
వనదేవతల సన్నిధిలో 32 హుండీలు
ఎస్‌ఎస్‌తాడ్వాయి: మేడారం సమ్మక్క– సారలమ్మ వనదేవతల సన్నిధిలో భక్తుల కానుకలు సమర్పించేందుకు 32 హుండీలను ఏర్పాటు చేశారు. దేవాదాయశాఖ ఆధ్వర్యంలో మేడారంలో ఇన్‌స్పెక్టర్ కవిత పర్యవేక్షణలో గురువారం హుండీలకు సీల్ వేసి గద్దెలపై ఏర్పాటు చేసినట్లు ఈఓ రాజేంద్రం తెలిపారు. సమ్మక్క గద్దైపె 14, సారలమ్మ గద్దైపె 14, గోవిందరాజు గద్దె వద్ద 2, పగిడిద్దరాజు గద్దె వద్ద 2 హుండీలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. భక్తులు కానుకలను హుండీల్లో వేసి మొక్కులు చెల్లించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ క్రాంతికుమార్, రికార్డు అసిస్టెంట్ వీరయ్య, పూజారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment