![మూడు](/styles/webp/s3/article_images/2025/02/8/07mul102-330120_mr-1738981488-0.jpg.webp?itok=j9Uj1gEu)
మూడు జోన్లు, 21 సెక్టార్లు
ఎస్‌ఎస్ తాడ్వాయి: మేడారం సమ్మక్క సారలమ్మ మినీ జాతరకు ఇంకా నాలుగు రోజులే మిగిలింది. జాతరకు సుమారు 20 లక్షల మంది భక్తులు హాజరవుతారని అధికారుల అంచనా. మేడారానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఆటంకం కాకుండా జిల్లా పంచాయతీ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక పారిశుద్ధ్య చర్యలు చేపట్టింది. ఇప్పటికే ముందస్తుగా మేడారంలో పారిశుద్ధ్య పనులు కొనసాగుతుండగా జాతర నాలుగు రోజులు ఎక్కడా కూడా పారిశుద్ధ్య సమస్యల తలెత్తకుండా డీపీఓ దేవరాజు ప్రత్యేక చర్యలకు కసరత్తు చేస్తున్నారు.
సెక్టార్ల వారీగా కార్మికులు..
మేడారం మినీజాతరలో పారిశుద్ధ్య పనుల కోసం మూడు జోన్లు, 21 సెక్టార్లు ఏర్పాటు చేశారు. జంపన్నవాగు, అమ్మవార్ల గద్దెల కోర్ ఏరియా, ఊరట్టం కన్నెపల్లి ఈ మూడు జోన్లలో 21 సెక్టార్లను ఏర్పాటు చేశారు. ఈ సెక్టార్ల వారీగా పారిశుద్ధ్య కార్మికులకు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు చెత్తను సేకరించి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 10 ట్రాక్టర్లలో చెత్తను డంపింగ్ కేంద్రాలను తరలించనున్నారు. చెత్త పూడ్చివేతకు రెండు జేసీబీలు, రెండు డోజర్లను ప్రత్యేకంగా అందుబాటులో ఉంచనున్నారు. ఈ సెక్టార్లలో డీపీఓ పర్యవేక్షణలో ఇద్దరు ఎంపీఓలు, 30 మంది పంచాయతీ కార్యదర్శులు, 10 మంది కారోబార్‌లను నియమించారు.
రోజుకు రెండు షిఫ్టులు..
మేడారం జాతరలో పారిశుద్ధ్య సేవలను 400 మంది కార్మికులను ప్రత్యేకంగా నియమించనున్నారు. ఇప్పటికే వందల సంఖ్యలో కార్మికులు మేడారంలో పారిశుద్ధ్య సేవలు చేపడుతున్నారు. జాతర ప్రారంభం నాటికి మొత్తం 400 మంది పారిశుద్ధ్య కార్మికులను రాజమండ్రి నుంచి ప్రత్యేకంగా రప్పించనున్నారు. వీరు ఈ 21 సెక్టార్లలో రోజుకు రెండు షిఫ్టుల వారీగా పనులు చేయనున్నారు. ఈసారి మినీ జాతరలో ఎక్కడి చెత్త అక్కడే సేకరించి ఒక దగ్గర వేసేందుకు గ్రీన్ మ్యాట్‌తో ఒక మినీ డంపింగ్ కేంద్రం లాగా ఏర్పాటు చేశారు. జిల్లా పంచాయతీ శాఖ ఆధ్వర్యంలో భక్తుల తాగునీటి వసతి కోసం ప్రత్యేకంగా 10 వాటర్ ట్యాంకర్లను కూడా అందుబాటులో ఉంచనున్నారు. శానిటేషన్ ప్రాంతాలు, భక్తులు విడిది చేసే ప్రదేశాల్లో ఎక్కడా కూడా చెత్త, దోమలు, ఈగలు నిల్వకుండా కార్మికులు ఎప్పటికప్పుడు తొలగించి బ్లీచింగ్ చేసేలా అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అలాగే మేడారంలోని రోడ్లపై దుమ్ము, దూళి లేవకుండా ట్యాంకర్లతో రోడ్లపై నీళ్లు చల్లుతున్నారు. భక్తుల విడిది చేసే తాగునీటి వసతితో పాటు మరుగుదొడ్లను పరిశుభ్రంగా ఉంచేందుకు కార్మికులను ప్రత్యేకంగా నియమించారు.
పక్కా ప్రణాళికతో పనులు
మేడారం సమ్మక్క సారలమ్మ మినీ జాతరలో పారిశుద్ధ్య పనులకు పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నాం. జాతరకు ముందస్తుగా 10 రోజుల నుంచి పనులు చేపడుతున్నాం. జాతర సమయంలో ఎలాంటి పారిశుద్ధ్య సమస్య ఏర్పడకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాం. గత రెండు జాతరల్లో ములుగు డీఎల్‌పీఓగా పనిచేసిన అనుభవంతో పారిశుద్ధ్య పనుల్లో లోపాలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటాం. మంత్రి సీతక్క, కలెక్టర్ ఆదేశాల మేరకు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఏర్పాట్లు చేస్తాం.
– దేవరాజ్, డీపీఓ
మేడారంలో ప్రత్యేక పారిశుద్ధ్య సేవలు
30 మినీ డంపింగ్ కేంద్రాల ఏర్పాటు
చెత్త ఏరివేతకు 400 మంది కార్మికులు
![మూడు జోన్లు, 21 సెక్టార్లు1](/gallery_images/2025/02/8/07mul101-330120_mr-1738981488-1.jpg)
మూడు జోన్లు, 21 సెక్టార్లు
![మూడు జోన్లు, 21 సెక్టార్లు2](/gallery_images/2025/02/8/07mul103-330120_mr-1738981488-2.jpg)
మూడు జోన్లు, 21 సెక్టార్లు
![మూడు జోన్లు, 21 సెక్టార్లు3](/gallery_images/2025/02/8/07mul105-330120_mr-1738981488-3.jpg)
మూడు జోన్లు, 21 సెక్టార్లు
Comments
Please login to add a commentAdd a comment