
సకాలంలో జాతర పనులు పూర్తి చేయాలి
ఏటూరునాగారం: కొండాయి, దొడ్ల ప్రాంతాల్లో జరిగే మినీ జాతర పనులను సకాలంలో పూర్తి చేయాలని ఆర్డీఓ నేత వెంకటేశ్ అన్నారు. శుక్రవారం మండలంలోని కొండాయిలోని గోవిందరాజుల గుడిలో ఆర్డీఓ, డీడీ పోచం కలిసి పూజలు చేశారు. అనంతరం జాతర జరిగే ప్రాంతాలను, భక్తులు ఎంత మంది వస్తారని సారలమ్మ పూజారి కాక వెంకటేశ్వర్లను అడిగి తెలుసుకున్నారు. జాతర ప్రాంతా ల్లో నిర్మిస్తున్న ప్రహరీ, షెడ్డు, తాగునీటి వసతి, విద్యుత్ పనులను సకాలంలో పూర్తి చేసి భక్తులకు అందుబాటులో తీసుకురావాలన్నారు. రో డ్డుపై ఎక్కడ కూడా గుంతలు లేకుండా చూడాలన్నారు. ఆయన వెంట తహసీల్దార్ జగదీష్, ఐటీడీఏ ఏఓ రాజ్‌కుమార్, ఎంపీఓ కుమార్, పంచాయతీ కార్యదర్శి సతీష్, గోవిందరాజుల పూజారి దబ్బగట్ల గోవర్ధన్, రాజారాం, రఘు తదితరులు పాల్గొన్నారు.
వైభవంగా
సీతారాముల కల్యాణం
మంగపేట: మండలంలోని బోరునర్సాపురం శ్రీ సీతారామాంజనేయ స్వామి ఆలయంలో శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని శుక్రవారం వేదపండితులు వైభవంగా నిర్వహించారు. ఆలయంలో ఈ నెల 4 నుంచి కొనసాగుతున్న 18వ వార్షికోత్సవాల చివరి రోజు సందర్భంగా ఉదయం సంక్షేప రామాయణం, ఆదిత్య హృదయం హోమం పూజలను నిర్వహించారు. అనంతరం సీతారాముల ఉత్సవ మూర్తుల కల్యాణం వేదపండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని తిలకించేందుకు మంగపేట, చెరుపల్లి, కమలాపురం తదితర గ్రామాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ నర్రా శ్రీధర్, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
ఇసుక క్వారీల నిర్వహణకు డీఎల్‌ఎస్‌సీ నిర్వహించాలి
ఏటూరునాగారం: గిరిజన సొసైటీ క్వారీల నిర్వహణకు డీఎల్‌ఎస్‌సీ నిర్వహించాలని ఇసుక సొసైటీల అధ్యక్షుడు ఈసం రాజు అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని గిరిజన భవన్‌లో గిరిజన సొసైటీ సభ్యులు, నాయకులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కలెక్టర్ డీఎల్‌ఎస్‌సీ నిర్వహించకుండా ఉండడంతో క్వారీలు నడవడం లేదన్నారు. ఏటూరునాగారం, మంగపేట, కన్నాయిగూడెం, వాజేడు, వెంకటాపురం(కె) మండలంలోని వివిధ గ్రామాల ఇసుక సొసైటీలను గిరిజనేతరలకు అప్పగించడం విడ్డూరంగా ఉందన్నారు. పట్టా భూములకు ఎలాంటి ఫారెస్టు అనుమతి అవసరం లేదన్నారు. డీఎల్‌ఎస్‌సీ నిర్వహించి క్వారీలకు అనుమతి ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో దబ్బగట్ల సుమన్, బుచ్చయ్య, సుభద్ర, నాగబాబు, నర్సింగరావు, భరత్ తదితరులు పాల్గొన్నారు.
గిరిజనుల ఆందోళన
వాజేడు: మండల పరిధిలోని పెనుగోలు కాలనీలో సోలార్ సిస్టం ద్వారా ఏర్పాటు చేసిన మోటారు కాలిపోయింది. దీంతో తమకు తాగునీరు వసతి కల్పించాలని కోరుతూ పెనుగోలు కాలనీ గిరిజనులు ఖాళీ బిందెలతో శుక్రవారం ఆందోళన చేశారు. ఈ సందర్భంగా పలువురు గిరిజనులు మాట్లాడుతూ సోలార్ సిస్టం ద్వారా ఏర్పాటు చేసిన మోటారు కాలిపోయి నెలరోజులు అవుతున్నా.. అధికారులు మరమ్మతు చేయడం లేదని ఆరోపించారు. ఉదయం, సాయంత్రం మిషన్ భగీరథ, గ్రామ పంచాయతీ నీరు వస్తున్నప్పటికీ అవి తాగడంలేదన్నారు. సోలార్‌సిస్టం ద్వారా సరఫరా అవుతున్న నీరు పెనుగోలు కాలనీ గ్రామస్తులకే కాకుండా మండల కేంద్రంలోని నాగారం, జంగాలపల్లి, వాజేడు గ్రామాలకు చెందిన ప్రజలు తీసుకు వెళ్లి తాగుతుంటారు. అయితే సోలార్‌సిస్టం ద్వారా నడిచే మోటారు స్థానికంగా మరమ్మతు చేయడం కుదరదని, తప్పనిసరిగా హైదరాబాద్‌కు తీసుకెళ్లి మరమ్మతు చేయించాల్సి ఉంటుందని తెలిసింది.

సకాలంలో జాతర పనులు పూర్తి చేయాలి

సకాలంలో జాతర పనులు పూర్తి చేయాలి
Comments
Please login to add a commentAdd a comment