యంగ్ టైగర్ ఎన్టీఆర్ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. ప్రస్తుతం ఆయన రాజమౌళి దర్శకత్వంలో ఆర్‌ఆర్‌ఆర్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ పూర్తికాగానే.. కొరటాల శివ ప్రాజెక్ట్‌ని పట్టాలెక్కించబోతున్నాడు. అదే విధంగా ‘కేజీఎఫ్’ ఫేమ్ ప్రశాంత్ నీల్‌తో కలిసి ఓ పాన్ ఇండియా చిత్రాన్ని లైన్‌లో పెట్టాడు. తాజాగా ఈ మూవీకి సంబంధించి క్రేజీ రూమర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇందులో కీలక పాత్ర కోసం విజయ్ సేతుపతిని తీసుకోవాలని సన్నాహాలు చేస్తున్నారట. ఈ మేరకు డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఆయనతో సంప్రదింపులు కూడా పూర్తి చేశారని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. త్వరలో ఇందుకు సంబందించిన అఫీషియల్ స్టేట్‌మెంట్ కూడా రానుందట.
ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ప్రభాస్‌తో 'సలార్' తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాను 2022 ఏప్రిల్ 14న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నట్టు ఇదివరుకే మేకర్స్ ప్రకటించారు. దీని తర్వాత ఎన్టీఆర్ సినిమాని పట్టాలెక్కించబోతున్నాడు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్ కేటాయించి రూపొందించబోతున్నారని సమాచారం. ఇందులో ఎన్టీఆర్ ప్రపంచాన్ని గడగడలాడించే పవర్‌ఫుల్ మాఫియా డాన్‌లా ఎన్టీఆర్‌ని చూపించబోతున్నారని తెలుస్తోంది. ఇప్పుడు ఈ సినిమాలో విజయ్ సేతుపతిని కూడా భాగం చేస్తున్నారని తెలుస్తుండటం మరింత ఆసక్తికరంగా మారింది.
చదవండి:
పెద్ద మనసు చాటుకున్న విజయ్ సేతుపతి
అలాంటి అరుదైన స్నేహితుడు కొరటాల : ఎన్టీఆర్
Comments
Please login to add a commentAdd a comment