comedians
-
తిరుమల సన్నిధిలో తెలుగు టాప్ కమెడియన్స్ (ఫోటోలు)
-
హీరోల్.. ఫర్ ఎ చేంజ్ కథానాయకులుగా
హస్య నటులు, ప్రతినాయకులు, సహాయ నటులుగా కనిపించి, ఆకట్టుకునే నటులు ఫర్ ఎ చేంజ్ కథానాయకులుగా కనిపిస్తే ఆ సినిమాకి కావాల్సినంత క్రేజ్ ఏర్పడుతుంది. ఆ నటులకు కూడా రొటీన్ క్యారెక్టర్స్ నుంచి కాస్త మార్పు దక్కుతుంది. ఎక్కువగా కమెడియన్లు, విలన్లు, క్యారెక్టర్లు ఆర్టిస్టులుగా చేసే ఆ నటులు ఇప్పుడు హీ‘రోల్’లో కనిపించనున్నారు. ఆ ‘హీరో’ల్ చేస్తున్న చిత్రాల విశేషాలు తెలుసుకుందాం. తొలిసారి నేపాలీ భాషలో... తెలుగు పరిశ్రమలో హాస్యబ్రహ్మగా పేరు తెచ్చుకున్నారు బ్రహ్మానందం. దాదాపు నలభై ఏళ్లుగా తనదైన హాస్యంతో ప్రేక్షకులను నవ్విస్తున్న ఆయన అడపాదడపా హీరోగానూ చేశారు. ‘బాబాయ్ హోటల్’ (1992), ‘జోకర్ మామ సూపర్ అల్లుడు’ (1992) వంటి చిత్రాల్లో సోలో హీరోగా చేసిన బ్రహ్మానందం ‘సూపర్ హీరోస్’ (1997), ‘హ్యాండ్సప్’ (2020) వంటి మరికొన్ని చిత్రాల్లో ఓ హీరోగా నటించారు. తాజాగా ‘హ్రశ్వ దీర్ఘ’ చిత్రంలో ఆయన ఓ లీడ్ రోల్ చేస్తున్నారు. చంద్ర పంత్ దర్శకత్వంలో తెలుగు, నేపాలీ భాషల్లో ఈ సినిమా రూపొందుతోంది. బ్రహ్మానందం నటిస్తున్న ఈ తొలి నేపాలీ చిత్రం సెప్టెంబర్ 27న రిలీజ్ కానుంది. ఆరు పదులలో ప్రేమ ఆరు పదుల వయసులో ప్రేమలో పడ్డారు రాజేంద్రప్రసాద్, జయప్రద. ఈ ఇద్దరూ జంటగా నటించిన చిత్రం ‘లవ్ః65’. వీఎన్ ఆదిత్య దర్శకత్వం వహించిన ఈ చిత్రం టీజర్ ఆ మధ్య విడుదలైంది. ‘ఈ ప్రపంచాన్నే బహిష్కరిద్దాం’ (రాజేంద్ర ప్రసాద్), ‘నాకోసం ఏడ్చింది నువ్వు ఒక్కడివే’ (జయప్రద) వంటి డైలాగులు టీజర్లో ఉన్నాయి. త్వరలో ఈ చిత్రం రిలీజ్ రానుంది. వినోదాల సుబ్రమణ్యం కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, విలన్‌గా రావు రమేశ్ ఏ రేంజ్లో విజృంభిస్తారో వెండితెరపై చూస్తుంటాం. ‘మారుతినగర్ సుబ్రమణ్యం’ చిత్రంలో తొలిసారి ఆయన హీరోగా కనిపించనున్నారు. లక్ష్మణ్ కార్య దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రావు రమేశ్ సరసన ఇంద్రజ నటించారు. పూర్తి స్థాయి వినోదంతో, భావోద్వేగాలతో రూపొందిన ఈ సినిమా నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. త్వరలో ఈ చిత్రం విడుదల కానుంది. మధ్యవయస్కుడి కథ తెలుగులో దాదాపు 36 ఏళ్లుగా క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మెప్పిస్తున్నారు రాజా రవీంద్ర. పలు చిత్రాల్లో లీడ్ రోల్స్‌లోనూ నటించిన ఆయన తాజాగా ‘సారంగదరియా’ సినిమాలో లీడ్ రోల్ చేశారు. పద్మారావు అబ్బిశెట్టి దర్శకుడు. మధ్యవయస్కుడైన ఓ వ్యక్తి పరువుగా బతికితే చాలనుకుంటాడు. అయితే అతనికి తన కొడుకులు, కూతురు వల్ల సమాజం నిలదీసే పరిస్థితులు ఎదురవుతాయి. అప్పుడు అతను ఏం చేశాడు? అనే కథాంశంతో ‘సారంగదరియా’ చిత్రం రూపొందింది. మేలో ఈ సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు. తండ్రి విలువ తెలిపేలా... తెలుగులో శివాజీ రాజాది మూడు దశాబ్దాలకు పైగా ప్రయాణం. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, హీరోగా తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారాయన. ఇటీవల సినిమాలకు కొంచెం గ్యాప్ ఇచ్చిన శివాజీ రాజా ‘నాన్నా మళ్లీ రావా..!’లో లీడ్ రోల్ చేస్తున్నారు. ఆయనకు జోడీగా ప్రభావతి నటిస్తున్నారు. నిర్దేష్ దర్శకుడు. మనసుని హత్తుకునే బలమైన సెంటిమెంట్, భావోద్వేగాల నేపథ్యంలో తండ్రి విలువ తెలిపేలా ఈ చిత్రం రూపొందుతోంది. మ్యూజిక్ షాప్‌లో... ‘ప్రస్థానం’ (2010) సినిమాతో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ప్రస్థానం మొదలుపెట్టారు అజయ్ ఘోష్. కమెడియన్, విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్.. ఇలా తెలుగు, కన్నడ, తమిళ భాషల్లో నటించి, మెప్పించారాయన. తాజాగా ‘మ్యూజిక్ షాప్ మూర్తి’లో హీరోగా చేశారు. శివ పాలడుగు దర్శకత్వం వహించిన ఈ సినిమా త్వరలో రిలీజ్ కానుంది. మన జీవితాల్లో మనం ఏం కోల్పోయి ఏ స్థితిలో ఉన్నామో చూపించేలా ఈ చిత్రం ఉంటుందని యూనిట్ పేర్కొంది. -
ఎన్ని గంటలు పనిచేశామన్నది కాదు అసలు పని చేశామా లేదా అన్నది పాయింట్
వర్క్ కల్చర్‌పై ‘ఇన్ఫోసిస్’ కో–ఫౌండర్ నారాయణమూర్తి చేసిన కామెంట్ ‘70 హవర్స్ ఏ వీక్’ సోషల్ మీడియాలో వైరల్ అయింది. రకరకాల కోణాలలో ఈ కామెంట్ గురించి చర్చోపచర్చల మాట ఎలా ఉన్నా స్టాండప్ కమెడియన్లు, మీమ్స్ సృష్టించే వాళ్లకు మాత్రం చేతినిండా పని దొరికింది. స్టాండప్ కమెడియన్ వివేక్ మురళీధరన్ వీడియోలో... ‘ఇప్పుడు మనం 70 హవర్స్ ఏ వీక్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం’ అంటూ సెల్ఫోన్లో క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసి ‘వారానికి 70 గంటలు పని చేయాలంటే’ అంటూ లెక్కలు వేయడం మొదలు పెడతాడు. రోజుకు, వారానికి, నెలకు ఎన్ని గంటలు పనిచేయాల్సి ఉంటుందో చెబుతాడు. టోటల్‌గా చెప్పాలంటే సంవత్సరంలో మనకంటూ మిగిలేది రెండు నెలలే. అందుకే తరచుగా ఈ సంవత్సరం తొందరగా గడిచినట్లు అనిపిస్తుంది అంటుంటాం’ అని వివేక్ అన్నప్పుడు ప్రేక్షకులు గట్టిగా నవ్వారు. ఒకరు ‘పోకిరి’ సినిమా ‘ఎప్పుడు వచ్చావన్నది కాదన్నయ్యా’ డైలాగుతో మీమ్ చేశారు... ‘ఎన్ని గంటలు పనిచేశామన్నది కాదన్నయ్యా,,,, అసలు పనిచేశామా లేదా అన్నది పాయింట్’. -
ఒకవైపు విలనిజం మరోవైపు హాస్యం
-
జబర్దస్త్ టీం తో స్పెషల్ చిట్ చాట్
-
ఆగని మృత్యుఘోష: ఇద్దరు కమెడియన్లు మృతి
తమిళ చిత్ర పరిశ్రమ కరోనా కోరల్లో చిక్కుకుంది. రెండు నెలల వ్యవధిలో పలువురు సినీ ప్రముఖులు కన్నుమూశారు. తాజాగా మరో ఇద్దరు నటులు తనువు చాలించారు. వారిలో నటుడు పొన్రాజ్ ఒకరు. వరుత్తపడాద వాలిబర్ సంఘం, రజనీ మురుగన్, ఆంటీ చిత్రాల్లో హాస్య పాత్రలు పోషించి గుర్తింపు పొందిన ఈయన దర్శకుడు పొన్రామ్ వద్ద సహాయ దర్శకుడిగా కూడా పని చేశారు. కాగా పొన్రాజ్ శనివారం గుండెపోటుతో కన్నుమూశారు. ఈయన మృతికి వరుత్తపడాద వాలిబర్ సంఘం చిత్ర యూనిట్ ప్రగాఢ సంతాపాన్ని తెలిపింది. మరో హస్య నటుడు అయ్యప్పన్ గోపి కూడా ఇటీవల కన్నుమూశారు. కె.బాలచందర్ 'జాతిమల్లి' చిత్రం ద్వారా నటుడిగా పరిచయం అయ్యారు. సూర్య 'ఆరు' చిత్రం నుంచి వరుసగా సినిమాలు చేస్తున్నారు. అలాంటి అయ్యప్పన్ గోపి మరణం చిత్ర పరిశ్రమను దిగ్భ్రాంతికి గురి చేసింది. చదవండి: కోరిక తీరిస్తే ఎంత డబ్బైనా ఇస్తానంటూ నటికి లెక్చరర్ వేధింపులు -
నిర్మాతల్నీ నవ్విస్తారా
సినిమా హిట్ అయినా నిర్మాత నవ్వని సందర్భాలు ఉంటాయి.కలెక్షన్లు కళకళలాడకపోతే ఏం నవ్వు? ఇంగ్లిష్‌లో ఒక వాడుక ఉంది. ‘లాఫింగ్ ఆల్ ది వే టు ద బ్యాంక్’ అని.అంటే ప్రయత్నం ఏం చేసినా చివరకు డబ్బు సాధించారు అని అర్థం.కమెడియన్లు హీరోలుగా చేసి ప్రేక్షకుల్ని నవ్వించిన సందర్భాలు ఉన్నాయి.హీరోలుగానూ ప్రేక్షకులతో పాటు నిర్మాతల్నీ నవ్విస్తే బాగుంటుంది. నవ్విస్తారని ఆశిద్దాం. విలన్ ఫేస్ మీద పంచ్ కొట్టే హీరో మాత్రమే హీరో కాదు. పొట్ట చెక్కలయ్యేలా పంచ్‌లేసే కమెడియన్ కూడా హీరోయే. ఎంత మెయిన్ రోడ్ అయినా ఫుట్‌పాత్ ఉన్నట్టే ఎన్ని పెద్ద హీరోల కథలు ఉన్నా కమెడియన్లకు సరిపడే కథలు ఉండనే ఉంటాయి. అందుకే గతంలో రేలంగి, నగేశ్, రాజబాబు, పద్మనాభం, చలం వంటివారు కమెడియన్లుగా చేస్తూనే హీరోలుగా కూడా రాణించారు. ఆ తర్వాతి తరంలో బ్రహ్మానందం, బాబుమోహన్, అలీ, వేణుమాధవ్, పృథ్వీలాంటి వారికి అవకాశం వచ్చింది. కృష్ణ భగవాన్ అయితే ఏకంగా సిమ్రాన్ పక్కనే హీరోగా నటించారు. కమెడియన్ వేషాలు ఎన్ని వేసినా హీరోగా మారితే వచ్చే క్యాషు, క్రేజు వేరని సునీల్ లాంటి నటులు హీరోలుగా తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. స్క్రీన్ మీద కాసేపుంటేనే ఇంత నవ్వొచ్చిందే సినిమా అంతా ఉంటే ఇంకెంత నవ్వు వస్తుందో అని కమెడియన్ హీరోగా చేస్తే జనం వచ్చే అవకాశం ఉంది కానీ సినిమా అంతా నవ్వించడం, కథను పండించడం అంత సులువేమీ కాదని కొన్ని పరాజయాల వల్ల, కొందరు కమెడియన్ల బ్యాక్ టు పెవిలియన్ వల్ల అర్థమవుతుంది. అయినప్పటికీ కొత్త కొత్త సినిమాలు, కొత్త కొత్త ప్రాజెక్ట్‌లు జనాన్ని సంతోషపెట్టడానికి కెమెరా ముందుకు వస్తున్నాయి. ఆ వివరాలను చూద్దాం. బ్రహ్మీ ఈజ్ బ్యాక్ బ్రహ్మానందం క్రేజ్ ఉధృతంగా ఉన్న రోజుల్లో జంధ్యాల ఆయనను హీరోగా పెట్టి ‘బాబాయ్ హోటల్’(1992) సినిమా తీశారు. అయితే విడుదలకు ముందు దానికి వస్తున్న క్రేజ్ చూసి ‘ఇది కామెడీ సినిమా కాదు’ అని ట్యాగ్ లైన్ పెట్టాల్సి వచ్చింది. కామెడీ లేకపోతే బ్రహ్మానందం సినిమాకు వెళ్లడం ఎందుకు అని జనం ఆ సినిమా చూళ్లేదు. ఆ తర్వాత బ్రహ్మానందం ఒకటి రెండు సినిమాల్లో హీరోగా నటించినా ఆయనకు మంచి వేషాలు దొరికిన ‘చిత్రం భళారే విచిత్రం’, ‘మనీ’ వంటి సినిమాలతోనే ఎక్కువ పేరొచ్చింది. 2013లో హీరోగా మళ్లీ ‘జఫ్పా’ అనే చిత్రంలో నటించారు. తాజాగా ఆయనతో ‘బ్రహ్మీ ఈజ్ బ్యాక్’ అనే సినిమా తెరకెక్కనుందని ప్రకటన వచ్చింది. శ్రీధర్ శ్రీపాన దర్శకత్వం వహించనున్నారని తెలిసింది. ఇందులో రా (రీసెర్చ్ అండ్ ఎనాలసిస్ వింగ్) ఏజెంట్‌గా బ్రహ్మానందం నటించనున్నారట. అలీ.. అలాగే.. అలీ హీరోగా నటించిన ‘యమలీల’కు (1994) ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఆ తర్వాత ‘పిట్టల దొర’(1994), ‘ఘటోత్కచుడు’ (1995), ‘సర్కస్ సత్తిపండు’ (1997) ‘గుండమ్మ గారి మనవడు’ (2007), ‘అలీబాబా ఒక్కడే దొంగ’ (2013) వంటి సినిమాలు చేశారు. తాజాగా అలీ హీరోగా ‘పండుగాడి ఫోటో స్టూడియో’ సినిమా రూపొందింది. ‘వీడు ఫొటో తీస్తే పెళ్లయిపోద్ది’ అనేది ఉపశీర్షిక. దిలీప్ రాజా దర్శకత్వం. రిషిత హీరోయిన్. నాగదేవత శాపం వల్ల 40 ఏళ్లు దాటినా పెళ్లి కాని వ్యక్తి పాత్రలో హీరోగా అలీ నటించారు. శాపం ఉన్న హీరో ప్రేమలో పడితే అతనికి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? అన్నదే చిత్రకథ. షూటింగ్ పూర్తయింది. జూన్‌లో విడుదల. సప్తగిరి నం.3 ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ సినిమాతో సప్తగిరి కెరీర్ ఎక్స్‌ప్రెస్ వేగాన్ని అందుకుంది. ‘పరుగు’ (2008), ‘ప్రేమకథా చిత్రమ్’ (2013) వంటి సినిమాలు అందుకు ఫౌండేషన్ వేశాయి. ఆ తర్వాత వరుస అవకాశాలను దక్కించుకున్న సప్తగిరి 2016లో ట్రాక్ మార్చారు. హీరోగా ‘సప్తగిరి ఎక్స్‌ప్రెస్’ సినిమా చేశారు. అది రిలీజైన ఏడాదికే ‘సప్తగిరి ఎల్ఎల్బీ’ అనే చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తెచ్చారు. ఇప్పుడు ‘వజ్ర కవచధర గోవింద’ తో మూడోసారి హీరోగా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. అరుణ్ పవార్ దర్శకత్వం. ఓ వజ్రానికి సప్తగిరి ఎలా కవచంలా నిలబడ్డారన్నదే కథ. యాక్షన్, ఫైట్లు కూడా చేస్తున్న సప్తగిరిని ఈ సినిమాలో చూడవచ్చు. షకలక లకలక టీవీ నుంచి సినిమాకి సినిమా నుంచి హీరో కుర్చీకి ఎదగడానికి ఒళ్లొంచి కష్టం చేస్తున్న నటుడు శంకర్. ‘రాజుగారి గది 2’, ‘ఆనందోబ్రహ్మ’ (2017) సినిమాలు శంకర్‌కు హాస్యనటుడిగా మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి. దాంతో గత ఏడాది ‘శంభో శంకర’ సినిమాతో హీరోగా మారారు. ఆ తర్వాత హీరోగా ‘డ్రైవర్ రాముడు’ సినిమా చేశారు. రాజ్ సత్య దర్శకత్వం వహించిన ఈ సినిమా రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఇటీవలే హీరోగా తన మూడో చిత్రాన్ని కూడా సెట్స్‌పైకి తీసుకెళ్లారు శంకర్. ‘నాలుగో సింహం’ టైటిల్‌తో జానీ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో పవర్ఫుల్ పోలీసాఫీసర్‌గా నటిస్తున్నారు ‘షకలక’ శంకర్. ముంబై బ్యూటీ అక్షయ శెట్టి హీరోయిన్గా నటిస్తున్నారు. సినిమాల్లో కమెడియన్‌గా అవకాశాలు తగ్గడం వల్లనే తాను హీరోగా మారాల్సి వచ్చిందని ఓ సందర్భంలో శంకర్ పేర్కొనడం విశేషం. ప్రియ మల్లేశం ‘నా సావు నేను సస్తా... నీ కెందుకు’ బుక్ రైటర్ గుర్తున్నాడుగా! ‘పెళ్ళిచూపులు’ (2016)సినిమాలో ఫుల్‌గా నవ్వించిన కమెడియన్ ప్రియదర్శి ఆ తర్వాత చాలా సినిమాల్లో కమెడియన్‌గా చేశారు. ఇప్పుడు ‘మల్లేశం’ అనే బయోపిక్‌లో హీరోగా నటిస్తున్నారు. నేతకు పనికి వచ్చే ఆసు మిషన్‌ను కనుగొని పద్మశ్రీ పురస్కారం పొందిన చింతకింది మల్లేశం జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. తెలంగాణ యాస ప్రియదర్శికి కొట్టిన పిండి. కనుక ఈ సినిమాలో ఆయన ఆకట్టుకుంటారని ఆశించవచ్చు. చేదు మిఠాయి ‘అర్జున్‌రెడ్డి’ సినిమాలో విజయ్ దేవరకొండ స్నేహితుడిగా నటించి ఒక్కసారిగా టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యారు రాహుల్ రామకృష్ణ. ఈ క్యారెక్టర్లో అటు కామెడీ చేస్తూనే సీరియస్ డైలాగ్స్ కూడా చెప్పారు. మహేశ్‌బాబు ‘భరత్ అనే నేను’ సినిమాలో మరో ముఖ్యపాత్ర దక్కింది. ఆ నెక్ట్స్ ‘సమ్మోహనం’(2018), ‘గీత గోవిందం’(2018) సినిమాల్లో మార్కులు పడ్డాయి. దాంతో డార్క్ కామెడీ ఫిల్మ్ ‘మిఠాయి’లో హీరోగా నటించారు రాహుల్ రామకృష్ణ. ఇందులో కమెడియన్ ప్రియదర్శి మరో లీడ్ క్యారెక్టర్ చేశారు. కానీ ఈ ‘మిఠాయి’ ప్రేక్షకులకు రుచించలేదు. అయితే రాహుల్ రామకృష్ణ ముఖ్యపాత్ర పోషించిన ‘హుషారు’ ప్రేక్షకులకు నచ్చింది. హాలీవుడ్ సినిమా ‘సిల్క్‌రోడ్’లో రాహుల్ ఒక కీలక పాత్రకు సెలక్ట్ కావడం కూడా ఒక మంచి వార్తే. ఇన్పుట్స్: ముసిమి శివాంజనేయులు మళ్లీ హీరోగా...! సునీల్ ‘అందాలరాముడు’ (2006) సినిమాతో హీరోగా మారారు. ఆ సినిమా హిట్. రాజమౌళి దర్శకత్వంలో నటించిన ‘మర్యాదరామన్న’ సూపర్‌హిట్ సాధించింది. ఆ తర్వాత ‘పూలరంగడు’ (2012) కమర్షియల్‌గా సక్సెస్ కొట్టింది. నాగచైతన్యతో కలిసి ‘తడాఖా’లో లీడ్ రోల్ చేశారు. కమెడియన్‌గా ఏడాదిలో అరడజనుకు పైగా సినిమాలు చేసిన సునీల్ హీరో అయ్యాక ఏడాదికి ఒక సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. వీటిలో కొన్ని సినిమాలు ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి. దీంతో సునీల్ హీరోగా జర్నీకి కామా పెట్టినట్లున్నారు. ప్రస్తుతం కమెడియన్‌గా ఫుల్ బిజీ అయ్యారు. కానీ ఆయనను హీరోగా పెట్టి సినిమా తీయడానికి ఒకటి రెండు ప్రయత్నాలు జరుగుతున్నాయని వినికిడి. హీరోనే టార్గెట్‌నా? ‘వెంకీ’,‘ పోకిరి’, ‘ఢీ’, ‘బిందాస్’ వంటి సినిమాల్లో బాల హాస్యనటుడిగా భరత్ మంచి పేరు సంపాదించుకున్నాడు. ఆడియన్స్ మాస్టర్ భరత్ అని పిలుచుకున్నారు. సునీల్ హీరోగా నటించిన ‘ఈడు గోల్డ్ ఎహే’ (2017)సినిమాలో హాస్యనటుడిగా కనిపించిన భరత్ రీసెంట్గా ‘ఏబీసీడీ’ సినిమాతో క్యారెక్టర్ ఆర్టిస్టుగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. చైల్డ్ కమెడియన్‌గా సక్సెస్ అయిన భరత్ క్యారెక్టర్ ఆర్టిస్టుగా సక్సెస్ అవుతాడా? లేక భవిష్యత్‌లో హీరోగా కూడా చేసే ఆలోచనలు ఏమైనా ఉన్నాయా? అన్నది చూడాలి. -
చిరు చిత్రంలో నటించడం అదృష్టం
మిమిక్రీ లో మూడు బంగారు పతకాలు సాధించా బొబ్బిలి: నవ్వించగలిగే నైపుణ్యముండే ప్రతి ఒక్కరినీ చిత్ర పరిశ్రమ గుర్తిస్తుందని ప్రముఖ హస్య నటుడు అద్దంకి శేషుకుమార్ ( షేకింగు శేషు) అన్నారు. బొబ్బిలిలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.. 20 ఏళ్లుగా తాను మిమిక్రీ, వెంట్రి లాక్విజం చేశానన్నారు. రాజమండ్రిలో రాజ్యలక్ష్మి కళాసమితి ఆధ్వర్యంలో ఏటా నిర్వహించే అఖిల భారత స్థాయి మిమిక్రీ పోటీల్లో తనకు వరుసగా మూడేళ్లు బంగారు పతకాలు వచ్చాయని చెప్పారు.మిమిక్రీలో ఎవరికీ గురువు ఉండరని, ఏకలవ్య విద్యేనన్నారు. తాను మిమిక్రీలో 2500 ప్రదర్శనలు ఇచ్చానన్నారు. ఇప్పటివరకూ సినిమా చూపిస్తామామ, కుమారి 21ఎఫ్, సుప్రీం, సెల్ఫీరాజా, బాబు బంగారం, లక్ష్మీ రావే మా ఇంటికి సినిమాల్లో నటించానని చెప్పారు. ఇంకా 8 సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయన్నారు. ప్రస్తుతం వైశాఖం, హైపర్, మిస్టర్ సినిమాల్లో నటిస్తున్నానని చెప్పారు. మంచి కమెడియన్‌గా గుర్తింపు తెచ్చుకోవాలి బొబ్బిలి: సినీ పరిశ్రమలో మంచి కమెడియన్‌గా నిలదొక్కుకొని గుర్తింపు తెచ్చుకోవాలన్నదే లక్ష్యమని హాస్యనటుడు రాకెట్ రాఘవన్నారు.. ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన సందర్భంగా బుధవారం ఇక్కడి విలేకరులతో మాట్లాడారు. పూర్వనటులు అల్లు రామలింగయ్య, రేలంగి, బ్రహ్మానందంలు ప్రజలకు ఎలా గుర్తుండి పోయారో ఆ విధంగా హాస్యనటుడిగా మిగిలిపోవాలన్నదే తన ఆశయమని చెప్పారు. తాను మొదట్లో ఆలిండియా రేడియాలో పనిచేశానని చెప్పారు. సండే సినిమా ద్వారా చలనచిత్రానికి పరిచయమయ్యానన్నారు. ఇప్పటివరకూ 150 సినిమాలు వరకూ చేశానని, బాద్షా, డార్లింగ్, అత్తారింటికి దారేది, కందిరీగ వంటి పెద్ద సినిమాల ద్వారా తనకు గుర్తింపు వచ్చిందన్నారు. కళాశాల రోజుల్లో తాను మిమిక్రీ ఆర్టిస్టుగా చేశానన్నారు. సీనియర్ కళాకారుల సలహాలు తీసకొని నటనను మరింత మెరుగు పరుచుకుంటానని చెప్పారు. చిరు చిత్రంలో నటించడం ధన్యం బొబ్బిలి: తాను ఏ హీరోకైతే అభిమానిగా ఉన్నానో, ఆయన 150వ సినిమాలో నటించే అవకాశం రావడం తన అదృష్టమని నటుడు బొడ్డపల్లి శ్రీను ( గెటప్ శ్రీను) అన్నారు.. చిరంజీవి 150వ సినిమా అయిన ఖైదీ నెంబరు 150లో కోల్కత్తా పోలీసుగా నటించే అవకాశం వచ్చిందన్నారు.. బొబ్బిలిలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తాను నటించే హాస్య సన్నివేశాలను చిరంజీవి సతీమణి సురేఖ చూసి, వాటిని చిరంజీవికి చూపించారని చెప్పారు. తన నటన బాగుందని చిరంజీవి మెచ్చుకోవడం తన లైఫ్ టైం అచీవ్మెంట్ వచ్చినంత ఆనందంగా ఉందన్నారు. శ్రీకాకుళం జిల్లా హరిశ్చంద్రపురంలో తాతలు ఉండేవారని, వ్యవసాయం కోసం తండ్రితో పాటు భీమవరం వద్ద ఆకివీడు వెళ్లిపోయామన్నారు. తాను ఇంటర్ వరకూ ఆకివీడులో చదివి, హైదరాబాద్‌లో బీఏ చదవడానికి వెళ్లానన్నారు. అయిదో తరగతి నుంచి నటుడిగా చిన్న చిన్న వేషాలు వేసేవాడినన్నారు. తెలుగబ్బాయ్, మనసడిగాక, ప్రేమ నిజం సినిమాలకు అసిస్టెంటు డెరైక్టరుగా చేశానని చెప్పారు. అక్కడ కొంత మంది స్నేహితులు నటన వైపు వెళ్లాలని సూచించడంతో సినిమా రంగం వైపు వచ్చానన్నారు. చుట్టాలబ్బాయ్, తుంగభద్ర వంటి సినిమాల్లో నటించానని చెప్పారు. బొబ్బిలి గురించి సినిమాల్లో చూడడం తప్ప ఇప్పటివరకూ చూడలేదని, ఇప్పుడు ఇక్కడకు రావడం, చూడడం ఆనందంగా ఉందన్నారు.. -
నవ్వుత్సాహంగా.. నవ్వుల్లాసంగా...
International JOKES DAY 1st July నవ్వితే హ్యాపీ...నవ్వకపోతే బీపీ...నవ్వనివాడు పాపి..!...నవ్వడం తేలికే కానీ.. నవ్వు పుట్టించడం అంత తేలిక కాదు. దానికి నైపుణ్యం ఉండాలి. హాస్యం అనేది అణువణువునా నిండి ఉండాలి. అలాంటివారే అందరినీ నవ్వించగలరు. విభిన్నమైన లుక్‌తో, వైవిధ్యభరితమైన హావభావాలతో కడుపుబ్బ నవ్వించే మన విశాఖలో కమెడియన్స్ ఎందరో ఉన్నారు. నవ్వునే వృత్తి, ప్రవృత్తిగా తీసుకొని హాస్యగుళికల్ని అందిస్తున్నారు. ఉత్తరాంధ్రకు చెందిన పలువురు నటులు వెండితెరపై నవ్వులు కురిపిస్తూ తమ ప్రత్యేకతను చాటుకున్నారు. కొందరు మనమధ్యలేకపోయినా వారి పాత్రలు హాస్యం ఉన్నంతవరకూ బతికే ఉంటాయి. అయితే..ఓకే.. - కొండవలస ఉత్తరాంధ్ర మాండలికంతో తనదైన యాసతో సినీ లోకాన్ని నవ్వించారు హాస్యనటుడు కొండవలస లక్ష్మణరావు. మనలో లేకపోయినా ఆయన కామెడీ డైలాగులు నేటికి కడుపుబ్బా నవ్విస్తున్నాయి. వెయ్యి నాటకాల్లో నటించి, రెండు రంగస్థల నందీ అవార్డులను తీసుకున్న కొండవలస ‘ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు’చిత్రంతో పొట్రాజు పాత్రలో కొండవలస నటన ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. నేనొప్పుకోను..ఐతే ఒకే..అనే ఊత పదంతో తెరంగేట్రం చేసి నవ్వుల్ని పంచుతూ స్టార్ కామెడియన్‌గా మారిపోయాడు. ‘ఇండియన్ గ్యాస్’ అనే నాటకంలో తన శ్రీకాకుళం మాండలికంలో డైలాగులు పలికారు. ఆ విధానం అప్పట్లో అందరికీ నచ్చింది. అదే తీరును ఆయన సినిమాలో తన పాత్రలకు అన్వయించి ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించారు. భౌతికంగా ఆయన లేకపోయినా, కొండవలస చేసిన పాత్రలు హాస్యం ఉన్నంతవరకూ బతికే ఉంటాయి. ప్రేక్షకుల ‘వేలు’ విడవని నటుడు ఒక పాత్ర ఒక మేనరిజమ్ ద్వారా ఒక నటుడి పేరే మారిపోవడం, చరిత్రలో ఆ పేరుతోనే మిగిలిపోవడం చాలా చిత్రమైన విషయం. సినీ చరిత్రలో అలాంటి అదృష్టం దక్కిన అరుదైన కొందరు నటుల్లో సుత్తివేలు ఒకరు. కురుమద్దాలి లక్ష్మీ నరసింహరావు అనే అసలు పేరుతో ఆయన తెలిసింది చాలా కొద్దిమందికే. ‘వేలెండంత లేవు? ఏమిటీ అల్లరి? అంటూ చిన్నప్పుడు చుట్టుపక్కలవాళ్లు పేలవడంతో‘వేలు’అనే ముద్దుపేరుతోనే ప్రసిద్ధుడైన బక్కపల్చటి మనిషి ఆయన. ఆకారానికి అంగికాభినయ ప్రతిభతోడై, దర్శక రచయిత జంధ్యాల విశాఖలో రూపొందించిన ‘నాలుగు స్తంభాలాట’చిత్రంలోని పాపులర్ ఊతపదం ‘సుత్తి’తో ఆయన క్రమంగా ‘సుత్తి’వేలుగా జనంలో స్థిరపడ్డారు. తోటి నటుడు ‘సుత్తి’వీరభద్రరావుతో కలసి సుత్తి జంటగా 1980-90లలో సినీసీమను కొన్నేళ్ల ఏలారు. కృష్ణాజిల్లా చల్లపల్లి దగ్గరలోని భోగిరెడ్డిపల్లెలో పుట్టిన సుత్తివేలు ఉద్యోగ రీత్యా విశాఖలో ఉద్యోగం చేస్తూ ఇక్కడే స్థిరపడ్డారు. చిన్నతనమంతా మచిలీపట్నంలో గడిచినా ఆయన నాటకాల దెబ్బకు చదువు అటకెక్కి, ఎలాగోలా మెట్రిక్ అయిందనిపించి విశాఖపట్నం నావల్ డాక్‌యార్డ్‌లో స్టోర్‌కీపర్‌గా తేలారు. ‘మనిషి నూతిలో పడితే’నాటకంలోని అభినయ ప్రతిభ దర్శకుడు జంధ్యాల ద్వారా తొలి సినీ అవకాశమూ ఇప్పించింది. అలా తొలినాళ్లలో విశాఖలో చిత్రీకరించిన ‘ముద్దమందారం’గా మొదలైన ప్రస్థానం ‘నాలుగు స్తంభాలాట’నాటి ‘సుత్తివేలు’ జోరందుకుంది. నాలుగు స్తంభాలాట,ప్రతిఘటన, వందేమాతరం, ఈ పిల్లకు పెళ్లవుతుందా? ఈ చదువులు మాకొద్దు., ఒసేయ్ రాములమ్మలో రాములమ్మ తండ్రి పాత్రగా ఇలా క్యారెక్టర్ నటుడిగా ఆయనలోని వైవిధ్యభరితమైన పాత్రలు పొషించారు. రెండు జళ్ల సీత, శ్రీవారికి ప్రేమలేఖ, ఆనందభైరవి, రెండురెళ్లు ఆరు, సీతారామ కల్యాణం, చంటబ్బాయ్ లాంటి సినిమాలు చూస్తే తెలుగుతెరను ఆయన నవ్వులతో ముంచెత్తిన సీన్లే కనిపిస్తాయి. నవ్వులరేడు...చిదంబరం... తెరపై అతని ఆహార్యం చూస్తే చాలు పొట్ట చెక్కలవుతోంది. ఆయన స్వరం వింటే చాలు ప్రేక్షకుని ముఖం నవ్వు పులుముకుంటుంది. వెండితెరపై చేసేది చిన్నపాత్రయినా..వాస్తవాల్ని ప్రతిబింబించే సంఘటనలు. అందుకే ఆయన హాస్యగుళికలు తెలుగు తెరపై ఓలలాడించారు. ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్రవేసుకున్నారు. ఇంతటి ఘనకీర్తిని సొంతం చేసుకున్న ప్రముఖ హాస్యనటుడు కళ్లు (కల్లూరి)చిదంబరం నగరానికి చెందిన ప్రముఖ రంగస్థల,సినీ హాస్యనటుడు కావడం విశేషం. 300 చిత్రాల్లో నటించారు. ఆ ఒక్కటీ అడక్కు, ఏప్రిల్ ఒకటి విడుదల, కళ్లు, అమ్మోరు, మనీ, గోవిందా గోవిందా, పవిత్ర బంధం, అనగనగా ఒకరోజు వంటి చిత్రాల్లో నటించి పేరు తెచ్చుకున్నారు. ఆయన పేరు కొల్లూరు చిదంబరం. మొట్టమొదట ప్రసిద్ధి దర్శకుడు సత్యానంద్, మిశ్రో తదితరుల బృందాలతో నాటకాలు వేసేవారు. తనకు తెలిసిన హాస్యరసంతో సినీ ప్రేక్షకులను రంజింప చేశారు. తెరపై కనిపించగానే ఆయన్ని ఎలాంటి వారైనా గుర్తుపట్టేస్తారు. దానికి ఆయన రూపం స్వరం కారణం. ‘షర్టు మీద టీ పడితే?’..టీ-షర్ట్ అవుతుంది : నాన్‌స్టాప్ కామెడీ కింగ్ రంగారావు లిమ్కా రికార్డుల్లో సరికొత్త అధ్యాయాన్ని లిఖించిన నగరానికి చెందిన ప్రముఖ లాఫర్స్ ఫన్‌క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షుడు కోరుకొండ రంగారావు ఒక్క నిమిషంలో 37 నవ్వులు పండించిన ప్రతిభావంతుడు. మచ్చుకు కొన్ని..‘మీ హోటల్లో వేడిగా ఏమున్నాయ్..’?/ బొగ్గులు, సబ్బులెన్నునా..?/నురుగొక్కటే,‘ నీకు ఏ పుస్తకం ఇష్టం..’/ చెక్పుస్తకం, ‘ఏ జూలోను కనబడని జంతువు’/అడ్డగాడిద...ఇలా నాన్‌స్టాప్ జోక్స్‌తో ప్రేక్షకుల్ని కడుబ్బా నవ్విస్తూ అత్యధిక జోకులు చెప్పి లిమ్కా రికార్డులో కొత్త రికార్డు సృష్టించారు. పది గంటలు ఏకబిగిన సుమారు 40 వైవిధ్యమైన పాత్రలకు ప్రాణప్రతిష్ట చేస్తూ రంగారావు చేసిన నవరసావిష్కారం కట్టిపడేస్తోంది. ఏవర్గాన్నీ నొప్పించని, క్లుప్తమైన కొంటె ప్రశ్న, చిలిపి సమాధానం తరహాలో బుల్లెట్ ట్రైన్ వేగంతో ఒక నిమిషం జోకుల పర్వం దూసుకెళ్లే సామర్థ్యం గల రంగారావు జోకులతో నవ్వులు కురిపిస్తారు. ‘0’ పెడితే ఎంత? అనే ప్రశ్నకు గణిత పరిజ్ఞానంలో 100 అనే బదులు తెలుగు భాషా చమత్కారంతో ‘పంది’ అని చెప్పగానే ఆడిటోరియంలో నవ్వులు విరివక తప్పదు. ఆతర్వాత వరుసగా వంకాయలు ఎలా ఇచ్చావ్? తూచి/ రావణాసురుడు సింగరైతే? కోరస్ అవసరం లేదు/ వాడేంట్రా నవ్వట్లేదు? వాడికి పెళ్లయిందిలే/ నా నవల్లో నీకు నచ్చింది? శుభం/ షర్టుమీద టీ పడితే? టీ-షర్ట్ అవుతుంది వంటి జోకులు డజన్లకొద్దీ నవ్విస్తాయి. కొద్ది సేపు అతిథుల స్పందనల తర్వాత హాస్యమే కాదు నవరసావిష్కారంలోనూ రంగారావు నైపుణ్యాలు ప్రేక్షకుల మెప్పు పొందుతున్నారు. తికమకపెట్టే క్లయింట్‌తో లాయర్ పడే తిప్పలు ఏకపాత్రాభినయంతో నవరసావిష్కారాలతో శ్రోతులను మంత్రముగ్దుల్ని చేసే శైలి రంగారావుది. హాస్యనిధి-నవ్వుల వారధి 2012లో ప్రముఖ హాస్యరచయిత, నటుడు కాశీ విశ్వనాథ్, కళ్లు చిదంబరంతో ఫ్రెండ్స్ కామెడీ క్లమ్ ప్రారంభించాం. ప్రతినెల మొదటి ఆదివారం హరివిల్లు, వినోదాల విందు పేరిట విశాఖ పౌరగ్రంథాలయంలో ప్రదర్శనలు ఇస్తుంటాం. ప్రతినెల ఒక హాస్య కళాకారుని సన్మానిస్తాం. ఇప్పటి వరకు రెండు వందలకుపైగా ప్రదర్శినిలిచ్చాం. మా క్లబ్ ద్వారా ఏ కళాకారుడికైనా ప్లాట్ఫార్మ ఇస్తుంది. ఔత్సాహిక కళాకారులకు వేదిక కావాలనే మా ఉద్దేశ్యం. క్లబ్లో ఇప్పటి వరకు మూడువందల వరకు సభ్యులుగా చేరారు. మా ఆశయం ప్రేక్షకులు వచ్చి జోక్సు చెప్పి మమ్మల్ని నవ్వించాలన్నదే. హైజాక్, చినుకు, మేస్త్రి, శ్రీశైలం, శుభప్రదం వంటి చిత్రాల్లో నటించాను. హాయిగా ఉన్నప్పుడు నవ్వేవాడు సామాన్యుడు, హాయిగా లేనిప్పుడు నవ్వేవాడు అసామాన్యుడు, హాయిగా లేని వారిని నవ్వించేవాడు మాన్యుడు. ఇది మా క్లబ్ స్లోగన్. ఇప్పటి వరకు హాస్యబ్రహ్మ, నవ్వుల రాజు, ఆణిముత్యం, స్నేహబంధు వంటి అవార్డులు పొందాను. - ఎం.వి.సుబ్రహ్మణ్యం, ఆంధ్రాబ్యాంక్ మేనేజర్ ఫ్రెండ్స్ కామెడీ క్లబ్ వ్యవస్థాపకుడు. మంచి ఆటగాడు ‘మంచి ఆటగాడు అని చెపితే ఏ పెద్ద ప్లేయరో అనుకుని పెళ్లి చేసుకున్నా.. తీరా చేసుకున్న తరువాత తెలిసింది’’ విచారంగా అంది సుమలత. ‘ఏమైంది? మరి ?? ఆటగాడు కాదా అతడు’ అడిగింది శ్రీదేవి. ‘ఆటగాడే..తోలుబొమ్మల్ని ఆడిస్తుంటాడట పల్లెటూర్లలో...’ -ఏడ్చింది సుమలత. హల్లో ...ఎఫ్....ఎం... రేడియో అండీ... అవునండీ.. ఎంవీపీలో పర్సు, పర్సులో రూ.15వేలు దొరికాయి. అప్పలరాజు, వాల్తేర్ అని అడ్రస్రాసి ఉంది.. మీ నిజాయతీకి సంతోషం...ఇప్పుడు మమ్మల్ని ఏమి చేయమంటారు? అప్పలరాజు కోసం ఓ విషాద గీతం వేస్తారేమోనని... ఆ..ఆ.. ఒక భర్త తన భార్యకు ఇలా ఎస్ఎంఎస్ చేశాడు నా జీవితాన్ని అద్భుతంగా తీర్చిదిద్దినందుకు, నా జీవితంలో ఒక భాగమైనందుకు నీకు కృతజ్ఞతలు. ఇప్పుడు నేనీస్థితిలో ఉన్నానంటే దానికి నువ్వే కారణం. నువ్వే నా దేవతవి. నా జీవితంలోకి వచ్చినందుకు చాలా థాంక్స్. నువ్వు చాలా మంచిదానివి. భర్త పంపిన ఎస్ఎంఎస్ చదివి భార్య ఇలా రిప్లై ఇచ్చింది తాగడం అయిందా, ఇంక ఎస్ఎంఎస్లు ఆపు, ఇంటికి రా..భయపడకు..నిన్నేమీ అనను. ఇది చదివిన భర్త : థాంక్స్, నేను ఇంటి బయటే ఉన్నా. దయచేసి తలుపు తియ్.! హెదరాబాద్- విశాఖపట్నం.. బస్ ఎక్కిన బామ్మ డ్రైవర్‌తో ఇలా అంది.. బాబు విజయవాడ రాగానే చెప్పు... నేను మర్చి పోతాను అని. డ్రైవర్ సరేనంటాడు.. కాని డ్రైవర్ మర్చిపోయి విజయవాడ దాటేసి వంద కిలో మీటర్లు వెళ్లిపోతాడు మధ్యలో నిద్ర లేచిన బామ్మ...పక్కనున్న వ్యక్తిని అడుగుతుంది.. విజయవాడ దాటిందనగానే లబోదిబోమని ఏడుపందుకుంటుంది... దీనితో ప్రయాణికులంతా గొడవ చేయడంతో మళ్లీ వెనక్కు వెళ్లి విజయవాడలో దింపేస్తాడు... బస్ దిగిన బామ్మ మాత్ర వేసుకుని నీళ్లు తాగి మళ్లీ బస్ ఎక్కుతుంది.... ఇప్పుడు పోనీ బాబు అని అనగానే అందరూ ఆశ్చర్యపోతారు.... ఏం లేదండీ నేనూ వైజాగ్ వెళ్లాలి..అయితే నా కొడుకు విజయవాడలో మాత్ర వేసుకోమని చెప్పాడు అందుకని... -అక్కయ్యపాలెం, పెదగంట్యాడ నవ్వు ఒక టానిక్.... సీతంపేట: ప్రముఖ హాస్య నటుడు , రచయిత,దర్శకుడు రావి కొండలరావు ఆలోచన నుంచి పుట్టింది విశాఖహ్యూమర్ క్లబ్. 2000 సంవత్సరంలో సంస్థను ప్రారంభించారు. మనిషి తన దైనందిన జీవితంలో అనేక ఒడి దుడుకులు తట్టుకొని నిలదొక్కుకోలేని పరిస్థితుల్లో హాస్యం ఉపశమనాన్ని కల్గిస్తుందన్న ఆశతో సంస్థను స్థాపించాం. మూడేళ్లు దిగ్విజయంగా నడిపిన తర్వాత , 2003లో తన అన్నకొడుకు రావి గోపి కృష్ణను అధ్యక్షుడిగా నియమించి క్లబ్ బాధ్యతలు అప్పగించి కొండలరావు హైదరాబాదు వెళ్లిపోయారు. ఆనాటి నుంచి విశాఖ హ్యూమర్ క్లబ్ 1292 కార్యక్రమాలు దేశ విదేశాలు, వివిధ రాష్ట్రాలలో ప్రదర్శనలు ఇచ్చారు. ప్రతి నెలా రెండవ ఆదివారం సాయంత్రం 6 గంటలకు ద్వారకానగర్ పౌరగ్రంథాలయంలో కామెడీషో నిర్వహిస్తున్నాము. మా క్లబ్‌కు ప్రేక్షకుల నుంచి వచ్చిన విశేష ఆదరణతో విశాఖలో నేటికి తొమ్మిది కామెడీ క్లబ్‌లు ప్రారంభమయ్యాయి. చాలా సంతోషంగా ఉంది. హ్యూమర్ క్లబ్‌కు వస్తున్న ఎనలేని ఆదరణకు జీవితాంతం రుణపడి ఉంటాను. - రావి గోపీ కృష్ణ, అధ్యక్షుడు , విశాఖ హ్యూమర్ క్లబ్ పేర్లెందుకు లేవు మమ్మీ! కోడి పిల్లలు : మమ్మీ..! మనుషులంతా పుట్టగానే పేర్లు పెట్టుకుంటారు. మరి మనమెందుకు పెట్టుకోం? కోడి : మనకు చనిపోయాక పెడ్తారమ్మా..చికెన్ 65, చికెన్ పకోడి, చిల్లీ చికెన్..అని తొక్కతో లక్కు... ఎన్ఏడీ జంక్షన్ : అన్న కూతురింటికి బాబాయి అప్పారావు వచ్చాడు... కొత్తగా కట్టిన ఇళ్లు...బాగుందే అంటూ ఇంట్లోకి ప్రవేశించాడు... గుమ్మంలోనే చూసి బాబాయ్ బాగున్నారా...అంటూ ఆప్యాయంగా పలకరించింది కనకమహాలక్ష్మి. కుశల ప్రశ్నల తరువాత ఉత్సాహంగా ఇల్లాంతా చూపిస్తోంది. ఇది బెడ్రూములు...డ్రాయింగ్ రూము...కిచెన్ అన్నీ ఒక్కొక్కటి వర్ణిస్తూ చూపించింది. చివరిగా దేవుని గది చూపించింది. దేవుళ్ల ఫొటోలు చక్కగా అలంకరించింది. మధ్యలో అరటి పండు తొక్క ఫొటోకు ఫ్రేమ్ కట్టి పూజలు చేసి ఉంది. దీన్ని చూసి ఆశ్చర్యపోయాడు అప్పారావు. ఇదేంటమ్మ అరటిపండు తొక్క ఫొటోకు దేవుళ్ల దగ్గరపెట్టి పూజలు చేశావు అంటూ సందేహంగా అడిగాడు. నాకు ఈ తొక్కతోనే కదా బాబాయ్ లక్కొచ్చింది. ఉబ్బితబ్బిబవుతూ చెప్పింది. అప్పారావు ముఖంలో మళ్లీ క్వశ్చన్ మార్క్ వచ్చిపడింది...? ఇక ఈ ముఖాన్ని చూడలేక అసలు విషయాన్ని బయటపెట్టింది. రెండేళ్ల క్రితం మా అత్త ఈ తొక్కమీదే అడుగేసి పడిపోయి బకేట్ తన్నేసింది. ఆ తరువాత బీరువా తాళాలు నాచేతికి వచ్చాయి బాబాయ్ అని చెప్పింది. ఇదీ తొక్కతో వచ్చిన లక్కు... హాస్యప్రియ కామెడీ క్లబ్... ఇలాంటి పంచ్‌లు ఎన్నో ఈ క్లబ్లో కడుపుబ్బా నవ్విస్తాయి. బుచ్చిరాజుపాలెంలో 2012లో ఏర్పాటు చేసిన హాస్యప్రియ కామెడీ క్లబ్ నిర్వహిస్తున్న హాస్యామృతం కార్యక్రమంలో నవ్వుల విందునందిస్తోంది. నేటికి మూడున్నరేళ్ల పూర్తి చేసుకుంది. నెలలో నాల్గవ వారంలో అమర్ పాఠశాలలో సాయంత్రం 6గంటలనుంచి స్కిట్స్ ప్రారంభమవుతాయి. వీరితో పసాటు ఇంతవరకు 223 మంది నూతన కళాకారులకు ఈ వేదిక ద్వారా పరిచయం చేశారు. ఈ క్లబ్ వ్యావస్థాపక కార్యదర్శి ఇమంది ఈశ్వరరావు, సంయుక్త కార్యదర్శి పికె దుర్గాప్రసాద్, ఉపాధ్యక్షడు బుగతా సత్యనారాయణ ప్రభుత్వ ఉద్యోగులే కావడం విశేషం. అధ్యక్షుడు నక్కాలక్ష్మణరావు మాత్రం కాంట్రాక్టర్. ఇప్పటి వరకు ఎక్కువమంది హాస్యప్రియులను సంపాదించిన అతి పెద్ద క్లబ్ ఇదే. -
తెరపై వినోదాల విందు... ఎక్స్‌ప్రెస్ రాజా
2016 సంక్రాంతి బరిలో నాలుగు చిత్రాలు విడుదలకు సిద్ధమయ్యాయి. వాటిలో ఎంటర్టైన్మెంట్ అనగానే గుర్తొచ్చే చిత్రం ‘ఎక్స్‌ప్రెస్ రాజా’. ఈ చిత్రంలో చాలామంది కమెడియన్స్ ఉన్నారు. సినిమా అంటే ఎంటర్టైన్మెంట్... ఎంటర్టైన్మెంట్... ఎంటర్టైన్మెంట్ అని ఏ ముహూర్తాన అన్నారో కానీ, గత దశాబ్ద కాలంగా ఎంటర్టైన్మెంట్ ఉన్న చిత్రాలు మినిమమ్ గ్యారంటీతో సూపర్‌డూపర్ హిట్స్ అవుతున్నాయి. అగ్ర హీరోలు సైతం ఎంటర్టైన్మెంట్నే నమ్ముకోవడం విశేషం. ఇది ఇలా ఉండగా ఇటీవల విడుదలైన ఏ చిత్రాన్ని తీసుకున్నా అన్నీ ఎంటర్టైన్మెంట్కి పెద్దపీట వేసినవే. 2016 సంక్రాంతి బరిలో నాలుగు చిత్రాలు విడుదలకు సిద్ధమయ్యాయి. అయితే వాటిలో ఎంటర్టైన్మెంట్ అనగానే గుర్తొచ్చే చిత్రం ‘ఎక్స్‌ప్రెస్ రాజా’. ఈ చిత్రంలో చాలామంది కమెడియన్స్ ఉన్నారు. దానికి తోడు యువి క్రియేషన్స్ సంస్థ తమ చిత్రాల్లో తప్పనిసరిగా వినోదం ఉండేలా చూసుకుంటుంది. గతంలో ఈ నిర్మాణ సంస్థ నుంచి వచ్చిన ‘మిర్చి’, ‘రన్ రాజా రన్’, ‘భలే భలే మగాడివోయ్’ చిత్రాలు తెలుగు ప్రేక్షకుల ఆదరాభిమానాలు పొందాయి. ఇప్పుడు ఆ బ్యానర్ నుంచి వస్తున్న చిత్రం ‘ఎక్స్‌ప్రెస్ రాజా’ ఈ నెల 14న విడుదలవుతున్న సందర్భంలో ప్రమోషన్ కూడా తారస్థాయిలో చేస్తున్నారు. ప్రమోషన్స్‌లో భాగంగా ఈ చిత్రం కౌంట్ డౌన్స్ విడుదల చేస్తున్నారు. ఇటీవల అందరి ప్రశంసలూ అందుకుంటున్న ప్రముఖ హాస్యనటులు ఈ చిత్రంలో నటించారు. ఇందులో ప్రభాస్ శ్రీను - మావయ్య శ్రీనుగా నటిస్తున్నారు. మొట్ట మొదటిసారి హీరోతో సమానంగా నవ్వులు కురిపించే పాత్రలో నటిస్తున్నారు. వైజాగ్‌లో పనీపాటా లేనివారి జాబితాలో రెండవ స్థానం దక్కించుకుని మొదటి స్థానం కోసం గొడవ పడే చక్కటి పాత్రలో ఆయన నటించారు. ప్రభాస్ శ్రీను కెరీర్లోనే ఈ పాత్ర నిలిచిపోయేలా ఉంటుంది. ధన్‌రాజ్ ‘ఇనుము’ అనే పాత్రలో నటిస్తున్నారు. ధన్‌రాజ్ పాత్ర చిత్రానికి హైలైట్‌గా నిలుస్తుంది. నవ్వించటంతో పాటూ ప్రాముఖ్యత ఉన్న పాత్రలో నటిస్తున్నారు. అలాగే ఈ మధ్య అందరి ప్రశంసలు అందుకుంటున్న బ్రహ్మాజీ ‘బిల్‌గేట్స్’ పాత్రలో, ‘షకలక’ శంకర్ ‘బీభత్స నటరాజ్’ పాత్రలో డ్రామా ఆర్టిస్ట్‌గా నటించారు. ‘షకలక’ శంకర్ ఇందులో మెగాస్టార్ చిరంజీవిని ఇమిటేట్ చేస్తూ చేసిన గెటప్ సోషల్ మీడియాలో పెద్ద సంచలనంగా మారింది. ఈ చిత్ర దర్శకుడు మేర్లపాక గాంధీ మొదటి చిత్రం ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’తో కమెడియన్‌గా స్థిరపడిన సప్తగిరి ఈ చిత్రంలో ‘పొల్యూషన్ గిరి’గా మరొక్కసారి తన విశ్వరూపం చూపించారు. సప్తగిరి నటన ప్రేక్షకుల్ని కడుపుబ్బ నవ్వించే విధంగా ఉంటుందని దర్శకుడు తెలిపారు. ఇలా కథతో పాటూ కథనంతో పాటూ ఎంటర్టైన్మెంట్ని నమ్మి నిర్మించిన చిత్రం ‘ఎక్స్‌ప్రెస్ రాజా’. ఫ్యామిలీతో సినిమాకి వెళ్లాలంటే చక్కటి వినోదం ఉండాలి. అలాంటి ఫుల్‌మీల్స్ ఉన్న ఈ చిత్రం ప్రేక్షకుల అంచనాలు కూడా అందుకుంటుంది. ఈ సంక్రాంతిని వినోదాల ఎక్స్‌ప్రెస్ చేస్తుందనడంలో సందేహం లేదు. -
స్క్రిప్ట్ టు స్క్రీన్ సరదాగా ఒక సాయంత్రం
గిన్నిస్‌బుక్ రికార్డు కోసం నాగేంద్రప్రసాద్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ఐదో రోజు విశేషాలు * ఐదో రోజు పూర్తయ్యేసరికి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ అటెమ్ట్ మూవీ దాదాపుగా 80 శాతం పూర్తయింది. * సరదాగా సాగిపోయే ఈ చిత్రానికి ‘‘సరదాగా ఒక సాయంత్రం’’ అనే టైటిల్ ఫిక్స్ చేసి, రిజిస్టర్ చేశారు. * టైటిల్‌తో పాటు పోస్టర్ డిజైన్స్ తయారు చేయించే పని మొదలుపెట్టారు. * హీరో హీరోయిన్లతోపాటు కమెడియన్లు ‘తాగుబోతు’ రమేశ్, ‘షకలక’ శంకర్, ‘సుడిగాలి’ సుధీర్, ‘జబర్దస్త్’ శీనులపై కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. * సినిమాలో క్లైమాక్స్ ముందు సందర్భోచితంగా వచ్చే పాట చిత్రీకరణ పూర్తయింది. * సినిమా ఓపెనింగ్‌లో హీరో హీరోయిన్లపై వచ్చే ఇంట్రడక్షన్ సాంగ్‌ను చిత్రీకరించేందుకు కావలసిన లొకేషన్స్‌ను ఎంపిక చేసుకున్నారు. * మిగిలిన 20 శాతం షూటింగ్‌కి కావలసిన స్క్రిప్ట్ ఫైనల్ వెర్షన్‌ను సంభాషణలతో సహా పూర్తి చేశారు. -
కామెడీ హీరోలు..!
పంచామృతం: విదూషకుడు బావిలో పడ్డట్టు.. అనేది నానుడి. తెరపై కమెడియన్లు పడే పాట్లు కూడా నవ్విస్తాయి. అందరినీ ఆనందంలో ముంచెత్తుతాయి. అయితే అలాంటి విదూషకులు నిజజీవితంలో పడే పాట్లు మాత్రం బాధను మిగులుస్తాయి. మనల్ని నవ్వించేది వాళ్లే ఏడిపించేదీ వాళ్లే. ఇటీవలే రాబిన్ విలియమ్స్ ఆత్మహత్య చాలా మందిని బాధపెట్టింది. రాబిన్ మాత్రమే కాదు.. హాలీవుడ్లో కమెడియన్లుగా పేరు పొందిన అనేక మంది మానసికపరమైన ఒత్తిళ్లను ఎదుర్కొన్నారు. అయితే వాళ్లు ధైర్యంగా నిలబడ్డారు.. హీరోల్లా నిలిచారు! చార్లీ చాప్లిన్ సెలైంట్ ఎరా సినిమా.. మాటల్లేని రోజుల్లో కూడా నవ్వించిందంటే అందుకు చార్లీ చాప్లిన్ హావభావాలే మూలం. బాధాకరంగా గడిచిన బాల్యం, ప్రేమ, వైవాహిక జీవితాల్లో పడ్డ ఇబ్బందులు.. ఇవన్నీ చాప్లిన్‌ను డిప్రెషన్లోకి తీసుకెళ్లాయి. ఆయనను కుంగుబాటు బాధితుడిగా మార్చాయి. అయితే చాప్లిన్ వాటిని ఎదుర్కొని ధైర్యంగా నిలబడ్డారు. జిమ్ క్యారీ హాస్యాన్ని అభినయించగల వాళ్లే అసలైన హీరోలు. హాలీవుడ్‌లోనైనా ఇది వర్తిస్తుంది. అందుకు జిమ్ క్యారీనే రుజువు. హాలీవుడ్‌లోని స్టార్లలో ఒకరిగా నిలదొక్కుకొన్న ఈ కెనడియన్ సంతతి వ్యక్తిని గతానుభవాలు ఎప్పుడూ వేధిస్తూనే ఉంటాయట. ఈయన కూడా డిప్రెషన్ బాధితుడే. సినిమాల్లో నిలదొక్కుకోక ముందు జిమ్ సెక్యూరిటీ గార్డ్‌గా పనిచేశాడు. అప్పుడు మొదలైన మానసిక ఒత్తిడి జిమ్‌పై ఇప్పటికీ కొనసాగుతోందని వైద్యులు చెబుతున్నారు. అయితే జిమ్ మాత్రం అలాంటి ఒత్తిడిని తేలికగా తీసుకొని ముందుకు సాగుతున్నాడు. బెన్ స్టిల్లర్ అమెరికా, కెనడాల్లో స్టార్ ఇమేజ్. డబ్బుకు కూడా లోటు లేదు. వారసులు కూడా సినిమా రంగంలోనే స్థిరపడ్డారు. అయితే జన్యుపరంగా, వారసత్వంగా వచ్చిన డిప్రెషన్ మాత్రం ఈ స్టార్ యాక్టర్‌ను ఇబ్బంది పెడుతోంది. సినిమాలతో బిజీ అయిపోవడమే అందుకు విరుగుడుగా భావిస్తున్నాడు ఈ నటుడు. ఒవెన్ విల్సన్ ఎనిమిదేళ్ల కిందటే ఈయన ఆత్మహత్యకు ప్రయత్నించాడు. అయితే అదృష్టవశాత్తూ బయటపడ్డాడు. ఒవెన్ విల్సన్ తీవ్రమైన డిప్రెషన్‌తో బాధపడుతున్నాడనీ, ఆ ఒత్తిడే ఆయనను ఆత్మహత్యకు పురిగొల్పిందనీ వైద్యులు పేర్కొన్నారు. తన రచనతో కూడా హాస్యాన్ని పండించిన ఈ విదూషకుడిపై అనేక సంఘటనలు ఒత్తిడి పెంచాయనీ, కుంగుబాటును కలిగించాయనీ తెలుస్తోంది. అయితే ఈయన క్రమంగా స్థిమితపడ్డాడు. ఆత్మహత్యాయత్నపు అనంతర జీవితాన్ని ఆత్మవిశ్వాసంతో లీడ్ చేస్తున్నాడు. రస్సెల్ బ్రాండ్ బై పోలార్ డిజార్డర్ బాధితుడీయన. దాని ప్రభావంతో చాలా ఇబ్బందులే పడుతున్నాడు. ఒక దశలో డ్రగ్స్‌కు బానిస అయ్యాడు. సినిమాల్లో కమెడియన్‌గా రాణిస్తున్నప్పుడే అరెస్టయ్యాడు. అయితే తర్వాత పరివర్తన చెందాడు. కానీ ఇప్పటికీ కుంగుబాటు బాధితుడుగానే ఉన్నాడు. అయినా సినిమాల్లో, టీవీల్లో విదూషక పాత్రలో రాణిస్తున్నాడు. -
నవ్వుల లెజెండ్