Mahesh Babu New Look, Namrata Shirodkar Posted on Instagram With LOVE Quote - Sakshi
Sakshi News home page

మహేశ్‌ న్యూ పిక్‌‌: ఎంత ముద్దొస్తున్నాడో..

Published Wed, Mar 24 2021 6:36 PM | Last Updated on Wed, Mar 24 2021 8:08 PM

Viral: Namrata Shirodkar Shares New Pic Of Mahesh Babu - Sakshi

మహేశ్‌బాబు.. ఈ పేరులోనే ఓ మత్తు ఉంది. టాలీవుడ్‌ ప్రిన్స్‌గా పేరొందిన మహేశ్‌కు అభిమానులు కోట్లలో ఉన్నారు. ఆయన నుంచి ఏ అప్‌డేట్‌ వచ్చినా ఆనందంలో మునిగితేలుతుంటారు. సినిమా నుంచే కాకుండా వ్యక్తిగతంగా కూడా ఆరాధిస్తుంటారు. ఎంత మంది హీరోలున్న అమ్మాయిల ఫాలోయింగ్‌లో మాత్రం మహేశ్‌ ముందు వరుసలో ఉంటాడు. వయస్సు పెరిగే కొద్దీ సాధారణంగా ఎవరికైనా అందం తగ్గుతుంటే అదేంటో మన ప్రిన్స్‌ మాత్రం మరింత యంగ్‌గా తయారవుతున్నాడు. ఈ మధ్య కాలంలో తన డిఫరెంట్‌ లుక్స్‌తో అభిమానులను సర్‌ప్రైజ్‌ చేస్తున్నాడు.

మహేశ్‌ సతీమణి నమ్రత శిరోద్కర్‌ ఎప్పటికప్పుడు తన భర్తకు సంబంధించిన ఫోటోలను సోషల్‌ మీడియాలో పంచుకుంటూ ఫాన్స్‌ను అలరిస్తుంటారు. తాజాగా నమ్రత తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో మహేశ్‌ న్యూ‌ ఫోటోను షేర్‌ చేసింది. ‘మీ మెనూలోకి చిరునవ్వును చేర్చండి. ప్రతిరోజూ సంతోషంగా మారుతుంది.’ అనే క్యాప్షన్‌తో పోస్టు చేశారు. ఎప్పుడూ క్లీన్‌ అండ్‌ నీట్‌గా కనిపించే హీరో ఈసారి గజిబిజిగా ఉన్న జుట్టు, చిరునవ్వుతో దర్శనమిచ్చాడు. ఈ ఫోటో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారుతోంది. దీనిపై నెటిజన్లు స్పందిస్తున్నారు. ‘తరగని అందం.. మహేశ్‌ సొంతం, ఎంత ముద్దొస్తున్నాడో’ అంటూ కామెంట్‌ చేస్తున్నారు.

ఇక సినిమాల విషయానికొస్తే.. సర్కారు వారి పాటలో నటిస్తున్నాడు మహేశ్‌. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది. ప్రస్తుతం మొదటి షెడ్యూల్‌ షూటింగ్‌ పూర్తి చేసుకొని కుటుంబంతో సరదాగా గడుపుతున్నాడు. కూతురు నమ్రతతో కలిసి ఎంజాయ్‌ చేస్తున్నాడు.

చదవండి: 

సర్కారు వారిపాట: మహేశ్‌కి తండ్రిగా సీనియర్‌ హీరో
వకీల్ ‌సాబ్‌ బిగ్‌ అప్‌డేట్‌ వచ్చేసింది

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement