రాజకీయాల్లో టాప్‌ హీరో పోస్టర్ల కలకలం | Vijay Poster Sets Tamil Politics On Fire | Sakshi
Sakshi News home page

రాజకీయ కలకలం సృష్టిస్తున్న విజయ్‌‌ పోస్టర్లు

Published Sat, Sep 5 2020 8:23 AM | Last Updated on Sat, Sep 5 2020 8:57 AM

Vijay Poster Sets Tamil Politics On Fire - Sakshi

కలకలం సృష్టిస్తున్న విజయ్‌ పోస్టర్లు

చెన్నై : హీరో విజయ్‌కి సంబంధించిన పోస్టర్లతో తమిళనాడులో మరోసారి రాజకీయ కలకలం చెలరేగుతోంది. రజనీకాంత్‌ తర్వాత అంత మాస్‌ ఫాలోయింగ్‌ ఉన్న హీరో విజయ్‌ అని చెప్పవచ్చు. ఈయనకి అభిమానగణం కూడా చాలా ఎక్కువే. అదేవిధంగా రజనీకాంత్‌ మాదిరిగానే విజయ్‌కు రాజకీయాల్లోకి ప్రవేశించాలనే ఆసక్తి ఉందన్నది ఎవరూ కాదనలేని మాట. ఇకపోతే విజయ్‌ అభిమానులు ముద్రిస్తున్న పోస్టర్లు చాలా కాలంగా రాజకీయ వర్గాల్లో కలకలం సృష్టిస్తున్నాయి. అదేవిధంగా ఇటీవల విజయ్‌ పుట్టినరోజు సందర్భంగా అన్నాదురై, పెరియార్‌లతో విజయ్‌ ఫొటోలను ముద్రించిన పోస్టర్లను అభిమానులు ఈ సందర్భంగా విడుదల చేశారు. అందులో మీరు రాజకీయాల్లోకి వస్తే అన్నాదురై లేకుంటే పెరియార్‌ అంటూ పేర్కొన్నారు. (పదేళ్లకు జోడీ కుదిరింది )

తాజాగా నటుడు దివంగత ముఖ్యమంత్రి ఎంజీఆర్‌ నటించిన చిత్రాల్లోని ఆయన గెటప్‌లలో విజయ్‌ ముఖాలను పొందుపరిచిన పోస్టర్లు కాంచీపురంలో హల్‌చల్‌ చేస్తున్నాయి. అందులో నాడొడి మన్నన్‌ మాట్టుక్కార వేలన్, కుడియిరుంద, కోయిల్‌ చిత్రంలోని ఎంజీ రామచంద్రన్‌ గెటప్పుల్లో విజయ్‌ ముఖాన్ని పొందుపరిచారు. ఆ పోస్టర్‌లో మక్కల్‌ తిలకంకు మరో రూపమే అంటూ పేర్కొన్నారు. 2021 ప్రథమార్థంలో తమిళనాడు శాసనసభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ పోస్టర్లూ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అంతే కాకుండా వీటి గురించి  ప్రముఖ చానల్లో చర్చావేదిక కూడా జరగడం విశేషం. (కూతురుతో సహా సినీ నటి అదృశ్యం)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement