
రౌడీ హీరో విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన చిత్రం ఫ్యామిలీ స్టార్. గీతగోవిందం డైరెక్టర్ పరశురామ్ పెట్ల దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అభిమానుల భారీ అంచనాల మధ్య శుక్రవారం రిలీజైంది. తాజాగా థియేటర్లలో సందడి చేస్తోన్న ఈ చిత్రానికి ఆడియన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు, శిరీష్ ఈ సినిమాను నిర్మించారు.
అయితే ఈ మూవీ ఏ ఓటీటీలో వస్తోందన్న విషయంపై అభిమానుల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంది. పరశురామ్- విజయ్ కాంబోలో వచ్చిన చిత్రం కావడంతో ఓటీటీ స్ట్రీమింగ్ రైట్స్ కూడా భారీ ధరకు అమ్ముడైనట్లు తెలుస్తోంది. అయితే అందరు అనుకుంటున్నట్లుగా ఫ్యామిలీ స్టార్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కావడం లేదు. మొదట నెట్‌ఫ్లిక్స్ ఈ మూవీ హక్కులను దక్కించుకుందని వార్తలొచ్చాయి.
కానీ ఈ మూవీ డిజిటల్ రైట్స్‌ను అమెజాన్ ప్రైమ్ దక్కించుకుంది. దీంతో ఫ్యామిలీ స్టార్ నెల రోజుల తర్వాతే ఓటీటీకి రానుంది. అంటే మే నెల రెండో వారంలో లేదా మూడో వారంలో అందుబాటులోకి వచ్చే అవకాశముంది.