ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా జరగాలి
ములుగు: వరంగల్, ఖమ్మం, నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా జరగాలని, ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం సిద్ధంగా ఉండాలని డిప్యూటీ ఎన్నికల అధికారి, అడిషనల్ కలెక్టర్ సీహెచ్ మహేందర్‌జీ అధికారులను సూచించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో జరిగిన అవగాహన శిక్షణ శిబిరంలో అడిషనల్ కలెక్టర్ మాట్లాడారు. ఎన్నికల కమిషన్ మేరకు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుందన్నారు. పోలింగ్ ముందు ఏజెంట్ల సమక్షంలో బ్యాలెట్ బాక్స్‌లను తెరిచి చూపించాలన్నారు. శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా పోలీసుశాఖ తరఫున తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వెంకటేష్, తహసీల్దార్ విజయభాస్కర్, సూపరింటెండెంట్ శివకుమార్, తదితరులు పాల్గొన్నారు.
ఆరోగ్యవంతమైన
సమాజ నిర్మాణానికి కృషి
ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి ప్రతిఒక్కరూ కృషి చేయాలని రెవెన్యూ అడిషనల్ కలెక్టర్ మహేందర్‌జీ సూచించారు. ఈ మేరకు కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో శుక్రవారం జాతీయ నులిపురుగుల దినోత్సవం సందర్భంగా ఆయా శాఖల ఆధ్వర్యంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో అడిషనల్ కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. నులిపురుగుల నివారణను అన్ని శాఖల అధికారులు బాధ్యతగా స్వీకరించాలన్నారు. డీఎంహెచ్‌ఓ డాక్టర్ గోపాల్‌రావు మాట్లాడుతూ ఈ నెల 10వ తేదీ నుంచి 17వ తేదీ వరకు 1 నుంచి 19 సంవత్సరాలు ఉన్న 73,244 మంది చిన్నారులకు మాత్రలను పంపిణీ చేస్తున్నామన్నారు. వైద్య సిబ్బంది నిబంధనల మేరకు నడుచుకోవాలని సూచించారు.
అడిషనల్ కలెక్టర్ మహేందర్‌జీ
Comments
Please login to add a commentAdd a comment