
బాబాయ్ వెంకటేశ్, అబ్బాయ్ రానా కలిసి ఓ వెబ్ సిరీస్ చేయనున్నారనే ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. మంచి కథ కుదిరితే వెబ్ సిరీస్ చేయడానికి అభ్యంతరం లేదని పలు సందర్భాల్లో ఈ ఇద్దరూ పేర్కొన్నారు. ఇప్పుడు వెంకీ, రానా వెబ్ సిరీస్ చేయనున్నారనే ప్రచారంతో పాటు తాజాగా మరో వార్త కూడా వినిపిస్తోంది. ఈ వెబ్ సిరీస్‌లో ఓ కీలక పాత్రకు నిషా అగర్వాల్‌ను సంప్రదించిందట యూనిట్. కాజల్ అగర్వాల్ చెల్లెలు నిషా ‘ఏమైంది ఈవేళ’, ‘సోలో’, ‘సుకుమారుడు’, ‘సరదాగా అమ్మాయితో..’ సినిమాల్లో నటించిన విషయం గుర్తుండే ఉంటుంది. 2014లో విడుదలైన మలయాళ మూవీ ‘కజిన్స్’ నిషాకు ఆఖరి చిత్రం. 2013లో పెళ్లి చేసుకుని, ఆమె సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చారు. ఇప్పుడు మళ్లీ కెమేరా ముందుకు రావాలనుకుంటున్నారట. ఈ వెబ్ సిరీస్‌లో నటించేందుకు నిషా సుముఖంగా ఉన్నారని భోగట్టా. మరి.. వెంకీ.. రానా.. నిషా కాంబినేషన్‌లో వెబ్ సిరీస్ ఉంటుందా? వెయిట్ అండ్ సీ.
Comments
Please login to add a commentAdd a comment