ఆగని మృత్యుఘోష: ఇద్దరు కమెడియన్లు మృతి | Two Kollywood Comedians Died | Sakshi
Sakshi News home page

కోలీవుడ్‌లో ఆగని మృత్యుఘోష

May 17 2021 8:15 AM | Updated on May 17 2021 10:09 AM

Two Kollywood Comedians Died - Sakshi

అయ్యప్పన్‌ గోపి

రెండు నెలల వ్యవధిలో పలువురు సినీ ప్రముఖులు కన్నుమూశారు. తాజాగా మరో ఇద్దరు నటులు తనువు చాలించారు.  హాస్య పాత్రలు పోషించి గుర్తింపు పొందిన..

తమిళ చిత్ర పరిశ్రమ కరోనా కోరల్లో చిక్కుకుంది. రెండు నెలల వ్యవధిలో పలువురు సినీ ప్రముఖులు కన్నుమూశారు. తాజాగా మరో ఇద్దరు నటులు తనువు చాలించారు. వారిలో నటుడు పొన్‌రాజ్‌ ఒకరు. వరుత్తపడాద వాలిబర్‌ సంఘం, రజనీ మురుగన్, ఆంటీ చిత్రాల్లో హాస్య పాత్రలు పోషించి గుర్తింపు పొందిన ఈయన దర్శకుడు పొన్‌రామ్‌ వద్ద సహాయ దర్శకుడిగా కూడా పని చేశారు.

కాగా పొన్‌రాజ్‌ శనివారం గుండెపోటుతో కన్నుమూశారు. ఈయన మృతికి వరుత్తపడాద వాలిబర్‌ సంఘం చిత్ర యూనిట్‌ ప్రగాఢ సంతాపాన్ని తెలిపింది. మరో హస్య నటుడు అయ్యప్పన్‌ గోపి కూడా ఇటీవల కన్నుమూశారు. కె.బాలచందర్‌ 'జాతిమల్లి' చిత్రం ద్వారా నటుడిగా పరిచయం అయ్యారు. సూర్య 'ఆరు' చిత్రం నుంచి వరుసగా సినిమాలు చేస్తున్నారు. అలాంటి అయ్యప్పన్‌ గోపి మరణం చిత్ర పరిశ్రమను దిగ్భ్రాంతికి గురి చేసింది.

చదవండి: కోరిక తీరిస్తే ఎంత డబ్బైనా ఇస్తానంటూ నటికి లెక్చరర్‌ వేధింపులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement