
స్థానిక సమరానికి సిద్ధంగా ఉండాలి
మంగపేట: త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల సమరానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని పంచాయతీరాజ్, సీ్త్ర శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క అన్నారు. మండలంలోని బోరునర్సాపురంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం మండల అధ్యక్షుడు మైల జయరాంరెడ్డి అధ్యక్షతన శుక్రవారం జరిగింది. సమావేశానికి ముఖ్య అతిథిగా మంత్రి సీతక్క హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పార్టీలో నెలకొన్న పరిస్థితులపై సీతక్కకు వివరించారు. మొదటి నుంచి పార్టీ అభివృద్ధికి పాటుపడిన వారికి ప్రాధాన్యం లేకపోవడంతో అసంతృప్తి నెలకొందని సయ్యద్‌హుస్సేన్ మంత్రికి వివరించారు. అనంతరం సీతక్క మాట్లాడుతూ కార్యకర్తలు, నాయకుల మధ్య ఎలాంటి విబేధాలు ఉన్నా తన దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవాలన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రామ, మండల నాయకులు ప్రత్యేక ప్రణాళికతో పనిచేసి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్ పటేల్, మహిళా విభాగం అధ్యక్షురాలు రేగ కల్యాణి, ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు గుమ్మడి సోమయ్య, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఇర్సవడ్ల వెంకన్న, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు ఇస్సార్‌ఖాన్, కర్రి నాగేంద్రబాబు, యానయ్య, వెంకటేశ్వర్లు, నరేందర్ తదితరులు పాల్గొన్నారు.
సెంట్రల్ లైటింగ్ పరిశీలన
ఏటూరునాగారం: ఏటూరునాగారం మండల కేంద్రంలోని కూరగాయల మార్కెట్ నుంచి వై జంక్షన్ వరకు నూతనంగా నిర్మించిన సెంట్రల్ లైటింగ్ సిస్టమ్‌ను శుక్రవారం రాత్రి మంత్రి పరిశీలించారు. నాయకులు, కార్యకర్తలతో కలిసి లైట్లు వెలుగుతున్న స్తంభాలను చూస్తూ పాదయాత్ర చేశారు.
విబేధాలు వీడి
సమన్వయంతో పనిచేయాలి
పంచాయతీరాజ్, సీ్త్ర శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క

స్థానిక సమరానికి సిద్ధంగా ఉండాలి
Comments
Please login to add a commentAdd a comment