
ఎయిడ్స్‌పై అవగాహన తప్పనిసరి
ఏటూరునాగారం: ఎయిడ్స్‌పై తప్పనిసరి అవగాహన కలిగి ఉండాలని వైఆర్‌జీ కేర్ సంస్థ లింక్ వర్కర్ కిషన్, ఐసీటీసీ కౌన్సిలర్ వెంకటేశ్వర్లు అన్నారు. మండల కేంద్రంలోని పల్లె దవాఖానలో తెలంగాణ రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఆధ్వర్యంలో ఇంటిగ్రేటెడ్ హెల్త్ క్యాంపు శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎయిడ్స్ నాలుగు రకాలుగా వస్తుందని తెలిపారు. సురక్షితం కాని లైంగిక సంబంధాలు, కలుషితమైన ఇంజక్షన్లతో, పరీక్షించని రక్త మార్పిడితో పాటు హెచ్‌ఐవీ ఉన్న గర్భిణి నుంచి పుట్టబోయే బిడ్డకు ఎయిడ్స్ సోకుతుందన్నారు. ప్రతిఒక్కరూ హెచ్‌ఐవీ పరీక్షలు తప్పకుండా చేయించుకోవాలని తెలిపారు. మండల కేంద్రంలోని సామాజిక ఆస్పత్రిలో ఉన్న ఐసీటీసీ కేంద్రంలో హెచ్‌ఐవీ పరీక్షలు చేయించుకోవాలన్నారు. హెచ్‌ఐవీ ఉన్న వారిపై వివక్షత చూపకుండా ప్రేమతో ఆదరించాలన్నారు. ఈ హెల్త్‌క్యాంపులో 30 మందికి హెచ్‌ఐవీ పరీక్షలు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎన్‌ఎంలు గీత, సుగుణావతి, ఆశ వర్కర్లు కాళిక, సరిత, అరుణ తదితరులు పాల్గొన్నారు.
క్రీడా పోటీల్లో ద్వితీయ స్థానం
గోవిందరావుపేట: రాష్ట్ర స్థాయి పోలీస్ క్రీడా పోటీల్లో టీజీఎస్పీ 5వ బెటాలియన్ ద్వితీయ స్థానంలో నిలిచింది. మండల పరిధిలోని చల్వాయి గ్రామంలోని తెలంగాణ స్పెషల్ పోలీస్ (టీజీఎస్పీ) 5వ బెటాలియన్ సిబ్బంది ఇటీవల కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ కేంద్రంలో నిర్వహించిన 3వ రాష్ట్ర స్థాయి పోలీస్ క్రీడా పోటీల్లో పాల్గొన్నారు. మొత్తం 18 క్రీడాకారులు పోటీల్లో పాల్గొని 25 మెడల్స్ సాధించారు. ఈ టోర్నమెంట్‌లో పతకాలు సాధించిన వారిని కమాండెంట్ సుబ్రహ్మణ్యం అభినందించారు. విధుల్లోనే కాకుండా క్రీడాల్లోనూ టీజీఎస్పీ బెటాలియన్ సిబ్బంది ముందంజలో ఉండడం హర్షనీయమన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్ వేణుగోపాల్, సద్దాం హుస్సేన్, విజేతలు పాల్గొన్నారు.
అడవిలో నిప్పు పెట్టొద్దు
వాజేడు: అడవుల్లో ఇప్ప పువ్వు సేకరించే సమయంలో చెట్టు చుట్టూ శుభ్రం చేసుకోవాలని, ఎలాంటి సందర్భంలో కూడా నిప్పు పెట్టవద్దని ఎఫ్‌ఎస్‌ఓ నాగమణి అన్నారు. మండల పరిధిలోని బొమ్మనపల్లిలో ప్రజలు, విద్యార్థులకు శనివారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా అడవులతో ఉండే లాభాలను వివరించారు. ఈ కార్యక్రమంలో అటవీ శాఖ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.
కాటమయ్య కిట్లు వినియోగించుకోవాలి
ములుగు రూరల్: కల్లుగీత కార్మికులు ప్రభుత్వం అందించిన కాటమయ్య రక్షణ కిట్లను తప్పనిసరిగా వినియోగించుకోవాలని జిల్లా బీసీ సంక్షేమాధికారి రవీందర్‌రెడ్డి అన్నారు. మండల పరిధిలోని అబ్బాపూర్‌లో 3వ విడత రక్షణ కిట్లు కల్లుగీత కార్మికులకు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వృత్తిదారులకు సేఫ్టీ కిట్లపై ట్రైనర్లతో శిక్షణ ఇప్పిస్తున్నామన్నారు. గీత కార్మికుల ప్రమాదాల నివారణకు సేఫ్టీ మోకులు ఎంతగానో ఉపయోగపడుతాయని తెలిపారు. అనంతరం ఆ సంఘం నాయకుడు రవిగౌడ్ మాట్లాడుతూ ఏజెన్సీ, నాన్ ఏజెన్సీ తేడా లేకుండా కల్లుగీత కార్మికులందరికీ మోకులు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బుర్ర శ్రీనివాస్, పులి రమేష్, సత్యనారాయణ, రఘుపతి, రవిగౌడ్, శంకరయ్య, సదానందం, మధుకర్, శ్రీనివాస్, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.

ఎయిడ్స్‌పై అవగాహన తప్పనిసరి
Comments
Please login to add a commentAdd a comment