● ఏఎస్పీ శివం ఉపాధ్యాయ
వాజేడు: మావోయిస్టుల కదలికలపై ప్రత్యేక నిఘా పెట్టాలని పోలీస్ సిబ్బందికి ఏటూరునాగారం ఏఎస్పీ శివం ఉపాధ్యాయ సూచించారు. మండల పరిధిలోని పేరూరు పోలీస్ స్టేషన్‌ను ఏఎస్పీ శనివారం వెంకటాపురం(కె) సీఐ బండారి కుమార్‌తో కలిసి వెళ్లి తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పోలీస్ స్టేషన్లో పాటిస్తున్న 5 ఎస్ ఇంప్లిమెంటేషన్ కొనసాగించాలన్నారు. స్టేషన్ పరిసరాలను, సీఆర్‌పీఎఫ్ క్యాంపును పరిశీలించారు. సీఆర్‌పీఎఫ్ డీఎస్పీ, సిబ్బందితో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కొత్తగా నిర్మిస్తున్న సెక్యూరిటీ పెన్సింగ్‌పై సూచనలు చేశారు. గంజాయి, పేకాట, కోడి పందేలు,వన్య ప్రాణుల వేట, విద్యుత్ ఉచ్చుల ఏర్పాటును ఉపేక్షించవద్దన్నారు. అలాంటి వారిపై కేసులు నమోదు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పేరూరు ఎస్సై కృష్ణప్రసాద్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
సీఆర్‌పీఎఫ్ సిబ్బందికి సూచనలు చేస్తున్న ఏఎస్పీ
Comments
Please login to add a commentAdd a comment