
మోడల్ బస్టాండ్‌కు ప్రణాళిక సిద్ధం
● ఊహా చిత్రం విడుదల చేసిన అధికారులు
ములుగు: జిల్లా కేంద్రంలో ప్రస్తుతం ఉన్న బస్టాండ్ ప్రదేశంలో 80(సుమారు రెండు ఎకరాలు) గుంటల ప్రదేశంలో నూతనంగా నిర్మించనున్న మోడల్ బస్టాండ్ ఏర్పాటుకు ప్రణాళిక సిద్ధం చేశారు. ఈ మేరకు ఊహా చిత్రాన్ని ఇంజనీరింగ్ అధికారులు విడుదల చేశారు. ఈ మేరకు శనివారం సాయంత్రం తన క్యాంపు కార్యాలయంలో మంత్రి సీతక్క మ్యాప్‌ను పరిశీలించారు. ఇప్పటికే ప్రభుత్వం మోడల్ బస్టాండ్ కోసం రూ.5.11కోట్లు మంజూరు చేయగా నిధులకు అనుగుణంగా నిర్మాణాలు చేపట్టాలని మంత్రి సీతక్క సంబంధిత ఇంజనీరింగ్ శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అధికారులు సిద్ధం చేసిన మ్యాప్‌పై మంత్రి సానుకూలంగా స్పందించారు. ఇందులో 4795.47 స్క్వేర్‌ఫీట్లలో 10 బస్టాప్‌లకు చెందిన ప్రత్యేక ప్లాట్‌ఫాంలు, గ్రామీణ ప్రాంతాలకు వెళ్లే ప్లాట్ ఫాంలు, 2410.22 స్క్వేర్ ఫీట్లు పార్కింగ్ స్థలానికి కేటాయించారు. ప్రస్తుతం ఉన్న ఆర్టీసీ బస్టాండ్‌ను జాతీయ రహదారి 163వైపు ఉండేలా మ్యాప్ సిద్ధం చేశారు. తీక్షణంగా మ్యాప్‌ను గమనించిన మంత్రి సీతక్క సానుకూలంగా స్పందించారు. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా నిర్మాణం చేపట్టాలని సూచించారు.

మోడల్ బస్టాండ్‌కు ప్రణాళిక సిద్ధం
Comments
Please login to add a commentAdd a comment