ఇష్టం సినిమాతో 2001లో వెండితెరపై కాలు మోపింది హీరోయిన్ శ్రియా. రెండో సినిమాకే నాగార్జున వంటి స్టార్ హీరోతో నటించే చాన్స్ కొట్టేసిన ఈ ముద్దుగుమ్మ తక్కువ కాలంలోనే టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. హిందీ, తమిళ, మలయాళ భాషల్లోనూ ఆడిపాడిన ఈ భామ పెళ్లి తర్వాత సినిమాలు సెలక్టివ్‌గా ఎంపిక చేసుకుంటోంది. ఎన్‌టీఆర్: కథానాయకుడు చిత్రంలో చివరిసారిగా కనిపించిన ఈ ముద్దుగుమ్మ తాజాగా ఓ ఇంట్రస్టింగ్ వీడియోను అభిమానులతో పంచుకుంది.
హోలీ పండగను పురస్కరించుకుని తన జీవితాన్ని రంగులమయం చేసిన పెళ్లినాటి వీడియోను షేర్ చేసింది. ఇందులో శ్రియ భర్త ఆండ్రీ కొశ్చేవ్‌తో కలిసి ఫుల్ జోష్‌తో చిందులేసింది. పూనకమొచ్చినట్లుగా డ్యాన్స్ చేసింది. అందరి ముందే భర్తను కొంగుతో దగ్గరకు లాగుతూ రొమాంటిక్ స్టెప్పులేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఈ వీడియోను మీరూ ఓసారి చూసేయండి..
Comments
Please login to add a commentAdd a comment