Actor Vishal, Karthi And Nassar Getting Death Threats, Details Inside - Sakshi
Sakshi News home page

Death Threats To Actors: హీరో విశాల్‌, కార్తీలకు హత్యా బెదిరింపులు

Published Wed, Jul 6 2022 3:23 PM | Last Updated on Wed, Jul 6 2022 4:00 PM

Vishal, Karthi Getting Death Threats - Sakshi

దక్షిణ భారత నటీనటుల సంఘం నిర్వాహకులు విశాల్‌, కార్తీ, నాజర్‌తో ఆ సంఘం సభ్యుడు, సహాయ నటుడు రాజదురై హత్యా బెదిరింపులకు పాల్పడుతున్నట్లు సంఘం అధికారి ధర్మరాజ్‌ తేనాంపేట పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అందులో ఆయన పేర్కొంటూ దక్షిణ భారత నటీనటుల సంఘం నిర్వాహకులు విశాల్‌, కార్తీ, నాజర్‌ సంఘం సంక్షేమం కోసం నిరంతరం పాటు పడుతున్నారన్నారు.

అలాంటివారిపై సహాయ నటుడు రాజదురై సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేస్తుండడం తగదన్నారు. ఇలాంటివి సంఘ నిర్వాహకులను అప్రతిష్టపాలు చేసేవిగా ఉన్నాయన్నారు. దీంతో అతనిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు రాజదురైను ప్రశ్నిస్తున్నారు.

చదవండి: బోయపాటి కొత్త సెంటిమెంట్‌.. రామ్‌పై వర్కౌట్‌ అవుతుందా?
కొత్త సినిమాలతో కళకళలాడుతున్న ఓటీటీ వరల్డ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement