కరోనా దెబ్బకు ప్రపంచ ముఖ చిత్రమే మారిపోయింది. అప్పటివరకు సాధారణంగా ఉన్న జనజీవన స్రవంతిలో ఈ మహమ్మారి ఎంట్రీ ఇచ్చి అల్లకల్లోలాన్నే సృష్టించింది. దీని విజృంభణ ఇప్పుడప్పుడే తగ్గేలా కనిపించడం లేదు. దీని వల్ల ప్రజలకు బోలెడంత ఎంటర్‌టైన్‌మెంట్ అందించే థియేటర్లు కూడా మూతపడ్డాయి. ఫలితంగా జనం వినోదం లేక ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అలాంటి సమయంలో డిజిటల్ ప్లాట్‌ఫామ్ వారికి ఉపశమనం కలిగించింది. జనాలు ఇంటి నుంచి అడుగు బయటపెట్టకుండా వారికి అరచేతిలో ఆకాశమంత ఎంటర్‌టైన్‌మెంట్ అందిస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే బోలెడన్ని ఓటీటీ యాప్స్ పుట్టుకొచ్చాయి, ఇంకా వస్తూనే ఉన్నాయి. మరి తాజాగా ఓటీటీలోకి రాబోయే సినిమాలు, ఆల్‌రెడీ స్ట్రీమింగ్ అవుతున్న సినిమాలేంటో తెలియాలంటే ఇది చదివేయండి..
రూమ్ నెంబర్ 54
కాలేజీ స్టూడెంట్స్ కథలతో వస్తోంది రూమ్ నెంబర్ 54. ఇంజనీరింగ్ చదువుతూ కాలేజీ హాస్టల్‌లోని రూమ్ నంబర్ 54లో ఉంటున్న నలుగురు కుర్రాళ్ల కథ ఇది. తరుణ్ భాస్కర్ సమర్పించిన ఈ సినిమాలో మొయిన్, కృష్ణప్రసాద్, పవన్ రమేష్, కృష్ణతేజ, శ్వేతా, నవ్య నటించారు. సిద్ధార్థ్ గౌతమ్ రచన, దర్శకత్వం వహించాడు. ఈ వెబ్‌సిరీస్ జీ 5లో మే 21 నుంచి ప్రసారం కానుంది.
.@TharunBhasckerD Presents #RoomNo54 premieres 21st May only on #ZEE5#RoomNo54onZEE5 #Premieres21stMay #ZEE5Exclusive @iDreamMedia @Moin_here @PawonRamesh @KrishnaTeja_D #KrishnaPrasadVathyam pic.twitter.com/U1wk1OUtfG
— BARaju (@baraju_SuperHit) May 17, 2021
క్యాబ్ స్టోరీస్
నటుడు శ్రీహాన్, బిగ్‌బాస్ భామ దివి ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్ సిరీస్ క్యాబ్ స్టోరీస్. స్పార్క్ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో మే 28 నుంచి క్యాబ్ స్టోరీస్ ప్రసారం కానుంది.
ద లాస్ట్ అవర్
ఇదొక క్రైమ్, సస్పెన్స్ వెబ్‌సిరీస్. అమిత్ కుమార్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం హిమాలయాల అందాలను కనులారా వీక్షించవచ్చు. సంజయ్ కపూర్, షాహని గోస్వామి, రీమా సేన్ ముఖ్యపాత్రల్లో నటించిన ఈ సిరీస్ మే 14 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో ప్రసారమవుతోంది.
అల్మా మ్యాటర్స్
స్టాండప్ కమెడిన్ బిస్వ కల్యాన్ రాథ్ రూపొందించిన చిత్రం అల్మా మ్యాటర్స్. ఇది డాక్యుమెంటరీ సిరీస్. విద్యార్థుల మానసిక ఒత్తిడి, వారికి విధించే లక్ష్యాలను సాధించే క్రమంలో ఎదుర్కొనే ఇబ్బందులను.. ఇలా ప్రతీ అంశాన్ని టచ్ చేశారు. మే 14న ఓటీటీలో రిలీజైన ఈ సిరీస్‌ను నెట్‌ఫ్లిక్స్‌లో వీక్షించవచ్చు.
సర్దార్ కా గ్రాండ్‌సన్
బాలీవుడ్ నటులు అర్జున్ కపూర్, నీనా గుప్తా, రకుల్ ప్రీత్ సింగ్, జాన్ అబ్రహం ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం సర్దార్ కా గ్రాండ్‌సన్. రకుల్ ఇందులో పెద్ద ట్రక్ కూడా నడిపింది. కాశ్వీ నాయర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం నేటి(మే 18)నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం కానుంది.
నింజమ్ మారప్పతిల్లై
ఎస్‌జే సూర్య, నందిత శ్వేత, రెజీనా కసాండ్రా ముఖ్యపాత్రల్లో నటించిన సినిమా నింజమ్ మారప్పతిల్లై. హారర్ అంశాలు పుష్కలంగా ఉన్న ఈ తమిళ చిత్రం జీ 5లో ప్రసారమవుతోంది.
దోస్ హూ విష్ మీ డెడ్
ఏంజెలినా జోలీ, నికోలస్ హాల్ట్, జాన్ బెర్నాతల్ ఏడెన్ గిలెన్. టైలర్ పెర్రీ, ఫిన్ లిటిల ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం దోస్ హూ విష్ మీ డెడ్. ఈ చిత్రం హెచ్‌బీవో మాక్స్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ మే 14 నుంచి ప్రసారమవుతోంది.
హమ్ భీ ఆకేలే, తుమ్ బీ ఆకేలే
జరీన్ ఖాన్, అన్షుమాన్ ఝా, గుర్‌ఫతే పిర్జాదా ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం హమ్ భీ ఆకేలే, తుమ్ బీ ఆకేలే. ఈ సినిమాను డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో వీక్షించవచ్చు.
తారీఖ్
బెంగాళీ చిత్రాలు చూసేవారికి తారీఖ్ బెస్ట్ ఆప్షన్. సస్వత చటర్జీ, రిత్విక్ చక్రవర్తి ప్రధాన పాత్రల్లో నటించిన ఈత్సినిమాకు చూర్నీ గంగూలీ డైరెక్టర్‌గా వ్యవహరించాడు. ప్రేమ, మరణం, నివాళుల చుట్టూ తిరిగే ఈ సినిమాకు జాతీయ అవార్డు సైతం లభించింది. ఇది మే 8 నుంచి హెయ్‌చోయ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.
కర్ణన్
తమిళ స్టార్ హీరో ధనుష్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం కర్ణన్. మారి సెల్వరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఏప్రిల్ 9న థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం మే 14 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో ప్రసారమవుతోంది. చెక్ సన్ నెక్స్ట్‌లో, విజయ్ సేతుపతి ఆహాలో లభ్యమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment