
విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలి
● సినీ హీరో సంజోష్
ఏటూరునాగారం: విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలని మండల పరిధిలోని శంకరాజుపల్లికి చెందిన బేవర్స్ సినిమా హీరో సంజోష్ అన్నారు. మండల పరిధిలోని రామన్నగూడెం జెడ్పీహెచ్‌ఎస్ విద్యార్థులకు ఆయన శనివారం టై, బెల్ట్‌లు, షూస్, నోటుబుక్స్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను పుట్టిన మండలానికి ఏదైనా చేయాలనే ఉద్దేశంతో 150 మంది విద్యార్థులకు తన వంతు సాయం చేశానని తెలిపారు. అదే విధంగా కస్తూర్బా గాంధీ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న 96 మందికి ఎగ్జామ్స్ కిట్లను అందజేసినట్లు వివరించారు. బేవర్స్ సినిమా తనకు ఎంతో పేరుతెచ్చిందని తెలిపారు. త్వరలోనే సోదర సినిమా రిలీజ్ అవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో విజన్ కంపెనీ కో ఫౌండర్ ఉపేంద్ర రాజ్‌పల్లి, రామన్నగూడెం హెచ్‌ఎం కొయ్యడ మల్లయ్య, కోడి వెంకటేశ్వర్లు, ప్రభాకర్, సయ్యద్ సర్వర్, రాములు, రమాదేవి, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment