యంగ్ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా మధ్య సమ్‌థింగ్ సమ్‌థింగ్ నడుస్తోందంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. కానీ దీనిపై అటు విజయ్ కానీ, ఇటు రష్మిక కానీ ఇంతవరకు స్పందించనేలేదు. కానీ అప్పడప్పుడు వీరిద్దరూ కలిసి చక్కర్లు కొట్టడం, ముంబైలో పలుమార్లు డిన్నర్ డేట్స్‌కు వెళుతూ కెమెరాలకు చిక్కారు. దీంతో వీరిద్దరూ రూమర్డ్ కపుల్స్‌గా పేరొందారు. ఈ క్రమంలో ఈ రూమర్డ్ కప్పుల్‌కు సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియా చక్కర్లు కొడుతోంది.
చదవండి: Vijay Deverakonda-Rashmika: డిన్నర్ డేట్‌కు విజయ్ దేవరకొండ- రష్మిక
బాలీవుడ్‌కు చెందిన ఓ టాబ్లైడ్ ప్రకారం ఈ జంట త్వరలో కీలక ప్రకటన ఇవ్వబోతున్నట్లు నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతోంది. కొత్త సంవత్సరంలో వీరి ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్ చెప్పాలని ఈ రూమార్డ్ కపుల్ నిశ్చయించుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ‘వీరి రిలేషన్‌ను అఫిషియల్ చేయబోతున్నారా? లేక కొత్త ప్రాజెక్ట్ ఏదైనా ప్రకటించబోతున్నారా?’అంటూ నెటిజన్లు రకరకాలుగా సందేహలు వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా న్యూ ఇయర్‌కు విజయ్, రష్మికలు తమ ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్ ఇచ్చే ప్రకటన ఏదో ఇవ్వబోతున్నట్లు సన్నిహిత వర్గాల నుంచి సమాచారం.
చదవండి: ఒక్క వీడియోతో రూమర్స్‌కు చెక్ పెట్టిన ఇళయరాజా
అయితే ప్రస్తుతం విజయ్, రష్మికలు గోవాలో హలీడే ట్రిప్‌ను ఎంజాయ్ చేస్తున్నట్లు సమాచారం. న్యూ ఇయర్ వేడుకల్లో సందర్భంగా వీరిద్దరూ కలిసి గోవా పయనమయ్యారని, అక్కడ జంట కొత్త సంవత్సరాన్ని స్వాగతించబోతున్నారట. కాగా గీతా గోవిందం మూవీలో జంటగా నటించిన విజయ్-రష్మికల పేర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆన్‌స్రీన్‌పై వీరి కెమిస్ట్రీ బాగా కుదిరిందంటూ ప్రశంసలు కూడా అందుకున్నారు. ఆ తర్వాత వీరిద్దరూ డియర్ కామ్రేడ్‌తో మరోసారి జతకట్టిన సంగతి తెలిసిందే. కాగా ప్రస్తుతం విజయ్ లైగర్ మూవీతో బిజీగా ఉండగా, రష్మిక పుష్ప మూవీ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment