
Vishnu Priya Gave Clarity On Her Marriage: యాంకర్ విష్ణు ప్రియ తనకు సంబంధించిన ఓ ఆసక్తికర ప్రకటన చేసింది. పోవే పోరాతో యాంకర్‌గా పరిచయమైన విష్ణు ప్రియా హాట్ హాట్ ఫొటోషూట్స్‌తో కుర్రకారును ఆకట్టుకుంటోంది. తరచూ తన ఫొటోలను పంచుకుంటూ సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. ఈ నేపథ్యంలో నేడు సింగిల్స్ డే సందర్భంగా విష్ణు ప్రియ తన పెళ్లి విషయంపై స్పందించింది. ఈ సందర్భంగా త్వరలోనే తాను పెళ్లి చేసుకోబోతున్నట్లు చెప్పకనే చెప్పింది. నేడు(నవంబర్ 11) సింగిల్స్ డే.
చదవండి: కంగనా విలాసవంతమైన బిచ్చగత్తె: సీపీఐ నేత సంచలన వ్యాఖ్యలు
దీంతో ‘సింగిల్‌గా ఉన్నవాళ్లు చేతులెత్తండి. నమ్మండి నెక్ట్ ఇయర్ ఖచ్చితంగా నేను సింగిల్‌గా ఉండను. కానీ కానీ సింగిల్‌గా ఉండటమే ఎంతో బాగుంది. వీలైనంత వరకు సింగిల్ లైఫ్ ఎంజాయ్ చేయాలి’ అంటూ స్టోరీ షేర్ చేసింది. ఇక ఆమె స్టోరీ చేసిన వారంత అయితే త్వరలోనే విష్ణు ప్రియ పెళ్లి చేసుకోబోతుందా? అని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు పెళ్లి తేదీ ఎప్పుడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైన ఇప్పటి యాంకర్లలో విష్ణు ప్రియ ముందుగా ఇల్లాలు కాబోతుందని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.
చదవండి: పునీత్ మృతికి రజనీ సంతాపం, కన్నింగ్ ఫెలో అంటూ విమర్శలు