
Shruti Haasan With Boyfriend Santanu Hazarika: ఎవరైనా సెలబ్రిటీ ఇల్లు దాటి బయటకొస్తే చాలు కెమెరాలు క్లిక్కుమనిపిస్తూ, వీలైతే సెల్ఫీ దిగుతూ సందడి చేస్తుంటారు జనాలు. అలాంటిది ఏకంగా తారలు తమ లవర్‌తో బయట కనిపిస్తే ఇంకేమైనా ఉందా.. ఫొటోలు, వీడియోలు తీస్తూ, వారినే కళ్లప్పగించి చూస్తూ ఉంటారు. ఇంతకీ ఇప్పుడు ఏ సెలబ్రిటీ ఇలా బాయ్‌ఫ్రెండ్‌తో బయట షికారుకొచ్చిందనుకుంటున్నారా? ఇంకెవరు దక్షిణాది స్టార్ హీరోయిన్ శ్రుతీ హాసనే..
తాజాగా శ్రుతీ హాసన్ తన బాయ్‌ఫ్రెండ్ శాంతను హజారికతో కలిసి ముంబైలోని ఓ సూపర్‌మార్కెట్‌లో ప్రత్యక్షమైంది. ఇంకేముందీ ఈ జంటను అక్కడి జనాలు తమ ఫోన్ కెమెరాల్లో బంధించడంటో నిమగ్నమయ్యారు. శ్రుతీ కూడా పోజులివ్వడానికి సై అంది. శాంతనుకు హగ్గులిస్తూ, పబ్లిక్‌గా ముద్దులు కూడా పెట్టేసింది. దీనికి సంబంధించిన ఫొటోలను ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో యాడ్ చేసింది. ఇది చూసిన జనాలు పబ్లిక్‌గా ఆ ముద్దులేంటి? అని నోరెళ్లబెడుతున్నారు.
కాగా శ్రుతీ, శాంతను కొన్ని సంవత్సరాలుగా డేటింగ్ చేసుకుంటున్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. కానీ దీనిపై ఈ ఇద్దరూ ఇప్పటివరకు స్పందించనే లేదు. ప్రస్తుతం ఈ హీరోయిన్ 'సలార్'లో కథానాయికగా నటిస్తుండగా, ఓ వెబ్ సిరీస్‌కు సైతం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు ఫిల్మీదునియాలో టాక్ నడుస్తోంది. అలాగే ఆమె నటించిన 'లాభం' సినిమా రిలీజ్‌కు రెడీ అవుతోంది.