
దాదాపు 30 ఏళ్ల క్రితం కమల్‌హాసన్, అమల జంటగా సురేశ్ కృష్ణ డైరెక్షన్‌లో వచ్చిన తమిళ చిత్రం ‘సత్య’ (1988) సూపర్ హిట్. ఇళయరాజా సంగీతం అందించిన ఈ సినిమా పాటలూ హిట్టే. ముఖ్యంగా ఈ సినిమాలోని ‘వళయోసై గలగలవెన...’ (గాజుల సవ్వడి గలగలమంటూ...) పాట ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటుంది. ఈ సాంగ్‌ను రీ క్రియేట్ చేశారు దర్శకుడు విఘ్నేష్ శివన్. విజయ్ సేతుపతి, నయనతార, సమంత ప్రధాన పాత్రల్లో విఘ్నేశ్ దర్శకత్వంలో తమిళంలో ‘కాత్తు వాక్కుల రెండు కాదల్’ సినిమా రూపొందుతోంది.
(చదవండి: బాయ్‌ఫ్రెండ్ బర్త్‌డే.. రెచ్చిపోయిన డైరెక్టర్ కూతురు!)
ఈ సినిమా కోసమే ‘వళయోసై...’ సాంగ్‌ను రీ క్రియేట్ చేశారు. ‘సత్య’లో హీరోయిన్‌గా నటించిన అమల ఈ సినిమాలో ఓ కీలక పాత్ర చేయడం విశేషం. అయితే అప్పట్లో ‘వళయోసై..’ పాటలో కమల్‌తో పాటు అమల మాత్రమే కనిపించారు. కొత్త వెర్షన్‌లో విజయ్ సేతుపతితో పాటు సమంత, నయన కనిపించనున్నారు. అలాగే అప్పట్లో అమల కట్టుకున్న చీరలాంటిదే సమంత, నయనతార కూడా కట్టుకున్నారు. అప్పటి పాటలో కమల్–అమల బస్సులో ఫుట్‌బోర్డ్ జర్నీ చేస్తారు. తాజా పాటలో కూడా ఆ సీన్ ఉంది.