతమైన యాక్షన్ సీన్లతో ఇప్పటి వరకు వచ్చిన 6 సిరీస్‌లు సూపర్ హిట్ అందుకున్నాయి. తాజాగా 7వ సిరీస్ ట్రాన్స్ఫార్మర్స్: రైజ్ ఆఫ్ ది బీస్ట్స్ నేడు (జూన్8) విడుదలైంది. హాలీవుడ్ నుంచి సెన్సేషనల్ ఫ్రాంచైజ్‌లలో ‘ట్రాన్స్ఫార్మర్స్’కు అత్యంత అధరణ ఉంది. ఈ సినిమా సిరీస్ లవర్స్ ఈ పర్టిక్యులర్ పార్ట్‌కు బాగా ఎగ్జైట్ అవుతారని తెలుస్తోంది. ప్రధానంగా గత సిరీస్‌ల కంటే కొత్తగా కథాంశం ఉన్నట్లు మేకర్స్ తెలిపారు. (ఇదీ చదవండి: పట్టాలెక్కనున్న మరో రామాయణం.. అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా!) ఆటోబాట్స్ పై వచ్చే సీక్వెన్స్ మంచి ట్రీట్ ఇస్తాయి. అలాగే ఈ సిరీస్‌లో భారీ యాక్షన్ సీన్స్, యూనిక్ వే ప్రెజెంటేషన్ కోసం వెళ్లే వాళ్లు కూడా చాలా మంది ఉంటారు. వారిని ఏ మాత్రం నిరుత్సాహం చెందేలా మూవీ ఉండదని ట్రైలర్‌తోనే తెలుస్తోంది. ఇందులో ఆంథోనీ రామోస్, డొమినిక్ ఫిష్బ్యాక్ నటీనటులుగా ఉన్నారు. దర్శకుడు స్టీవెన్ కాపెల్ జూనియర్ ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. వయాకామ్ 18 స్టూడియోస్ ద్వారా ఇంగ్లీష్, హిందీ, తమిళ్, తెలుగు 2D, 3D, 4D, IMAXలో వచ్చేసింది. (ఇదీ చదవండి: నిర్మాతపై కోపంతో ఆ పెళ్లి చేసుకున్న: ప్రముఖ నటి) -
ఏబీ స్విచ్‌లు ఏవీ..?
మెదక్‌జోన్: కరెంట్‌తో ఎంత మేలు జరుగుతుందో అశ్రద్ధ చేస్తే అంతకు రెట్టింపు కీడు చేస్తోంది. ప్రాణాలను సైతం బలి తీసుకుంటోంది. ఆరు నెలలుగా జిల్లాలో నూతనంగా బిగిస్తున్న ట్రాన్స్ఫార్మర్లకు ఏబీ స్విచ్ (ఆన్,ఆఫ్)లు అమర్చడం లేదు. దీంతో ఎప్పుడు ఎలాంటి ప్రమాదం జరుగుతుందోనని క్షేత్రస్థాయి అధికారులతో పాటు రైతులు ఆందోళన చెందుతున్నారు. ♦ జిల్లావ్యాప్తంగా 4.20 లక్షల ఎకరాల సాగు భూములు ఉన్నాయి. కానీ చెప్పుకోదగ్గ సాగునీటి ప్రాజెక్టులు లేకపోవడంతో అధికంగా రైతులు బోరుబావుల మీదనే ఆధారపడి వ్యవసాయం చేస్తున్నారు. ♦ ఇప్పటికే జిల్లాలో 1.98 లక్షల వ్యవసాయ పంపుసెట్లు ఉన్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అనధికారికంగా మరొక 30 వేల బోర్లు ఉన్నాయని సమాచారం. ♦ గతంలో 10 నుంచి 16 బోరుబావులకో 100 కేవీ ట్రాన్స్ఫార్మర్ను అమర్చేవారు. వాటిపై లోడ్ ఎక్కువ కావడంతో తరుచూ కాలిపోయేవి. ♦ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నాణ్యమైన విద్యుత్ సరఫరాతో పాటు 3 నుంచి 4 బోరుబావులకు ఒక 25 కేవీ ట్రాన్స్ఫార్మర్ను అమర్చుతున్నారు. ♦ దీంతో ఒక్క రైతు పొలంలో 3 నుంచి 4 బోర్లు ఉన్నా ఆ రైతుతో 4 డీడీలు కట్టించుకుని సొంతంగా ట్రాన్స్ఫార్మర్ను సదరు రైతు పొలంలోనే అమర్చుతున్నారు. ♦ ఇంతవరకు బాగానే ఉన్నా ఆరు నెలలుగా ఏబీ స్విచ్‌లను బిగించకుండానే రైతుల పొలాల్లో ట్రాన్స్ఫార్మర్లను బిగిస్తున్నారు. ♦ దీంతో తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఏబీ స్విచ్ ఉంటే సదరు రైతు పొలంలో స్టార్టర్ డబ్బా వద్ద ఏమైనా సమస్య ఉత్పన్నమైన, ఫ్యూజ్ వైర్ పోయినా ట్రాన్స్ఫార్మర్ ఆఫ్ చేసుకుని మరమ్మతులు చేసుకుంటాడు. ♦ అయితే ఆసౌకర్యం లేకపోవడంతో సంబంధిత సబ్‌స్టేషన్‌కు ఫోన్ చేసి ఎల్సీ (లైన్) నిలుపుదల చేయాల్సిన పరిస్థితి ఉంటోంది. ఈక్రమంలో ఒక వ్యక్తి ఎల్సీ తీసుకోవాలంటే కనీసం 5 నుంచి 10 నిమిషాల సమయం పడుతుంది. ♦ సామాన్య రైతులకు ఎల్సీ ఇవ్వడం లేదు. ఒక్కమాటలో చెప్పాలంటే రైతుల వద్ద సబ్‌స్టేషన్‌లో విధులు నిర్వహించే ఆపరేటర్ ఫోన్ నెంబరే ఉండదు. ♦ ఆలోపల ఏదైన ప్రమాదం ఉత్పన్నమైనప్పుడు జరగాల్సిన నష్టం జరిగిపోతుందని పలువురు రైతులు వాపోతున్నారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా ఆరు నెలలుగా వందల సంఖ్యలో ట్రాన్స్ఫార్మర్లను బిగించారు. వాటికి కరెంట్ కనెక్షన్ ఇచ్చి వినియోగంలోకి తెచ్చారు. కానీ ఏబీ స్విచ్‌లు మాత్రం అమర్చలేదు. నేటికీ స్టోర్ రూం కరువు.. ♦ జిల్లా ఏర్పాటై నాలుగేళ్లు గడిచినా విద్యుత్ సామగ్రితో పాటు ట్రాన్స్ఫార్మర్ల నిల్వకోసం జిల్లాలో నేటికీ స్టోర్ రూం ఏర్పాటు చేయలేదు. దీంతో అత్యవసరంగా వైర్ కావాలన్నా, ట్రాన్స్ఫార్మర్కు సంబంధించిన ఏదైనా పరికరాలు కావాలన్నా సంగారెడ్డికి పరుగులు పెడుతున్నారు. ♦ కొన్ని సందర్భాల్లో సామగ్రి సమయానికి అందుబాటులో లేకపోవడంతో అత్యవసర పనులు నిలిచిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులకు విన్నవించాం జిల్లాలో ఏబీ స్విచ్‌ల కొరత ఉన్నమాట వాస్తవమే. ఇదే విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. అలాగే జిల్లాకు స్టోర్ రూం లేక విద్యుత్ పరికరాల కోసం సంగారెడ్డి వెళ్లాల్సి వస్తోందని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లాం. త్వరలో ప్రభుత్వ భూమి ఇచ్చి స్టోర్ రూం నిర్మిస్తామని చెప్పారు. – జానకిరాములు, ఎస్ఈ విద్యుత్‌శాఖ మెదక్ -
స్తంభంపైనే మృత్యువాత
వనపర్తి రూరల్: వనపర్తి జిల్లా కడుకుంట్ల గ్రామంలో విద్యుత్ షాక్‌తో ఓ వ్యక్తి మృతి చెందాడు. వివరాలిలా ఉన్నాయి.. వనపర్తి మండంలోని కడుకుంట్లలో ఆంజనేయులు అనే రైతు సోమవారం ఉదయం గ్రామ శివారులోని తన పొలంలో మోటర్‌కు విద్యుత్ కనెక్షన్ ఇవ్వాలని కోరడంతో స్థానికంగా హౌస్వైరింగ్, ప్లంబింగ్ పనిచేసే వారాల వెంకటేశ్వర్లు (48) సమీపంలోని ట్రాన్స్ఫార్మర్ వద్ద విద్యుత్ సరఫరాను నిలిపివేసి స్తంభం ఎక్కాడు. అయితే ఈ స్తంభానికి మరో ట్రాన్స్ఫార్మర్ నుంచి విద్యుత్ సరఫరా అవుతున్న విషయం తెలియక వెంకటేశ్వర్లు, కనెక్షన్ ఇచ్చే ప్రయత్నంలో షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. సమీపంలో పనిచేస్తున్న ఉపాధి కూలీలు ఇది గమనించి వెంటనే అధికారులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న అధికారులు మృతదేహాన్ని కిందకు దించి జిల్లా ఆస్పత్రికి తరలించారు. మృతుడి భార్య లావణ్య ఫిర్యాదు మేరకు రూరల్ ఎస్ఐ షేక్‌షఫీ కేసు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, గతంలో వెంకటేశ్వర్లుతోనే స్థానిక లైన్మాన్ అశోక్ చాలాసార్లు స్తంభాలను ఎక్కించి విద్యుత్ పనులు చేయించినట్టు గ్రామస్తులు తెలిపారు. దీనిపై లైన్మాన్ అశోక్‌ను వివరణ కోరగా.. తనకు సమాచారం ఇవ్వకుండా స్తంభం ఎక్కడంతోనే ఈ సంఘటన చోటుచేసుకుందన్నారు. -
లైన్‌మేన్ సతాయిస్తుండు!
గండేడ్: వెన్నాచేడ్ సబ్‌స్టేషన్ పరిధిలోని రంగారెడ్డిపల్లి సమీప చిన్నవాగు సమీపంలో 10మంది రైతులు కలిసి పొలాలకు నీరు మళ్లించేందుకు ఓ ట్రాన్స్ఫార్మర్ను వేసుకున్నారు. వారంరోజుల కిందట లోఓల్జేజీ సమస్య చెడిపోయింది. రైతులందరూ కలిసి దాన్ని తీసుకెళ్లి మరమ్మతు చేయించి తీసుకొచ్చారు. దానికి తిరిగి కనెక్షన్లు ఇచ్చి కరెంట్ సరఫరా చేయమని ఎన్నిసార్లు లైన్‌మేన్ అచ్చుతారెడ్డిని బతిమాలినా పట్టించుకోవడంలేదని రైతులు వాపోతున్నారు. మోటార్లు నడవక పోవడంతో రైతులు సాగుచేసిన పైర్లు ఎండుతున్నాయి. మూగజీవాలకు నీరు లేదని రైతులు వాపోతున్నారు. ఈ విషయాన్ని మండల ట్రాన్స్ ఏఈ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత ట్రాన్స్‌కో ఉన్నతాధికారులు స్పందించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
దొరికిన ట్రాన్స్ఫార్మర్ చోరీ నిందితులు
మద్నూర్(జుక్కల్): నియోజకవర్గంలో గత కొన్ని రోజులు ట్రాన్స్ఫార్మర్ దొంగలు పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేశారు. నిత్యం ఏదో ఒక చోట ట్రాన్స్ఫార్మర్లను చోరీ చేస్తూ పోలీసులకు చిక్కకుండాపోయారు. అయినా తప్పు చేసిన వారు పోలీసుల నుంచి తప్పించుకోలేరని ఎస్ఐ మహమ్మద్ సాజిద్ తెలిపారు. మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో శనివారం సాయంత్రం ఆయన విలేకరులకు వివరాలు వెల్లడించారు. జుక్కల్ నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో రాత్రి సమయాల్లో 50 ట్రాన్స్ఫార్మర్లను పగలగొట్టి ఆయిల్, కాపర్, తదితర వస్తువులను చోరీ చేశారని ఆయన అన్నారు. బిచ్కుందకు చెందిన కర్నాల్‌సింగ్, దారా సింగ్(హింగోళీ, మహారాష్ట్ర), శంశేర్ సింగ్(హింగోళీ, మహారాష్ట్ర), కుల్దీప్ సింగ్(షోలాపూర్, మహారాష్ట్ర) నిందితులు ఈ ట్రాన్స్ఫార్మర్ల చోరీలకు పాల్పడుతూ పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్నారన్నారు. బిచ్కుందకు చెందిన కర్నాల్‌సింగ్‌కు మహారాష్ట్రకు చెందిన ముగ్గురు నిందితులు బంధువులని తెలిపారు. వారు నలుగురు ముఠాగా ఏర్పడి చోరీలు చేస్తున్నారన్నారు. ఈ విషయమై రైతుల నుంచి పెద్ద మొత్తంలో ఫిర్యాదులు అందడంతో కేసును చాలెంజ్‌గా తీసుకున్నామన్నారు. గ్రామాల్లో సీసీ కెమెరాలను క్షుణ్నంగా పరిశీలిస్తూ నిఘా పెంచామన్నారు. మండలంలోని పెద్ద తడ్గూర్లో ట్రాన్స్ఫార్మర్ చోరీకి పాల్పడినప్పుడు గ్రామంలో ఏర్పా టు చేసిన సీసీ కెమెరాల్లో నిందితులు అనుమానాస్పదంగా కనిపించారన్నారు. సీసీ పుటేజీ ఆధారంగా వారి కదలికలను గమనించగా అనుమానం నిజమైందన్నారు. శనివారం ఉదయం నలుగురు నిందితులను మండలంలోని సలాబత్పూర్ వద్ద పట్టుకున్నామని, వారి వద్ద చోరీ చేసిన కాపర్ తీగలు లభ్యమయ్యాయని చెప్పారు. ముగ్గురు నిందితుల్లో ఒకరు కుల్దీప్సింగ్ పరారయ్యాడని త్వరలోనే అతడిని పట్టుకుంటామన్నారు. ఈ నలుగురిపై 37 కేసులు నమోదయ్యాయని ఎస్ఐ చెప్పారు. గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటుతోనే దొంగలు దొరికారని ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటే బాగుంటుందన్నారు. నిందితులను పట్టుకున్న వారిలో తనతోపాటు మద్నూర్ ఏఎస్ఐ వెంకట్రావ్, జుక్కల్ ఎస్ఐ అభిలాశ్, బిచ్కుంద ఎస్ఐ క్రిష్ణ, కానిస్టేబుళ్లు నరేందర్, సంజు, సిబ్బంది ఉన్నారన్నారు. -
విద్యుత్ లైన్లు మృత్యుపాశాలు!
సాక్షి, ఉప్పునుంతల: మండలంలోని పలు గ్రామాల్లో విద్యుత్ తీగలు ప్రమాదకరంగా ఉన్నాయి. 11కేవీఏ లైన్లు ఇళ్లపై వేలాడుతుండడంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఈదురుగాలులు, ఉరుములు మెరుపుల సమయంలో మరింత భయపడుతున్నారు. దీంతోపాటు గ్రామాల్లో ఎన్నో ఏళ్ల క్రితం పాతిన స్తంభాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. వ్యవసాయ పొలాల్లో రైతులు కర్ర స్తంభాలపైనే విద్యుత్ లైన్లను అమర్చి ప్రమాదపుటంచున వ్యవసాయ పనులు చేసుకుంటున్నారు. ప్రతి గ్రామంలో ఇలాంటి సమస్యలు ఏళ్ల తరబడిగా ప్రజలను వేధిస్తున్నాయి. పలుమార్లు ప్రజాప్రతినిధులకు, సంబంధిత అధికారులకు విన్నవించుకున్నా ఫలితంలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇళ్లపై 11కేవీఏ లైన్లు.. మండలంలోని వెల్టూరులోని ఫకీర కాలనీలో 11కేవీఏ విద్యుత్ లైన్లు ఇళ్ల పై నుంచి ఉన్నాయి. దీంతో ఆ కాలనీవాసులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. గతంలో పలుమార్లు ప్రమాదాలు జరిగిన సంఘటనలు ఉన్నాయి. దాసర్లపల్లిలో కూడా అలాగే ఉన్నాయి. మూడేళ్ల క్రితం గాలి దుమారానికి విద్యుత్ లైన్ తీగలు తెగిపడి పశుగ్రాసం, గుడిసెలు కాలిపోయాయి. ఆ సమయంలో విద్యుత్ లైన్ మారుస్తామని అధికారులు చెప్పారు. ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఉప్పునుంత మడ్డవోనిపంపు ఎస్సీ కాలనీ, బీసీ కాలనీ, తిర్మలాపూర్, తిప్పాపూర్, వెల్టూర్ తదితర గ్రామాల్లో విద్యుత్ లైన్లు ఇళ్లపై ఉన్నాయి. వీటితో పాటు కొన్నేళ్ల క్రితం ఆయా గ్రామాల్లో ట్రాన్స్ఫార్మర్లు ఇళ్ల మధ్యలో ఏర్పాటు చేయడంతో వారు ఆందోళన చెందుతున్నారు. వ్యవసాయ పొలాల్లో.. వ్యవసాయ పొలాల్లో విద్యుత్ లైన్లు మరింత ప్రమాదకరంగా ఉన్నాయి. గుట్టమీది తండా శివా రులో విద్యుత్ తీగలు పూర్తిగా కిందకు వేలాడుతున్నాయి. ఉప్పునుంతల నుంచి కొత్త రాంనగర్ వెళ్లే దారి పక్కన బల్సోని బావి వద్ద రైతులు కొన్నేళ్ల నుంచి రైతులు కర్ర స్తంభాలపైనే విద్యుత్ తీగలు అమర్చుకొని మోటార్లు నడుపుకుంటూ కాలం వెళ్లదీస్తున్నారు. సంబంధిత ట్రాన్స్‌కో అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. మార్పునకు ప్రొవిజన్ లేదు కాలనీలు, ఇళ్లపై ఉన్న విద్యుత్ లైన్లు మార్చడానికి శాఖాపరంగా ప్రొవిజన్ లేదు. కాలనీ వాసులు, ఇళ్ల యజమానులు లైన్ మార్పిడికి అయ్యే ఖర్చు భరిస్తే మాత్రం అవకాశం ఉన్నచోట ప్రతిపాదనలు తయారుచేసి విద్యుత్ లైన్ మార్పిడి చేసే అవకాశం ఉంది. గ్రామాల్లో కొన్నేళ్ల క్రితం వేసిన కరెంట్ లైన్లు వేలాడుతుంటే, స్తంభాలు ఒరిగిపోతే, బిల్లులు పెండింగ్ లేకుండా చెల్లిస్తే మార్చే అవకాశం ఉంది. వ్యవసాయ మోటారు కనెక్షన్‌కు డీడీలు కట్టిన రైతులకు మాత్రం ఇంతకుముందు మెటీరియర్ డ్రా చేయకుండా ఉంటే ప్రస్తుతం వాటిని పరిశీలించి వారికి వచ్చే మెటీరియల్‌ను ఇప్పిస్తున్నాం. – సురేష్, డిస్కం ఏఈ, ఉప్పునుంతల -
బదిలీలకు గ్రీన్ సిగ్నల్!
జోగుళాంబ శక్తిపీఠం: దేవాదాయ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగుల బదిలీలకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఏళ్లుగా పాతుకుపోయిన ఉద్యోగులకు ఇక స్థాన చలనం జరుగనుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం జీఓ ఎం.ఎస్ నెం07 విడుదల చేసింది. ఉమ్మడి జిల్లాలో రాష్ట్ర దేవాదాయ శాఖ పరిధిలో ఉన్న 51ఆలయాల్లో ఇది అమలుకానుంది. గత 12 ఏళ్లుగా ఉద్యోగులు కొందరు ఒకే ఆలయంలో పనిచేస్తూ అక్రమాలకు పాల్పడ్డారు. మరోవైపు ఒకే ఆలయంలో పనిచేయడం వల్ల కొందరు ఉద్యోగులు అభివృద్ధికి కారకులయ్యారు. ఉమ్మడి జిల్లాలోని 51 ఆలయాల్లో మొత్తం ఉద్యోగులు 620 మంది ఉన్నారు. ఇందులో అర్చక స్వాములు 171 మంది ఉన్నారు. జూనియర్ అసిస్టెంట్లు, సీనియర్ అసిస్టెంట్లు, రికార్డు అసిస్టెంట్లు, అటెండర్, వాచ్మెన్లు ఇలా వివిధ క్యాటగిరీలలో 449మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. వీరిలో అర్చకులు మినహా ఇతర క్యాటగిరీలో ఉన్న ఉద్యోగులకు ఈ జీవో ప్రకారం బదిలీలు జరగనున్నాయి. కాగా నేటిదాకా గ్రాంట్ ఇన్ ఎయిడ్ ద్వారా దాదాపు 273 మంది మాత్రమే వేతనాలు అందుకుంటున్నారు. ఇది వర్తించని వారికి కూడా బదిలీలు ఉంటాయా? లేదా అనేది ప్రశ్నార్థంగా మారింది. స్థానిక నేతల అండదండలతో... ఉమ్మడి జిల్లాలోని కొన్ని ఆలయాల్లో ఉన్నత హోదాలో ఉన్న ఉద్యోగులు సైతం అనేక విషయాల్లో అక్రమాలకు పాల్పడ్డారు. దీంతో అక్కడి భక్తులు కొందరు దేవాదాయ శాఖకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు విచారణ చేసిన దేవాదాయ వాఖ వారిని ఇతర ఆలయాలకు బదిలీ చేశారు. అయినా వీరు రాజకీయ నేతల ఒత్తిడితో మళ్లీ ఉన్న చోటుకే వదిలీ చేయించుకున్నారనే విమర్శలు ఉన్నాయి. 20శాతం మందికి తప్పనిసరి జీవో 7 ప్రకారం తొలివిడతగా 20శాతం మంది బదిలీలు కానున్నారు. ఇందులో ఉమ్మడి జిల్లాలోని అలంçపూర్, మన్యంకొండ, కురుమూర్తి, ఉమామహేశ్వరం, మద్దిమడుగు, జమ్ములమ్మ, బీచుపల్లి, నాయినోనిపల్లి , కకాకర్లపాడు, చిన్నరాజమూరు, గంగాపురం, ఉర్కొండపేట, మఖ్తల్, మల్దకల్, సింగవట్నం, బుద్దారం గండి, పాలెం, సిరిసనగండ్ల, చింతరేవుల, పాగుంట తదితర ఆలయాలతో ఇతర చిన్న ఆలయాల్లో కూడా ఉద్యోగుల బదిలీలు జరగనున్నాయి. సంతోషంలో ఉద్యోగులు భార్యాపిల్లలకు దూరంగా ఉంటున్నవారు, అలాగే ఏళ్ల తరబడి ఒకే ఆలయంలో పనిచేస్తూ స్థానిక నేతల ఒత్తిడితో మానసిక వేదనకు గురవుతున్న ఉద్యోగులు జీవో విడుదలతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన కమిషనర్ అనిల్‌కుమార్ ఆలయాల ఉద్యోగులు, అడ్మినిస్ట్రేషన్‌పై పూర్తిస్థాయిలో కసరత్తు చేసి, సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. బాధ్యతాయుతంగా పని చేస్తారు బదిలీలతోనే ఆలయ ఉద్యోగులు బాధ్యతాయుతంగా పని చేస్తారు. ఏ శాఖలో అయినా బదిలీలు సర్వసాధారణం. ఎప్పుడూ ఒకేచోట లాంగ్‌స్టాండింగ్‌లో ఉద్యోగి పనిచేయడం సరికాదు. ఆలయాల వ్యవస్థ గాడిలో పడి అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉంటుంది. – కృష్ణ, సహాయ కమిషనర్, దేవాదాయ శాఖ బదిలీలను స్వాగతిస్తున్నాం ఆలయాల్లో ఉద్యోగులు అక్రమాలకు పాల్పడ్డారనేవి కేవలం ఆరోపణలు మాత్రమే. పండుగలు, పబ్బాలు, భార్యాపిల్లలను వదిలి ఆలయాల్లోనే దశాబ్దాల కాలంగా పనిచేస్తున్నారు. కొన్నిసార్లు స్థానిక చోటామోటా లీడర్ల గొంతెమ్మ కోర్కెలను కాదనప్పుడు ఉద్యోగులపై ఇలాంటి అవినీతి ఆరోపణలు రావడం సహజమే. మేం బదిలీలను స్వాగతిస్తున్నాం. కొత్త స్థానాల్లో మరింత ఉత్సాహంతో పని చేస్తాం. – జయపాల్ రెడ్డి, జిల్లా అర్చక, ఉద్యోగ సంఘం అధ్యక్షుడు -
ఇళ్లపై యమపాశాలు..!
సాక్షి, పెద్దకొత్తపల్లి: మండలంలోని ఆయా గ్రామాల్లో ప్రజల నివాస ఇళ్లపై 11కేవీ విద్యుత్ వైర్లు వేలాడుతూ చిన్నపాటి గాలి, వర్షాలకు మంటలు రావడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. విద్యుత్ వైర్లను తొలగించాలని అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా.. పట్టించుకోకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. మండలంలో ఇండ్లపై విద్యుత్ వైర్లు ఉన్న గ్రామాలు మండల కేంద్రంతోపాటు ముష్టిపల్లి, పెద్దకారుపాముల, దేవల్‌తిర్మలాపూర్, సాతాపూర్, కల్వకోల్, చెన్నపురావుపల్లి, జొన్నలబొగుడలో ప్రజల ఇండ్లపై విద్యుత్ వైర్లు వేలాడుతున్నాయి. రైతులు పండించిన పంటలను మేడలపై ఆరబెట్టుకునేందుకు పైకి వెళ్తే ప్రమాదాలు జరుగుతున్నాయి. వైర్లను తొలగించాలని ఆయా గ్రామాల్లో ప్రజలు, రైతులు అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం లేకుండా పోయింది. గతంలో పెద్దకారుపాములలో వస్త్రాలను ఆరబెట్టేందుకు మేడపైకి వెళ్లిన యువకుడు విద్యుదాఘాతానికి గురై మృతిచెందాడు. ఆరు నెలల క్రితం చంద్రకల్ గ్రామంలో ఇంటిపై ఉన్న విద్యుత్ వైరు తగలడంతో యువకుడు చనిపోయాడు. వెన్నచర్లలో 11కేవీ విద్యుత్ వైరు గొర్రెలమందపై పడటంతో పది గొర్రెలు మృత్యువాత పడ్డాయి. ఇళ్లపై ఉన్న వైర్లను తొలగించాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. ఇళ్ల మధ్యన ఉన్న ట్రాన్స్ఫార్మర్ మండలంలోని వెన్నచర్ల, సాతాపూర్, దేదినేనిపల్లి, పెద్దకారుపాముల, ముష్టిపల్లి గ్రామాలలో ఇండ్లమధ్యన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఉండటంతో చిన్నపాటి ఈదురు గాలులు, వర్షాలు వచ్చినప్పుడు ట్రాన్స్ఫార్మర్ల వద్ద ఫీజులు ఎగిరిపోవడంతో పెద్ద మంటలు వ్యాపిస్తున్నాయి. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇండ్ల మధ్యన ఉన్న ట్రాన్స్ఫార్మర్లను తొలగించాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. ట్రాన్స్ఫార్మర్లను తొలగించాలి గ్రామాలలో ఇండ్ల మధ్యన ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను తొలగించి ప్రజల ఇబ్బందులు పడకుండ చూడాలి. గ్రామాల చివర విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేస్తే ప్రజలకు సౌకర్యంగా ఉంటుంది. ట్రాన్స్ఫార్మర్లను తొలగించేందుకు విద్యుత్ అధికారులు చొరవ చూపాలి. – జలాల్ శివుడు, బీజేపీ మండలాధ్యక్షులు, పెద్దకొత్తపల్లి ఇళ్లపై వైర్లను తొలగించాలి పెద్దకొత్తపల్లి, పెద్దకారుపాముల, ముష్టిపల్లి, మరికల్, సాతాపూర్, వెన్నచర్లలో ఇండ్లపై ఉన్న విద్యుత్ వైర్లను తొలగించి ఇండ్లకు దూరంగా ప్రత్యేక లైన్లు ఏర్పాటు చేయాలి. విద్యుత్ అధికారులు బిల్లు వసూలుపై చూపిన శ్రద్ధ వైర్లు తొలగించడంపై చూపడం లేదు. ఇండ్లపై ఉన్న వైర్లను తొలగించాలి. – శేఖర్, పెద్దకొత్తపల్లి -
‘ముందస్తు’ బదిలీలు..!
సాక్షిప్రతినిధి, కరీంనగర్: ముందస్తు ఎన్నికల ఊహాగానాల నేపథ్యంలో పలువురు అధికారులకు స్థాన చలనం కలుగుతుండటం చర్చనీయాంశంగా మారింది. రెండు రోజుల వ్యవధిలో ప్రభుత్వం ఐఏఎస్, ఐపీఎస్‌ల బదిలీలకు శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలో13 మంది ఐఏఎస్, 9 మంది ఐపీఎస్‌ల ను బదిలీ చేసింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ముగ్గురు ఐఏఎస్, ఇద్దరు ఐపీఎస్ అధికారులకు బదిలీలు, పోస్టింగ్‌లు ఉత్తర్వులు ఇచ్చారు. జిల్లాల పునర్విభజన తర్వాత నియమితులైన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు పలువురు బదిలీలు, పదవీ విరమణ చేయగా, ఉన్న కొందరు అధికారులను అటు ఇటుగా మార్పులు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ముందస్తు ఎన్నికలు ఖాయమన్న చర్చ జరుగుతున్న తరుణంలో బదిలీలు ప్రాధాన్యత సంతరించుకోగా, త్వరలోనే మరికొందరు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు తోడు జాయింట్ కలెక్టర్లు, డీఆర్వోలు, ఆర్డీవోలు, అసిస్టెంట్ పోలీసు కమిషనర్లు, డీఎస్పీల బదిలీలు కూడా పెద్ద మొత్తంలో జరగనున్నాయని అధికారవర్గాల సమాచారం. ఈ మేరకు చేస్తున్న కసరత్తు కూడా తుది దశకు చేరిందంటున్నారు. కలెక్టర్లతో మొదలైన బదిలీల పరంపర.. రెండు రోజులుగా సాగుతున్న బదిలీల ప్రక్రియ పాత కరీంనగర్ జిల్లాలో ఐఏఎస్‌లతో మొదలైంది. మంగళవారం వెలువడిన ఉత్తర్వులలో సిద్దిపేట కలెక్టర్ పి.వెంకట్రాంరెడ్డిని రాజన్న సిరిసిల్ల కలెక్టర్‌గా నియమించిన ప్రభుత్వం, అక్కడి కలెక్టర్ డి.కృష్ణభాస్కర్‌ను సిద్దిపేట కలెక్టర్‌గా నియమించింది. కరీంనగర్ నగర పాలక సంస్థ కమిషనర్ కె.శశాంకను పదోన్నతిపై జోగుళాంబ గద్వాల జిల్లా కలెక్టర్‌గా నియమిస్తూ బుధవారం ఉత్తర్వులు వెలువడ్డాయి. అదేవిధంగా కరీంనగర్ డీఆర్వోగా విధులు నిర్వరిస్తున్న ఆయేషా మస్రత్ ఖానమ్‌ను ఖమ్మం జిల్లా జాయింట్ కలెక్టర్‌గా బదిలీ చేశారు. పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీసు కమిషనర్ వీజే దుగ్గల్ పది రోజుల క్రితం ఇతర రాష్ట్రాల సర్వీసులో వెళ్లగా, ఆయన స్థానంలో హైదరాబాద్‌లో పనిచేస్తున్న సత్యనారాయణను పోలీసు కమిషనర్‌గా నియమించారు. పెద్దపల్లి జిల్లా కొంతకాలంగా ట్రైనీ ఐపీఎస్, ఏఎస్పీగా పనిచేసిన సింధూశర్మను పదోన్నతిపై జగిత్యాల ఎస్పీగా నియమించారు. అక్కడి ఎస్పీ సునిల్దత్ను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీగా నియమించారు. అయితే.. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మరికొందరు ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలు కూడా త్వరలోనే ఉంటాయన్న సంకేతాలు సదరు అధికారులకు ప్రభుత్వం నుంచి అందినట్లు చెప్తున్నారు. ఇదే సమయంలో ప్రధానంగా పోలీసు, రెవెన్యూ శాఖలలో కూడా అన్ని స్థాయిల్లో బదిలీలపై కసరత్తు జరుగుతున్నట్లు సమాచారం. ఎన్నికల నిబంధనలే ప్రామాణికం.. బదిలీలకు మార్గదర్శకాలు.. ఎన్నికల సమయంలో అధికార పార్టీకి వత్తాసు పలికే విషయంలో రెవెన్యూ, పోలీసులపై ఆరోపణలు వెల్లువెత్తడాన్ని దృష్టిలో ఉంచుకొని కేంద్ర ఎన్నికల కమిషన్ (ఈసీ) కొన్ని నిబంధనలు రూపొందించింది. దీని ప్రకారం సొంత జిల్లాల్లో పనిచేస్తున్న రెవెన్యూ, పోలీసు అధికారులను పక్క జిల్లాకు బదిలీ చేయాల్సి ఉంటుంది. అలాగే నాలుగేళ్ల కాలంలో మూడేళ్లకు మించి ఒకేస్థానంలో పనిచేస్తున్న రెవెన్యూ, పోలీసులను కూడా వేరే ప్రాంతానికి పంపాల్సి ఉంటుంది. సాధారణంగా ఎన్నికల ప్రక్రియ మొదలుపెట్టిన తర్వాత ఈసీ దీనిపై పోలీసుశాఖకు ఆదేశాలు జారీ చేస్తుంటుంది అయితే.. ఈసీ నుంచి ఇంకా ఆదేశాలు రాకముందే తెలంగాణ పోలీసుశాఖ ఈ పని మొదలుపెట్టింది. నిబంధనల పరిధిలోకి వచ్చే పోలీసు ల అధికారుల జాబితా సిద్ధం చేయాలంటూ అన్ని జిల్లాల ఎస్పీలు, కమిషనర్లకు ఆదేశాలు జారీ అయ్యాయి. 2015 మార్చి 1 నుంచి 2019 ఫిబ్రవరి 28వ తేదీ మధ్య కాలంలో మూడేళ్లు పూర్తయిన వారు, పూర్తి కాబోయే వారి జాబితా సిద్ధం చేసి పంపాలంటూ ఆ ఆదేశాల్లో పేర్కొన్నారు. అయితే రెవెన్యూశాఖలో స్థానికంగా పని చేసే వా రికి ఈ నిబంధనలు వర్తించనుండగా, పోలీసుశాఖలో క్షేత్రస్థాయిలో ముఖ్యమైన విధులు నిర్వర్తిం చే (సివిల్) వారికే ఇవి వర్తించనున్నాయి. కమ్యూనికేషన్స్, స్పెషల్ బ్రాంచి, శిక్షణ వంటివి భాగాల్లో పనిచేసే వారికి వర్తించదని స్పష్టం చేశారు. రెవెన్యూ, పోలీసుశాఖలో ఊపందుకున్న కసరత్తు.. అన్ని స్థాయిల్లో బదిలీలకు రెవెన్యూ, పోలీసుశాఖ కసరత్తు మొదలు పెట్టింది. ఇప్పటికే సిబ్బందికి ఎన్నికల శిక్షణ ప్రారంభించగా తాజాగా మూడేళ్లకు మించి ఒకేచోట పని చేస్తున్న, సొంత జిల్లాలకు చెందిన తహసీల్దార్లు, సీఐల జాబితా తయారు చేసే పని మొదలుపెట్టారు. ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం వీరందర్నీ బదిలీ చేయాల్సి ఉంటుంది. ఎన్నికలకు ముందు మాత్రమే మొదలు పెట్టాల్సిన జాబితా పనిని చాలా ముందుగానే సిద్ధం చేయిస్తుండటం గమనార్హం. పోలీసుశాఖకు వస్తే రెండు పోలీసు కమిషనర్ (కరీంనగర్, రామగుండం), రెండు జిల్లాల ఎస్పీ (జగిత్యాల, రాజన్న సిరిసిల్ల) కార్యాలయాల పరిధిలో మొత్తం 14 పోలీసు సబ్ డివిజన్లు, 27 సర్కిళ్లు, 107 పోలీసుస్టేషన్లు ఉన్నాయి. రామగుండం కమిషనరేట్ పరిధి మంచిర్యాల జిల్లా వరకు కూడా విస్తరించి ఉంది. జిల్లాల పునర్విభజనలో భాగంగా పాత కరీంనగర్ జిల్లా పరిధిలో ఏర్పడిన మొత్తం ఏడు రెవెన్యూ డివిజన్లు, 73 మండల రెవెన్యూ కార్యాలయాలు ఉన్నాయి. ఈ పోలీసు సబ్ డివిజన్లు, రెవెన్యూ డివిజన్ల పరిధిలోని పలువురిని బదిలీ చేసేందుకు కూడా కసరత్తు జరుగుతోంది. -
ఇష్టారాజ్యంగా విద్యుత్ చౌర్యం
– అనధికారంగా విద్యుత్ కనెక్షన్లు.. అక్రమ వసూళ్లు – రూ.వేలు చెల్లించినా రశీదులు ఇవ్వని వైనం – లైన్ ఇన్స్పెక్టర్ నిర్వాకం చిలమత్తూరు : మండల కేంద్రంలోని ట్రాన్స్‌కో కార్యాలయంలో ట్రాన్స్ కో ఉద్యోగి నిబంధనలను తుంగలో తొక్కి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ఎలాంటి రశీదులు చెల్లించకుండా అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని తెలిపారు. వివరాలు.. మండలంలోని వీరాపురం పంచాయతీ హుస్సేన్ పురం, భూపసముద్రం గ్రామాలకు చెందిన పలువురు రైతులతో ఆ ఉద్యోగి అనధికారంగా రూ.వేలు వసూలు చేశారు. వారికి ఎలాంటి రశీదులు, సర్వీసు నంబర్లు ఇవ్వలేదు. హుస్సేన్‌పురం గ్రామానికి చెందిన పురుషోత్తం, శోభ వద్ద రూ.75 వేలు, నాగభూషణరెడ్డితో రూ.40 వేలు, రామాంజితో రూ.24 వేలు, గంగప్పతో రూ.25 వేలు, నరసిరెడ్డితో రూ.25 వేలు వసూలు చేశారు. అదేవిధంగా భూపసముద్రం గ్రామానికి చెందిన పోస్టు శివారెడ్డి వద్ద రూ.40 వేలు, నారాయణస్వామి, రామప్ప, గంగిరెడ్డి, బి.గంగప్ప, ఆదినారాయణ, నాగభూషణరెడ్డి తదితరులతో రూ.25 వేలకు పైగా వసూళ్లు చేసి ఎలాంటి రశీదులు ఇవ్వలేదు. దీంతో సుమారు రెండు నెలలు గడిచినా ఇంతవరకు సర్వీసు కనెక్షన్లకు నంబర్లు కూడా ఇవ్వలేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి అక్రమాలకు పాల్పడుతున్న లైన్ ఇన్స్పెక్టర్పై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు. సర్వీసు నంబర్లు ఇవ్వలేదు : రైతు నరసింహారెడ్డి బోరు కింద విద్యుత్ క¯ð క్షన్ కోసం కుమారుడు గంగిరెడ్డి పేరు మీద రూ.23 వేలు చెల్లించాను. దీనికి సంబంధించిన ఎలాంటి రశీదులు, సర్వీసు నంబర్లు ఇంతవరకు ఇవ్వలేదు. ఇదెక్కడి న్యాయం. అధికారులు స్పందించి రైతులకు న్యాయం చేయాలని కోరుతున్నాం. ఉన్నతాధికారులకు నివేదికలు పంపుతాం : ప్రభాకర్, విద్యుత్ శాఖ ఏఈ హెచ్‌వీడీఎస్ పథకం కింద లోఓల్టేజీ సమస్య పరిష్కరించడం కోసం ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేస్తున్నాం. అందులో భాగంగా వీరాపురం పంచాయతీ హుస్సేన్‌పురం, భూపసముద్రం గ్రామాలకు చెందిన రైతుల వద్ద అనధికారికంగా అక్రమ వసూళ్లు చేసినట్లు రైతుల వద్ద నుంచి ఫిర్యాదు అందింది. దీనిపై ఉన్నతాధికారులకు నివేదికలు పంపుతాం. -
ట్రాన్స్ఫార్మర్ల కొను‘గోల్మాల్’
టెండర్లు లేకుండా కొనుగోలు పాత సంస్థకే మళ్లీ ఆర్డర్ ఇచ్చిన సెస్ మెజారిటీ డైరెక్టర్లు వద్దన్నా అటువైపే మొగ్గు రూ.92.50 లక్షలతో 70 ట్రాన్స్ఫార్మర్ల కొనుగోలు సిరిసిల్ల : సిరిసిల్ల సహకార విద్యుత్ సరఫరా సంఘం(సెస్)లో ట్రాన్స్ఫార్మర్ల కొనుగోలు వివాదాస్పదమైంది. పర్చేస్ కమిటీ టెండర్లు పిలువకుండానే 70 ట్రాన్స్ఫార్మర్లను రూ.92.50 లక్షలతో కొనుగోలు చేయడానికి ఆర్డర్ ఇవ్వడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిబంధనల ప్రకారం టెండర్లు పిలువాల్సి ఉండగా.. అదేం లేకుండా పాత కంపెనీకే కొత్త ఆర్డర్లు ఇచ్చినట్లు సమాచారం. ఈ వ్యవహారంలో ‘సెస్’లోని కీలక వ్యక్తులు కమీషన్లు(ముడుపులు) పొందారనే ఆరోపణలున్నాయి. కొత్త ట్రాన్స్ఫార్మర్ల కొనుగోలుపై సెస్ పాలకవర్గంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మెజారిటీ డైరెక్టర్లు వద్దన్నా.. కొత్త ట్రాన్స్ఫార్మర్ల కొనుగోలుపై మెజారిటీ డైరెక్టర్లు ఇటీవల సమావేశమై టెండర్లు పిలువాలని.. పాత సంస్థకు ఇచ్చే ఆర్డర్లను రద్దు చేయాలని సెస్ చైర్మన్ దోర్నాల లక్ష్మారెడ్డికి లేఖ అందించారు. దీనిపై పాలకవర్గ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటానని చైర్మన్ హామీ ఇచ్చారు. కానీ మళ్లీ పాత సంస్థకే ట్రాన్స్ఫార్మర్ల కొనుగోలు ఆర్డర్ ఇవ్వడంపై డైరెక్టర్లే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్లో ఐరన్, కాపర్, ఇతర సామగ్రి ధరలు తగ్గిన నేపథ్యంలో పాత ధరలకే ట్రాన్స్ఫార్మర్లు కొనుగోలు చేయడంపై డైరెక్టర్లు అభ్యంతరం తెలిపారు. 100 కేవీ ట్రాన్స్ఫార్మర్ ధర రూ.1.60 లక్షలు ఉండగా, 60 కేవీ ట్రాన్స్ఫార్మర్ ధర రూ.95 వేలు ఉంది. ఇంత కన్నా తక్కువ ధరకు ఇతర కంపెనీలు సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్నా.. పాత కంపెనీకే ఆర్డర్ ఇవ్వడం వివాదాస్పదంగా మారింది. సదరు కంపెనీతో చేసుకున్న కమీషన్ల ఒప్పందం మేరకే మళ్లీ ఆర్డర్ ఇచ్చినట్లు ఆరోపణలున్నాయి. పునరావాస కాలనీలకు.. మధ్యమానేరు జలాశయంలో ముంపునకు గురవుతున్న గ్రామాలకు ప్రభుత్వం కొదురుపాక, నాంపల్లి, తిప్పాపూర్, చంద్రగిరి గ్రామాల్లో పునరావాస కాలనీలు నిర్మిస్తోంది. ఈ కాలనీల్లో విద్యుత్ సౌకర్యం కల్పించాలని కోరుతూ కలెక్టర్ నీతూప్రసాద్ సెస్ సంస్థకు డబ్బులు డిపాజిట్ చేసింది. వీటితో సెస్ ట్రాన్స్పార్మర్లు కొనుగోలు చేస్తుంది. 100 కేవీ ట్రాన్స్ఫార్మర్లను 40, 60 కేవీ ట్రాన్స్ఫార్మర్లు 30 కొనుగోలు చేసేందుకు పాత కంపెనీకే ఆర్డర్లు ఇచ్చారు. పాత కంపెనీ ప్రతినిధులతో సెస్లోని కీలక వ్యక్తులకు సత్సంబంధాలు ఉండడంతో మళ్లీ ఆ కంపెనీకే ఆర్డర్లు ఇచ్చారనే వాదన ఉంది. సెస్ బాస్ మెతక వైఖరితో అన్నింటికీ తలూపడం, నిబంధనల విషయంలో ముక్కు సూటిగా వ్యవహరించకపోవడంతో కొను‘గోల్మాల్’కు అవకాశంగా మారిందని పాలకవర్గ సభ్యుడొకరు చెప్పారు. తప్పుడు ఆరోపణలు.. దోర్నాల లక్ష్మారెడ్డి, సెస్ చైర్మన్ పునరావాస కాలనీలో విద్యుత్ సౌకర్యం యుద్ధప్రాతిపదికన ఏర్పాటు చేయాలి. ఈ ఏడాదే 3 టీఎంసీల నీటిని మధ్యమానేరులో నిల్వ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఊరు మునిగిపోతే జనం పునరావాస కాలనీకి వస్తారు. అక్కడ కరెంట్ లేక పోతే సెస్‌ను నిందిస్తారు. టెండర్ ప్రాసెస్ పూర్తి కావడానికి 45రోజులు పడుతుంది. అందుకే పాత కంపెనీకే ఆర్డర్లు ఇచ్చాం. అవసరాన్ని బట్టి రిపీట్ ఆర్డర్లు ఇవ్వొచ్చు. పాలకవర్గ సభ్యులకు ఈ విషయంలో స్పష్టత ఇచ్చాను. సమావేశానికి రానివారు, సంస్థను పాలకవర్గాన్ని బద్నాం చేయాలని చూస్తున్నారు. వారివన్నీ తప్పుడు ఆరోపణలు. సంస్థ రూల్స్‌పై నాకు పూర్తి అవగాహన ఉంది. వ్యవసాయ సీజన్ మొదలైంది. ‘సెస్’కు ట్రాన్స్ఫార్మర్లు వెంటనే అవసరం ఉన్నాయి. అందుకే కొనుగోలుకు ఆర్డర్ ఇచ్చాం.