రామప్పను సందర్శించిన శ్రీలంక టూరిస్టులు
వెంకటాపురం(ఎం)/గోవిందరావుపేట: ప్రపంచ ప్రసిద్ధి చెందిన రామప్ప దేవాలయాన్ని శుక్రవారం శ్రీలంకకు చెందిన 15 మంది టూర్ ఆపరేటర్స్ సందర్శించారు. తెలంగాణ పర్యాటక శాఖ, శ్రీలంక ఎ యిర్‌లైన్స్ ఆధ్వర్యంలో గత వారం రోజులుగా తె లంగాణ రాష్ట్రంలోని ప్రముఖ పర్యాటక ప్రదేశాలైన నాగర్జునసాగర్, నేలకొండపల్లి, బుద్దవనం, వరంగల్ కోట, భద్రకాళి, వేయిస్తంభాల గుడిని సందర్శించారు. పర్యటనలో భాగంగా శుక్రవారం రా మప్ప ఆలయం, లక్నవరం సరస్సులను సందర్శించారు. రామప్ప రామలింగేశ్వరస్వామిని వారు ద ర్శించుకోగా ఆలయ పూజారులు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు. ఆలయ విశిష్టత గురించి గైడ్ విజయ్‌కుమార్ వివరించగా ఆసక్తిగా తిలకించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడు తూ.. శ్రీలంక నుంచి తెలంగాణలోని పర్యాటక ప్ర దేశాలకు త్వరలో టూర్లను కండక్ట్ చేసేందుకు ప ర్యాటక ప్రదేశాలను సందర్శిస్తున్నామన్నారు. అనంతరం రామప్ప సరస్సును సందర్శించి సరస్సులో బోటింగ్ చేశారు. లక్నవరం సరస్సు ఎంతో ఆహ్లాదాన్ని ఇచ్చిందన్నారు. వారి వెంట టూరి జం అధికారులు సాయిరాం, శ్రీనాథ్‌లు ఉన్నారు. అదే విధంగా క్రొయేషియా దేశానికి చెందిన పీటర్ సందర్శించారు. శుక్రవారం సందర్భంగా రామలింగేశ్వరస్వామిని శ్రీ దుర్గ అవతారంలో అలంకరించినట్లు ఆలయ ప్రధాన అర్చకుడు హరీష్‌శర్మ తెలిపారు.
రామప్పను సందర్శించిన శ్రీలంక టూరిస్టులు
Comments
Please login to add a commentAdd a comment