
No Headline
ములుగు రూరల్: ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, సీ్త్ర–శిశు సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ ధనసరి సీతక్క అన్నారు. మండల పరిధిలోని ఇంచర్ల గ్రామంలోని ఎంఆర్ గార్డెన్‌లో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్ ఆధ్వర్యంలో శనివారం ములుగు, వెంకటాపురం(ఎం)మండలాల ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పేదల అభివృద్ధి, సంక్షేమానికి సీఎం రేవంత్‌రెడ్డి ఎంతో కృషి చేస్తున్నారని తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేసి కాంగ్రెస్ ప్రభుత్వం దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. రైతుల సంక్షేమానికి ఏకకాలంలో రూ. 2లక్షల రుణమాఫీ చేసిన ఘనత సీఎం రేవంత్‌రెడ్డికే దక్కుతుందన్నారు. నియోజకవర్గంలో సుమారు రూ.30 కోట్లతో సీసీ రోడ్లు, డ్రెయినేజీలు, కల్వర్టులు మంజూరు చేసినట్లు వివరించారు. జిల్లా కేంద్రంలో నూతన బస్టాండ్, ఏటూరునాగారంలో బస్‌డిపోకు నిధులు మంజూరు చేశామని తెలిపారు. నియోజకవర్గంలో నాయకుల మధ్య ఎలాంటి విబేధాలు ఉన్నా తన దృష్టికి తీసుకురావాలన్నారు. పార్టీ నాయకులు గ్రామాలలో ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు పాటుపడాలన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యుర్థుల గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు కృషి చేయాలని సూచించారు. రాష్ట్రాన్ని పదేళ్లు పాలించిన బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజలకు రేషన్‌కార్డులు ఇచ్చిన పాపానాపోలేదన్నారు. భూమి లేని రైతుకూలీలను అధికారంలో ఉన్నప్పుడు పట్టించుకోలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన విధంగా నూతన రేషన్‌కార్డులు, రైతు భరోసా, బోనస్, ఇందిరమ్మ ఇళ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలను అమలు చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
వేతనాలు అందించాలని వినతి
ములుగు: పెండింగ్‌లో ఉన్న వేతనాలను విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ జిల్లా సమగ్రశిక్ష ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు భాస్కర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి సోమిడి కరుణాకర్, కోశాధికారి పాడ్య కుమార్ మంత్రి సీతక్కను కోరారు. ఈ మేరకు వారు మంత్రిని కలిసి వినతిపత్రం అందించారు. దీనిపై స్పందించిన మంత్రి స్కూల్ ఎడ్యుకేషన్ అధికారి నరసింహారెడ్డితో ఫోన్‌లో మాట్లాడారు. పెండింగ్ వేతనాలతో పాటు సమ్మె కాలపు వేతనాన్ని అందించాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment